Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.!
చాలా మంది మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం నల్లబడటం జరుగుతుంది. ఇంకా శరీరంపై పలు చోట్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. దీని వల్ల చర్మం సంరక్షణ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో స్కిన్ ఇలా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు.

మహిళ గర్భం ధరించాక బిడ్డకు జన్మనిచ్చేవరకు ఆమెలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదయం నిద్ర లేచే సమయం నుంచి తీసుకునే ఆహారం, ఆరోగ్యం, కూర్చునే, నిద్రించే భంగిమలు ఇవన్నీ చాలా కీలకంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో ఎక్కువగా వారి చర్మం నల్లబడటం లేదా పిగ్మెంటేషన్‌కి గురి కావడం జరుగుతుంది. ఇలా జరగడానికి వైద్యపరంగా చాలా కారణాలు ఉన్నాయి.
పిగ్మెంటేషన్ అంటే చర్మంపై అక్కడక్కడా మచ్చలు ఏర్పడటం. ముఖ్యంగా ముఖంపై నుదురు, ముక్కు, పెదవి పైన, బుగ్గలపైనా మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనిని మెలాస్మా అంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖంపైనే కాకుండా మెడపైనా, చంక భాగాల్లో, తొడపైనా, చనుమొన భాగాల్లోనూ మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇలా పిగ్మెంటేషన్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
పిగ్మెంటేషన్‌కి జన్యుపరమైన కారణాలు ప్రధానంగా ఉంటాయి. మొదటిది.. తల్లి లేదా తోబుట్టువులకి ఇలా గర్భధారణ సమయంలో మచ్చలు ఏర్పడితే అది మీకు వచ్చే అవకాశం ఉంది. రెండోది.. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పులు జరుగుతుంటాయి. దీంతో మెలానిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉత్పత్తి అయి మచ్చలకి దారితీస్తుంది. మూడోది ఈ సమయంలో పిండం ఎదుగుదలతో బరువు పెరుగుతుంటారు. దీని వల్ల కూడా చర్మం నల్లబడుతుంది. ఎక్కువ సమయం ఎండలో నిలబడటం కూడా పిగ్మెంటేషన్‌కి దారితీస్తుంది.
అయితే గర్భిణీలు దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సమస్య డెలివరీ తర్వాత తీరిపోతుందని.. అప్పుడు చర్మం సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు. సమస్య ఎక్కువగా ఉంటే తప్ప దీనికి ఎలాంటి ట్రీట్‌మెంట్ అవసరం లేదని అంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ చేసుకోవచ్చు. ఈ టైంలో సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. మైల్డ్ క్లెన్సర్ మాయిశ్చరైజర్ రెగ్యులర్‌గా వాడాలి. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్, నట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ కేర్‌కి దోహదపడుతుందని సూచిస్తున్నారు.

ఇక, మహిళలు గర్భధారణ సమయంలో సంతోషంగా, ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమని గైనకాలజిస్టు నిపుణులు అంటున్నారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ కోపానికి, ఆవేశానికి, బాధకి గురిచేయవద్దని సూచిస్తున్నారు. దీని వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగి ఒత్తిడికి దారితీస్తుంది. దీనివల్ల కడుపులో బిడ్డ హార్ట్‌బీట్‌పై ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. భావోద్వేగపరంగానూ పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిలో మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. బిడ్డకు రక్తప్రసరణ జరగడంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇంకా ఒత్తిడి పెరిగి డెలివరీ డేట్ కంటే ముందే ప్రసవం జరగవచ్చని.. దీంతో బిడ్డ ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే మహిళ ప్రెగ్నెన్సీ జర్నీ సాఫీగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
