Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
కర్ణాటక ఎన్నికల్లో తలపడుతున్న ధనవంతులు, వేలాది కోట్లకు అధిపతులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికలు శక్తిమంతుల పోరు మాత్రమే కాదు ధనవంతుల పోరు కూడా. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న వేలాది కోట్ల ఆస్తులు ఉన్న అభ్యర్థులు వీరు.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) విశ్లేషణ ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన దాదాపు సగం మంది అభ్యర్తులు, 2,586 మందిలో 42% లేదా 1,087 మంది కోటీశ్వరులు ఉన్నారు. గత ఎన్నికల్లో వీరి సంఖ్య 35% మాత్రమే ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.12.26 కోట్లు ఉండగా 2018లో జరిగిన ఎన్నికల్లో ఇది రూ.7.5 కోట్లు

కాంగ్రెస్ నుండి 97 శాతం మంది అభ్యర్థులు, బీజేపీ నుండి 96శాతం మంది అభ్యర్థులు, జేడీఎస్ నుండి 82 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు.
పోటీలో ఉన్న అత్యధిక ధనవంతులు ఎవరంటే:
యూసుఫ్ షరీఫ్:
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కేజీఎఫ్ బాబు అని కూడా పిలువబడే యూసుఫ్ షరీఫ్ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడు. బెంగళూరులోని చిక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈయన ఆస్తులు రూ.1,633 కోట్లకు మించి ఉన్నట్లు ప్రకటించారు.
ఎన్ నాగరాజు:
బీజేపీ ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి ఎన్. నాగరాజు.. ప్రస్తుతం బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. నాగరాజు ఈ స్థానం నుండి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,609 కోట్లు.
డీకే శివకుమార్:
కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ ఆస్తులు రూ.1,413 కోట్లు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కనకపుర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
ప్రియా కృష్ణ:
ప్రియా కృష్ణ 2009 బెంగళూరులోని గోవింద్ రాజ్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి ఎం.కృష్ణప్ప పెద్ద కుమారుడు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన గోవిందరాజనగర్ నియోజవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,156 కోట్లు.
సురేషా బీఎస్:
కాంగ్రెస్ నాయకుడు సురేషా బీఎస్ (బైరతి సురేష్) ను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా చూస్తారు. ఈయన ఆస్తుల విలువ రూ.648 కోట్లు.



Click it and Unblock the Notifications
