ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పండుగలు వచ్చాయంటే చాలు.. స్నేహితులు, బంధువుల రాకపోకలతో, బహుమతుల మార్పిడితో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. పండుగ హడావిడి ముగిశాక, మన ఇళ్లలో ప్లాస్టిక్, అట్ట లేదా రేకుతో చేసిన ఎన్నో ఖాళీ స్వీట్ బాక్సులు గుట్టలుగా పేరుకుపోతాయి. వాటిని చూసి ఇక ఇవి ఎందుకూ పనికిరావు అనుకుని డస్ట్‌బిన్‌లో పారేయడమో లేదా పాత సామాన్ల వాడికి వేయడమో చేస్తుంటాం.

కానీ కాస్త క్రియటివిటీ జోడిస్తే ఈ పాత స్వీట్ బాక్సులు మీ ఇంటి రూపురేఖలనే మార్చేస్తాయని మీకు తెలుసా? కొత్త వస్తువులు కొనే ఖర్చును ఆదా చేయడంతో పాటు, మీ ఇంటిని ఎంతో క్రమబద్ధంగా ఉంచే 6 అద్భుతమైన ఉపయోగాలు ఇక్కడ చూడండి.

Don t Throw Away Empty Sweet Boxes 6 Brilliant Ways to Reuse Them at Home

ఇండోర్ ప్లాంటర్స్‌ గా మార్చేద్దాం

మీకు మొక్కలు పెంచే హాబీ ఉంటే, ఈ బాక్సులను అందమైన కుండీల్లా వాడుకోవచ్చు. దృఢంగా ఉండే ఒక బాక్సును తీసుకుని రంగుల కాగితాలు, జూట్ తాడు లేదా క్లాత్‌ తో కవర్ చేయండి. దాని లోపల చిన్న కుండీలను పెట్టి బాల్కనీలో లేదా కిటికీ దగ్గర అలంకరించుకోండి. అట్టపెట్టెల్లో నేరుగా మట్టి, నీరు పోయకూడదు.

నగల కోసం క్యూట్ ఆర్గనైజర్

చాలా స్వీట్ బాక్సుల్లో లోపల చిన్న చిన్న అరలు ఉంటాయి. బాక్స్ లోపల వెల్వెట్ క్లాత్ లేదా కలర్ పేపర్ అంటించండి. మీ ఇయర్‌ రింగ్స్, ఉంగరాలు, చైన్లు, హెయిర్ పిన్స్ లాంటివి ఇందులో పెట్టుకుంటే, ఎక్కడికీ పోకుండా పదిలంగా ఉంటాయి. వెతుక్కొనే పనిలేకుండా సులభంగా దొరుకుతాయి.

ఇంటి అలంకరణకు కళాత్మక రూపం

గట్టిగా, కాస్త డిజైనర్‌ గా ఉండే బాక్సులపై మీ ప్రతిభను చూపించండి. యాక్రిలిక్ పెయింట్స్, అద్దాలు, పూసలు, లేసులు అంటించి వాటికి సరికొత్త లుక్ తీసుకురండి. వీటిని డ్రాయింగ్ రూమ్‌ లో సెంటర్ టేబుల్ లేదా సైడ్ టేబుల్ మీద పెడితే మీ ఇంటికి రాయల్ లుక్ రావడం ఖాయం.

డెస్క్ మీద స్టేషనరీ స్టాండ్‌ గా

ఇంట్లో పెన్నులు, పెన్సిళ్లు, కత్తెరలు ఇల్లంతా చెల్లాచెదురుగా పడి ఉంటాయా? పాత స్వీట్ బాక్స్‌ లో చిన్న అట్టముక్కలతో అరలు ఏర్పాటు చేసుకోండి. ఇది మీ స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ డెస్క్‌ ను ఎంతో నీట్‌ గా ఉంచే అద్భుతమైన స్టేషనరీ ఆర్గనైజర్‌ లా పనిచేస్తుంది.

గిఫ్ట్ ప్యాకింగ్ కోసం

స్నేహితులకు బహుమతులు ఇచ్చేటప్పుడు కొత్త బాక్సులు కొనకండి. పాత మిఠాయి పెట్టె లోపల కొత్త పేపర్ వేసి, పైన ఒక అందమైన రిబ్బన్ లేదా కృత్రిమ పువ్వు అంటించండి. ఇందులో చాక్లెట్లు, చిన్న గిఫ్ట్స్ లేదా హ్యాండ్‌క్రాఫ్ట్స్ పెట్టి ఇస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది.

హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్‌ తో చేసి చూడండి! హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్‌ తో చేసి చూడండి!

వంటగదిలో చిరు వస్తువుల నిల్వకు

కిచెన్‌లో మసాలా ప్యాకెట్లు, యాలకులు, లవంగాలు, టీ బ్యాగులు పెట్టుకోవడానికి ఇవి భలేగా పనికొస్తాయి.

ముఖ్య విషయం ఏంటంటే..

ఈ బాక్సులను తిరిగి వాడే ముందు వాటిని శుభ్రంగా కడగాలి. నూనె మరకలు, చెడు వాసన, బూజు ఉన్నవాటిని వాడకండి. అట్టపెట్టెలను ఎట్టిపరిస్థితుల్లోనూ నీటికి తగలనివ్వకండి. అలాగే ఫుడ్ గ్రేడ్ కాని బాక్సుల్లో నేరుగా ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదు.

Story first published: Thursday, November 12, 2026, 8:28 [IST]
Desktop Bottom Promotion