Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్!
రాను రాను సంబంధాలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. కొత్త కొత్త ప్రతిపాదనలు, వింత చర్యలు నిత్యం సంబంధాల్లో చూస్తూ ఉన్నాం. తాజాగా ఓ మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్పిన మాటలు విని పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.
పగలు ప్రియుడితో.. రాత్రి భర్తతో ఉంటాను.. మేమంతా ఒకే ఇంట్లో కలిసుంటాం, మాకు అనుమతి ఇప్పించండి అంటూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. వినడానికి విడ్డూరంగా, సినిమా కథలా అనిపించినా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఇది జరిగడం హాట్ టాపిక్ అయ్యింది.

అసలేం జరిగింది
యూపీ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలోని మహమూదాబాద్ తహసీల్ పరిధిలోని ఫుల్వారీపూర్ గ్రామానికి చెందిన అంజు, శుభం వర్మ భార్యాభర్తలు. అంజుకు శుభమ్ తో పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. . అయితే ఉనేరా గ్రామానికి చెందిన నితిన్ విశ్వకర్మ అనే వ్యక్తితో అంజుకి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భార్య, ప్రియుడితో చనువుగా ఉండటాన్ని భర్త శుభం ఏమాత్రం వ్యతిరేకించలేదు. పైగా నితిన్ ను తన సొంత తమ్ముడిలా భావించడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఒకరు భోజనం చేయకపోతే మరొకరు తిననంతగా భర్త, ప్రియుడు ప్రాణస్నేహితులుగా మారిపోయారు. ఏకంగా భర్త సమక్షంలోనే అంజు, నితిన్ ను గుడిలో పెళ్లి చేసుకుంది.
వీరి ఒప్పందం వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. పగటిపూట భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు ప్రియుడితో, రాత్రివేళ ప్రియుడు డ్యూటీకి వెళ్లినప్పుడు భర్తతో సమయం గడిపేలా అంజు ప్లాన్ చేసుకుంది. ఆరు నెలల క్రితమే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, బయటకు వెళ్లొద్దని, ఇంట్లోనే అందరూ కలిసి ఉండాలని అత్తమామలు మొదట అంగీకరించారు. కానీ అంజు ఆడపడుచు రాకతో కథ అడ్డం తిరిగింది. ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో, అత్తమామలు మనసు మార్చుకుని ఈ వింత కాపురాన్ని ఇంట్లోంచి గెంటేశారు.
తాను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఇంటిపై అంతస్తు నిర్మించానని, తనను ఇంట్లో ఉండనివ్వకపోతే కనీసం తన సామాన్లయినా తీసుకువెళ్లనివ్వాలని అంజు డిమాండ్ చేస్తోంది. కుటుంబ సభ్యులతో పంచాయితీ తెగకపోవడంతో భార్య, భర్త, ప్రియుడు.. ముగ్గురూ కలిసి రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
పోలీసులు షాక్
తాము ముగ్గురం, ఇద్దరు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటామని ఇన్‌స్పెక్టర్ కు తేల్చి చెప్పారు. ఈ విచిత్రమైన కేసును చూసి షాక్ అయిన ఇన్‌స్పెక్టర్ భాను ప్రతాప్ సింగ్.. తన సర్వీసులో ఇలాంటి వినతిపత్రం ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిల్లలు కూడా తాము తండ్రి, తన తల్లి ప్రియుడు ఇద్దరితోనూ ఉంటామని చెప్పడం గమనార్హం.
పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆ ముగ్గురూ వెనక్కి తగ్గలేదు. నేను నా భార్యను, నితిన్ ను ఇద్దరినీ వదిలిపెట్టను.. అవసరమైతే ఇల్లు వదిలి వేరే చోట వెళ్లిపోతాం కానీ కలిసే ఉంటాం అని భర్త శుభం పోలీసుల ముందే తెగేసి చెప్పాడు. ప్రస్తుతం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, ఆ ప్రాంతమంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వింత బంధాన్ని చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
