Latest Updates
-
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా!
గుండెల్ని పిండేస్తున్న విశాఖ చిన్నారి ఉదంతం..డాక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు!
ఏపీలోని వైజాగ్ లోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో రెండు రోజుల క్రితం తమ్మన ప్రణయ్ తేజ అనే యూకేజీ చదివే బాలుడు టీచర్ మందలించిన కారణంగా చనిపోయిన హృదయ విదారక ఘటన ప్రస్తుతం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బడిలో అక్షరాలు దిద్దుకోవాల్సిన ఒక యూకేజీ చిన్నారి.. మహిళా టీచర్ కోపానికి బలైపోయిన సీసీటీవీ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి.
హోమ్ వర్క్ చేయలేదన్న కారణానికే ఆ టీచర్ బాలుడిని పట్టుకుని ఊపడం, దుస్తులు లాగడం, చెంపపై బలంగా కొట్టడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ దెబ్బకు, బెదిరింపుకు భయపడిన ఆ చిన్నారి అక్కడికక్కడే స్పృహతప్పి టీచర్ పై పడిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను రగిలిస్తోంది.

అయితే ఈ దృశ్యాలు చూసిన తర్వాత చాలా మంది మదిలో తలెత్తే మొదటి ప్రశ్న.. ఒక చెంపదెబ్బకు ఆ చిన్నారి ఎలా చనిపోయాడు? అని. ఈ సందేహాలకు తమిళనాడుకి చెందిన ప్రముఖ డాక్టర్ ప్రకాష్ మూర్తి తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా కీలకమైన విషయాలను షేర్ చేశారు.
డాక్టర్ ప్రకాష్ మూర్తి ప్రకారం.. పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలే ఇలాంటి ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో గుండె కవాటాలు సరిగ్గా మూసుకోకపోవడం వల్ల ASD (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్), VSD (వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్) వంటి లోపాలు ఉంటాయి. అలాగే AAOCA, లేదా CPVT, బ్రుగాడా సిండ్రోమ్ వంటి గుండెకు సంబంధించిన విద్యుత్ అసాధారణతలు కూడా ఉండొచ్చు.
వైజాగ్ చిన్నారి కేసులో, టీచర్ ఒక్కసారిగా బెదిరించి కొట్టడంతో బాలుడు తీవ్ర భయానికి, ఒత్తిడికి గురై ఉంటాడు. ఈ ఆకస్మిక షాక్ వల్ల గుండె స్పందన రేటు విపరీతంగా పెరిగిపోయి వెంట్రిక్యులర్ అరిథ్మియాకు దారితీసి, తద్వారా కార్డియాక్ అరెస్ట్ సంభవించి ఉండొచ్చని డాక్టర్ వివరించారు.
తల్లిదండ్రులు గమనించాల్సిన లక్షణాలు
పిల్లల్లో పుట్టుకతో వచ్చే ఇటువంటి గుండె జబ్బులను తల్లిదండ్రులు కొన్ని లక్షణాల ద్వారా పసిగట్టవచ్చు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోవడం, ఛాతీ ఎముకలు స్పష్టంగా కనిపించడం, ఆడుకునేటప్పుడు త్వరగా అలసిపోవడం, ఆయాసపడటం వంటివి ముఖ్యమైన సూచికలు. పిల్లల గుండె కొట్టుకునేటప్పుడు పుష్ పుష్ లాంటి వింత శబ్దాలు వచ్చినా వెంటనే అలర్ట్ కావాలి. కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి చరిత్ర ఉంటే, కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం ద్వారా ముప్పును నివారించవచ్చు.
నేర్చుకోవాల్సిన పాఠం
అయితే అధికారిక పోస్ట్ మార్టం ఇంకా రాలేదు కాబట్టి అది వస్తే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుంది. ఏది ఏమైనా పసిపిల్లలు అల్లరి చేయడం, తప్పులు రాయడం సహజం. ఉపాధ్యాయులు వారి పట్ల అంతులేని ఓర్పు, సహనం ప్రదర్శించాలి. శారీరకంగా దండించడం, ముఖ్యంగా తల, ముఖంపై కొట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితం కాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
