Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు
విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశాన్ని ఎవరైనా పల్లెత్తి మాట అంటే మన రక్తం మరిగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటలీలో జరిగింది. ఇటలీ పర్యటనలో ఉన్న కొందరు భారతీయ మహిళలకు ఒక రెస్టారెంట్ లో తీవ్ర అవమానం ఎదురైంది. అయితే వారు మౌనంగా భరించలేదు. తమ దేశాన్ని కించపరిచిన ఒక వెయిటర్ ను నడి వీధిలో నిలదీసి, అతనితోనే సారీ చెప్పించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటలీలో మాకు జరిగింది ఇదే అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఖుషీ దుబే షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే?
వివాదానికి అసలు కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, రికార్డ్ అయిన వీడియోలో హుస్సేన్ అనే బంగ్లాదేశ్ కి చెందిన వెయిటర్ భారతీయ మహిళల బృందంపై విపరీతమైన అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. వారిని ఉద్దేశించి ఫ..గ్ ఇండియా నుండి వచ్చిన వాళ్ళు అంటూ అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు. ఇది కేవలం ఆ మహిళలను మాత్రమే కాకుండా, యావత్ భారతదేశాన్ని అవమానించేలా ఉంది.
వెనక్కి తగ్గని మహిళలు..
విదేశీ గడ్డపై ఉన్నామని ఆ మహిళలు ఏమాత్రం భయపడలేదు. వారిలో ఒకరు ధైర్యంగా ముందుకు వచ ముందు నీ భాషను అదుపులో పెట్టుకో. మేము మహిళలం, మాతో ఎలా మాట్లాడాలో నేర్చుక అంటూ గట్టిగా బదులిచ్చారు. అయినా ఆ వెయిటర్ తన అహంకారాన్ని వీడకుండా మీరంతా దరిద్రపు ఇండియా నుండి వచ్చారు, ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు అంటూ జాత్యహంకార వ్యాఖ్యలకు దిగాడు. దానికి ఆ మహిళలు హుస్సేన్ గారూ, మర్యాదగా ఉండండి. ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకోండి అని దీటుగా జవాబిచ్చారు.
పోలీసుల ఎంట్రీ.. వెయిటర్ యూటర్న్..
ఈ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఆ వెయిటర్ స్వరం మారింది. తన తప్పును కప్పిపుచ్చుకుంటూ ఏదో మొక్కుబడిగా క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ భారతీయ నారీమణులు అంతటితో వదిలిపెట్టలేదు. మా దేశాన్ని తిట్టావు. కాబట్టి భారతదేశాన్ని తిట్టినందుకు నన్ను క్షమించండి అని స్పష్టంగా చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. దానికి అతను తప్పించుకునే ప్రయత్నం చేసినా, వారు పట్టుబట్టి మరీ భారతదేశానికి క్షమాపణలు చెప్పించారు.
గౌరవం లేని చోట వెళ్లకండి..
ఈ సంఘటనపై ఖుషీ దుబే స్పందిస్తూ, విదేశాల్లో జరిగే ప్రతి గొడవలో భారతీయులదే తప్పు ఉంటుందనే అపోహను వీడాలి. కొన్నిసార్లు మనపై ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతారు. మీ దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించండి. జై హింద్ అని ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. మీరు అతనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాల్సింది, అతను శిక్షకు అర్హుడు అని కొందరు కామెంట్ చేయగా, అతడితో భారతదేశానికి క్షమాపణ చెప్పించిన తీరు అద్భుతం. మీరు నిజమైన దేశభక్తులు అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. మనకు గౌరవం లేని చోట మన డబ్బును ఎందుకు ఖర్చు చేయాలి? అలాంటి రెస్టారెంట్లను బహిష్కరించాలి అని ఇంకొందరు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, విదేశీ గడ్డపై భారతీయ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఆ మహిళల తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.



Click it and Unblock the Notifications
