Latest Updates
-
ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! -
చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి! -
చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా.. -
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? -
ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు -
ఓడియమ్మ: బాత్రూమ్ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. -
చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది? శరీరంలో జరిగే పరిణామాలు ఇవే!
ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్ జెండర్
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన ఒక పేద కుటుంబంలో జన్మించిన అని.. చిన్నప్పటి నుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఎంతో చురుకుగా ఉండేది. ఎన్ని కష్టాలున్నా పట్టుదలతో చదివి, మంగళూరులో బీఈడీ కోర్సులో మెరిట్ సీటు సాధించింది. కానీ ట్రాన్స్ జెండర్ అన్న కారణంతో కాలేజీలో ఎదురైన వేధింపులు, అవమానాలతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.
నిలువ నీడ లేక, కడుపు నింపుకోవడానికి దారి కానరాక, సమాజ తిరస్కరణతో రోడ్లపై భిక్షాటన చేయాల్సిన దుస్థితికి చేరుకుంది. ఇన్ని అడ్డంకులు చుట్టుముట్టినా ఆమెలో ఆత్మగౌరవ జ్వాల ఏమాత్రం ఆరిపోలేదు. ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడి గౌరవప్రదమైన, స్వతంత్ర జీవితాన్ని గడపాలని గట్టిగా సంకల్పించుకుంది.

జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సాయంత్రం
అని జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిన కీలక సంఘటన ఒక సాయంత్రం జరిగింది. ట్రాన్స్ జెండర్ అనే కారణంతో ఆటోవాలాలు ఆమెను ఎక్కించుకోవడానికి నిరాకరించడమే కాకుండా, దారుణంగా హేళన చేశారు. అవమాన భారంతో కన్నీళ్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లిన ఆమె, ఆ రోజే ఒక శపథం చేసింది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం మరెవరికీ రాకూడదని, తన కథను తానే మార్చుకోవాలని బలంగా నిశ్చయించుకుంది. ఆమె ఆశయానికి కన్నతల్లి అందించిన ధైర్యం, కొద్దిపాటి రుణాల సాయంతో అహర్నిశలు శ్రమించి నాలుగు సొంత ఆటోలను కొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఉచిత ప్రయాణంతో మానవత్వం చాటుతూ..
ప్రస్తుతం మంగళూరులోని దెరళకట్టే ప్రాంతంలో అని తన నాలుగు ఆటోలను అద్దెకు నడుపుతోంది. డ్రైవర్ల నుండి రోజుకు కేవలం రూ. 200 నామమాత్రపు అద్దె మాత్రమే తీసుకుంటూ, ఆ డబ్బును సైతం తన కోసం కాకుండా పేద కుటుంబాల ఆకలి తీర్చడానికి, వీధి జంతువులకు ఆహారం పెట్టడానికి వినియోగిస్తోంది. అయితే తన ఆటోలు నడిపే ప్రతి డ్రైవర్ కు ఆమె ఒక కఠినమైన నిబంధన పెట్టింది. గర్భిణీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఎక్కడికైనా పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని స్పష్టంగా ఆదేశించింది. తాను గతంలో అనుభవించిన తిరస్కరణ మరెవరూ ఎదుర్కోకూడదని ఆటోలపై ప్రత్యేకంగా ఉచిత ప్రయాణం స్టిక్కర్లను కూడా అంటించింది. ఇలా ప్రత్యేక స్టిక్కర్లు అంటించడం ద్వారా సహాయం అవసరమైన ప్రయాణికులకు ఏమాత్రం సంకోచం లేకుండా గౌరవప్రదమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంది.
కేవలం ఆటోల వ్యాపారానికే పరిమితం కాకుండా, అని తన కృషితో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగింది. ఫిట్‌నెస్ రంగంలో సర్టిఫైడ్ పర్సనల్ జిమ్ ట్రైనర్ గా రాణిస్తూనే కన్నడ సినిమా రంగంలో అడుగుపెట్టింది. అంతేకాదు, మంగళూరులో అని కేఫ్ కూడా ప్రారంభించింది. ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధ ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని నిర్మించి, వారికి జీవిత చరమాంకంలో ప్రేమ, గౌరవంతో కూడిన సురక్షితమైన ఆవాసాన్ని అందించడమే తన లక్ష్యమని అని సగర్వంగా చెబుతోంది.



Click it and Unblock the Notifications
