Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
సెలవు రోజున ఆఫీస్ కు రమ్మన్న మేనేజర్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మహిళా ఉద్యోగిని..వీడియో చూడండి
మనదేశంలో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కష్టాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. పనిచేసే గంటలు రూల్ ప్రకారం ఒకటి ఉంటే..సదరు కంపెనీలు ఆయా ఉద్యోగుల చేత రకరకాల పేర్లతో ఎక్కువ గంటలు పనిచేసేలా చేయడం వంటి సంఘటనలు మనం గతంలో కూడా అనేకం చూశాం. జీతం లేని ఓవర్‌టైమ్, హద్దులు లేని పని గంటలు, వీకెండ్స్‌లోనూ వదలని టార్గెట్లు.. ఇవి చాలామంది ఉద్యోగుల రోజువారీ కష్టాలు.

సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సెలవు రోజున ఆఫీసుకు రమ్మన్న మేనేజర్ కు ఒక మహిళా ఉద్యోగిని ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలో..అఫ్రీన్ అనే ఓ మహిళా ఉద్యోగినికి ఆమె మేనేజర్ నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు ఆఫీస్ కు ఎందుకు రాలేదు? టీమ్ అంతా నీకోసం ఎదురుచూస్తోంది. వెంటనే ఆఫీసుకు రా అంటూ మేనేజర్ ఆర్డర్ వేస్తుంది. దానికి అఫ్రీన్ ఏమాత్రం తడబడకుండా, చాలా కూల్ గా ఈరోజు శనివారం.. నాకు వీకాఫ్ కాబట్టి నేను ఆఫీసుకు రాను అని బదులిస్తుంది. ఆ సమాధానంతో కంగుతిన్న మేనేజర్.. గత రెండు నెలలుగా ప్రతి శనివారం వస్తున్నావు కదా? సడెన్ గా ఇప్పుడు ఏమైంది? అని నిలదీస్తాడు.
అప్పుడు అఫ్రీన్ చెప్పిన సమాధానం ప్రతి ఉద్యోగికి కనెక్ట్ అవుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం, ఈ వీకెండ్ ఒక్కదానికి సాయం చేయండి అని మీరు అడిగితే కాదనలేక వచ్చాను. ఆపదలో ఉన్నప్పుడు టీమ్ కు సాయం చేయడం కోసమే అలా చేశాను తప్ప, నా వీకెండ్స్ అన్నీ కంపెనీకి రాసివ్వలేదు. అలా రావడం అనేది నా దినచర్యలో భాగం కాదు అని కుండబద్దలు కొట్టింది.
అయినా తగ్గని మేనేజర్ టీమ్ అంతా చాలా ఒత్తిడిలో ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలి అని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు దిగగా... దానికి అఫ్రీన్ టీమ్ ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడిలోనే ఉంటుంది. దాని కోసం నా సెలవును త్యాగం చేసి ఉచితంగా పనిచేయడం నా బాధ్యత కాదు అని తేల్చి చెబుతుంది. ఉద్యోగం పర్మినెంట్ అయ్యాక నీ ప్రవర్తన మారిపోయిందని మేనేజర్ నిందించగా.. నేను మారలేదు, ఫ్రీగా పనిచేయడం మానేశాను అంతే అని దీటుగా బదులిచ్చింది.
ఒకవేళ నేను ఈరోజు పనిచేయాల్సి వస్తే, నాకు ఓవర్ టైమ్ పేమెంట్ ఇస్తారో లేదో ముందే చెప్పండి అని నిలదీయడంతో, మేనేజర్ నీళ్లునమిలి ఈ విషయం సోమవారం మాట్లాడుకుందాం అంటూ ఫోన్ కట్ చేసింది. ఈరోజు గనుక నేను ఎదురు తిరిగి ఉండకపోతే, వాళ్ల జస్ట్ ఈ ఒక్క వీకెండ్ అనే డైలాగ్ సంవత్సరాల తరబడి కొనసాగేది అంటూ అఫ్రీన్ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది నిజంగా జరిగిన ఫోన్ కాల్ కాదు. అఫ్రీన్ ఒక కంటెంట్ క్రియేటర్. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఇలా స్కిట్స్ రూపంలో తీస్తుంటుంది. ఇది స్క్రిప్టెడ్ వీడియో అయినప్పటికీ, భారతదేశంలోని వేలాది ఆఫీసుల్లో జరుగుతున్న నగ్న సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంతో ఇది విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అఫ్రీన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కామెంట్స్ సెక్షన్ అయితే ఉద్యోగుల బాధలతో నిండిపోయింది.



Click it and Unblock the Notifications
