Latest Updates
-
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్!
ముఖ్యమైన హిందూ పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథినాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 19న(ఆదివారం) అక్షయ తృతీయ జరుపుకుంటారు. సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ నాశనం కానిది లేదా తరగనిది అని అర్థం. ఈ రోజున చేసే దానధర్మాలు, ప్రారంభించే కొత్త పనులు, కొనుగోలు చేసే వస్తువులు ఎప్పటికీ అక్షయంగా వృద్ధి చెందుతాయని భక్తులు నమ్ముతారు.

ఈ రోజునే విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే త్రేతాయుగం ప్రారంభమైన రోజు కూడా ఇదే. వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్పగా, వినాయకుడు రాయడం ప్రారంభించిన పవిత్రమైన రోజు అక్షయ తృతీయ. వనవాసంలో ఉన్న పాండవులకు, ద్రౌపదికి సూర్యభగవానుడు ఎప్పటికీ అన్నం తరిగిపోని అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు ఇదే.
పేదరికంతో బాధపడుతున్న కుచేలుడు, అటుకులు పట్టుకుని శ్రీకృష్ణుడిని కలిసి అష్టైశ్వర్యాలు పొందిన రోజు ఇది. భగీరథుని తపస్సుకు మెచ్చి గంగాభవాని శివుని జటాజూటం నుండి భూమికి దిగివచ్చిన పర్వదినం ఇదే.ఈ రోజున బంగారం లేదా వెండి కొంటే ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుందని నమ్మకం. అలాగే అన్నదానం, వస్త్రదానం, జలదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు అక్షయ తృతీయ సందర్భంగా విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.

సాంప్రదాయ,భక్తిపూర్వక శుభాకాంక్షలు
-మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీ ఇంట సిరిసంపదలు అక్షయంగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
-లక్ష్మీ నారాయణుల కృపాకటాక్షాలతో మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
-ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో కొత్త ఆశలను, అంతులేని ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
-మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవ్వాలి. హ్యాపీ అక్షయ తృతీయ.
-ఈ పవిత్రమైన రోజున మీరు చేసే ప్రతి దానం మీకు వేయింతల పుణ్యాన్ని ప్రసాదించాలి. హ్యాపీ అక్షయ తృతీయ.
-ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి.. ప్రతి మనసులో శాంతి నెలకొనాలి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
-సకల దేవతల ఆశీస్సులతో మీ జీవితం స్వర్ణమయం కావాలి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ లు
-అక్షయం కావాలి మీ ఆనందం.. సుసంపన్నం కావాలి మీ జీవితం. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
-ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలి.
-లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. హ్యాపీ అక్షయ తృతీయ 2026.
-మీరు కొనే చిటికెడు బంగారమైనా మీ ఇంట సిరుల వర్షం కురిపించాలి.
-నవ్వులు అక్షయం.. స్నేహాలు అక్షయం.. ఈ పండుగ తెచ్చే ఆనందం అక్షయం.
-ఆపదలు తొలగిపోయి, అదృష్టం వరించి, మీ ఇంట మహాలక్ష్మి కొలువుదీరాలి.
-మంచి మనసుతో చేసే ప్రతి పని అక్షయమే. హ్యాపీ అక్షయ తృతీయ.
-ఈ అక్షయ తృతీయ మీ బ్యాంక్ అకౌంట్ ను, మీ ముఖంలోని చిరునవ్వును ఫుల్ చేయాలి.
-కొత్త పనులకు శుభారంభం..అక్షయ తృతీయకు స్వాగతం.
-కొన్న బంగారం కన్నా, సంపాదించిన మంచితనం విలువ ఎక్కువ. అందరికీ శుభాకాంక్షలు.
-పేదలకు సాయం చేద్దాం..పుణ్యాన్ని అక్షయం చేసుకుందాం.
-ఓం శ్రీ మహాలక్ష్మీ నమః... అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

సంపద, వ్యాపార అభివృద్ధి శుభాకాంక్షలు
-ఈ పవిత్రమైన రోజున మీరు కొనే ప్రతి వస్తువూ మీ వ్యాపారానికి అదృష్టాన్ని తీసుకురావాలి. హ్యాపీ అక్షయ తృతీయ.
-మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది, లాభాలు అక్షయంగా రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ అక్షయ తృతీయ 2026.
-కనకదుర్గమ్మ దయతో మీ ఇంట కనక వర్షం కురవాలి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
-శ్రమకు తగ్గ ప్రతిఫలం ఎప్పటికీ అక్షయంగా దక్కుతుంది. మీకు వ్యాపార విజయాలు దక్కాలని ఆశిస్తూ..హ్యాపీ అక్షయ తృతీయ.
-మీ కస్టమర్ల నమ్మకం, మీ వ్యాపార లాభం రెండు అక్షయంగా సాగాలి.
-లక్ష్మీదేవి అడుగులతో మీ ఆఫీసు,వ్యాపార సంస్థ కళకళలాడాలి. హ్యాపీ అక్షయ తృతీయ 2026.
స్ఫూర్తిదాయక కోట్స్
-బంగారం కొంటే సంపద పెరుగుతుంది.. కానీ మంచి మనసుతో దానం చేస్తే పుణ్యం అక్షయంగా మిగులుతుంది.
-అక్షయ తృతీయ అంటే వస్తువులను కూడబెట్టడం మాత్రమే కాదు, మంచి జ్ఞాపకాలను, అనుబంధాలను అక్షయం చేసుకోవడం.
-జ్ఞానం అనేది ఎప్పటికీ తరిగిపోని నిజమైన అక్షయ సంపద. ఈ రోజున కొత్త విషయాలు నేర్చుకుందాం.
-ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే మించిన అక్షయ పుణ్యం ఈ సృష్టిలో మరొకటి లేదు.
-కష్టాలను క్షయం చేసి, ఆత్మవిశ్వాసాన్ని అక్షయం చేసేదే నిజమైన అక్షయ తృతీయ.
-మనం చేసే చిన్న సాయం ఇంకొకరి జీవితంలో అక్షయమైన ఆనందాన్ని నింపుతుంది. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
-ప్రేమ, దయ, జాలి..ఇవి పంచేకొద్దీ పెరిగే అక్షయ పాత్ర లాంటివి. హ్యాపీ అక్షయ తృతీయ 2026.



Click it and Unblock the Notifications