Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Marriage: నార్త్ ఇండియా,సౌత్ ఇండియా పెళ్లిళ్ల మధ్య తేడాలివే
ప్రతి మనిషికి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కూడా కలిపే పవిత్ర బంధం. మనదేశంలో పెళ్లి అంటే పెద్ద వేడుక. చాలా దేశాల్లో పెళ్లి అంటే కొన్ని గంటల సంబరమే. అయితే మనదేశంలో మాత్రం కంప్లీట్ ఢిఫరెంట్. కొన్ని రోజుల తరబడి ఇళ్లు అంతా సందండి నెలకొనే పెద్ద పండగ. ఇళ్లంతా సందడి.. సాంప్రదాయ ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేకమైనవాటితో పెళ్లి వేడుక నిండి ఉంటుంది. వారాల తరబడి ఈ వేడుకును సెలబ్రేట్ చేసుకుంటారు. తమ స్థోమతను బట్టి లక్షలు,కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు.
అయితే పెళ్లికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు ప్రాంతం ఆధారంగా విభిన్నంగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో,ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే పెళ్లిళ్ల మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. దుస్తులు, ఆహారం,సమయం ఇలా అన్ని విషయాల్లో తేడా ఉంటుంది. కాబట్టి దక్షిణాది పెళ్లిళ్లకు..నార్త్ ఇండియాలో పెళ్లిళ్లకు మధ్య తేడా ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

దక్షిణ భారత, ఉత్తర భారతీయ వివాహాల మధ్య ముఖ్యమైన తేడాలివే
వివాహ ఆచారాలు, సంస్కృతి
దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే పెళ్లిళ్లు మతపరమైన,సాంప్రదాయ ఆచారాల ప్రకారం జరుగుతాయి. పెళ్లి చేసుకోడానికి ముందు ముహూర్తాలు చూడటం దగ్గర నుంచి తాళిబొట్టు కట్టడం వరకు ఇలా చాలానే ఉంటాయి. ప్రతి వేడుక ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంటుంది. మరోవైపు నార్త్ ఇండియా పెళ్లిళ్లు.. హల్దీ,సంగీత్, జూటా చుపాయ్ వంటి వేడుకలతో విభిన్నంగా ఉంటాయి.
వివాహ ముహూర్తం, సమయం
నార్త్ ఇండియా,సౌతిండియా పెళ్లిళ్ల మధ్య తేడాలలో మరొకటి పెళ్లి టైం,ముహుర్తం. సాధారణంగా మనదగ్గర పెళ్లిళ్లు తెల్లవారుజామున ప్రారంభమై ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. నార్త్ ఇండియాలో పెళ్లి సాయంత్రం ప్రారంభమవుతుంది..మరుసటి రోజు వరకు కొనసాగుతుంది.
పెళ్లి బట్టలు,నగలు
దక్షిణ భారతదేశంలోని వధువులు సాధారణంగా సాంప్రదాయ పట్టు చీర ధరిస్తారు.. వరుడు తెల్లపంచె లేదా తెల్ల ఫ్యాంట్ ధరిస్తారు. వధువు మతం, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా బంగారు ఆభరణాలను ధరిస్తుంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో వధువులు రంగురంగుల చీరలు లేదా లెహంగాలను ధరించి వాటిని పోల్కీ, కుందన్ సెట్‌ల వంటి అలంకరించబడిన బంగారు ఆభరణాలతో జత చేస్తారు.
ఫుడ్ మెనూ
నార్త్,సౌతిండియా పెళ్లిళ్లు రెండూ విభిన్నమైన పాక సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ రకాల ఆహారాన్ని కలిగి ఉంటాయి. దక్షాణాది పెళ్లిళ్లలో వడ్డించే వంటకాలలో దోసెలు, ఇడ్లీలు, వడలు, అన్నం సహా అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కొంతమంది అయితే నాన్ వెజ్ కూడా పెడుతుంటారు. మరోవైపు ఉత్తరాది పెళ్లిళ్లలో రిచ్ కూరలు, సువాసనగల కబాబ్‌లు ఉంటాయి. తందూరి కిచెన్, జిలేబీ, గులాబ్ జామూన్, రుచికరమైన బిర్యానీలు వంటి రిచ్ డెజర్ట్‌లు కూడా మెనులో భాగంగా ఉంటాయి.
డ్యాన్స్, మ్యూజిక్
నాదస్వరం, మృదంగం వంటి సాంప్రదాయ వాయిద్యాలు, భరతనాట్యం, కర్ణాటక సంగీతం దక్షిణాది వివాహాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గిద్దా, భాంగ్రా వంటి ఉత్సాహభరితమైన జానపద నృత్యాలు, షెహనాయ్, బాలీవుడ్ సంగీతం, నృత్య ప్రదర్శనలు ఉత్తర భారతీయ వివాహాలలో ప్రధాన వేదికగా ఉంటాయి.
రోజుల తేడా
దక్షిణ భారతీయ వివాహాలు మూడు నుండి ఐదు రోజుల వరకు జరుగుతాయి. వధువు,వరుడి కుటుంబాలు కలిసి ఎక్కువ సమయం గడుపుతారు,ఆచారాలకు అంకితమైన మతపరమైన వేడుకలలో పాల్గొంటారు. ఉత్తరాది వివాహాలు తక్కువగా ఉంటాయి.. మూడు రోజుల్లోనే మొత్తం కంప్లీట్ అవుతుంది.



Click it and Unblock the Notifications