Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Chanakya Niti: జీవితం సాఫీగా సాగాలంటే ఈ దుర్గుణాలను దూరంగా ఉంచండి
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు. జీవితం సాఫీగా సాగడానికి కొన్ని దుర్గుణాలను దూరంగా ఉంచాలని, తద్వారా జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పాడు చాణక్యుడు. ఆచార్యుడు చెప్పిన ఆ దుర్గుణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాతృత్వానికి దూరంగా ఉండొద్దు:
దానధర్మాలకు ఎప్పుడూ దూరంగా ఉండొద్దని చాణక్యుడు సూచించాడు. దాతృత్వం లేని జీవితం అర్థరహితం అన్నాడు. ఆదాయంలో కొంత భాగాన్ని ఎప్పుడూ పేదలకు, నిరాశ్రయులకు దానం చేయాలని చెప్పాడు. దానధర్మాన్ని అనుసరించడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని, ఇది మీకు, మీ కుటుంబానికి మంచిదని చెప్పాడు చాణక్యుడు.
అగౌరవం:
ఎవరినీ, ఎప్పుడూ అగౌరవపరచకూడదని చాణక్యుడు సూచించాడు. ఎదుటి వారిని గౌరవించినప్పుడే మనకూ గౌరవం దక్కుతుందన్నాడు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేదిగా అభివర్ణించాడు. మంచి మాట, మంచి వ్యక్తిత్వం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని సూచించాడు ఆచార్య చాణక్యుడు.
కోపం:
కోపం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వస్తుంది. కోపం మనిషికి అతిపెద్ద శత్రువు అని తెలిసినా దానిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం మూర్ఖత్వమని చాణక్యుడు చెప్పాడు. కోపం మానవ లక్షణం దానిని మొత్తానికే రాకుండా ఉంచడం అసాధ్యం. కానీ దానిని అదుపులో ఉంచగలగడం ముఖ్యమని చెప్పాడు చాణక్యుడు.
కరుణ లేకపోవడం:
ప్రతి ఒక్కరూ కరుణతో మెలగాలని చెప్పాడు చాణక్యుడు. కరుణ వల్ల ఇతరులకు మనపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని, సత్సంబంధాలు ఏర్పడతాయని సూచించాడు. అందుకే కరుణ అలవర్చుకోవాలని అన్నాడు ఆచార్య చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
