Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.!
మనిషి కష్టపడి పనిచేసే ప్రతి నిమిషానికి వెల కట్టాల్సిందే. లేదంటే ఆ కష్టానికి విలువ ఉండదు. అందుకే ప్రతి ఆఫీసులో బయోమెట్రిక్ సిస్టమ్ తప్పనిసరిగా ఉంటుంది. రోజులో 8 లేదా 9 గంటలు కంపెనీలో సేవలు తప్పనిసరి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆఫీసు వాళ్లు తీసుకొచ్చిన ఓ వింత నోటీసు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఓ వింత ఆఫీసు నోటీసు గంటల్లోనే లక్షల వ్యూయర్స్‌ని సంపాదించుకుంది. యూజర్లు దీనిని మైక్రోమేనేజ్‌మెంట్ అత్యంత దారుణమైన ఉదాహరణగా భావిస్తున్నారు. ఇంతకీ ఏంటా పోస్ట్ అంటే.. లంచ్ టైం ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత గంట అదనంగా పనిచేయాల్సిందేనని.. ఇంకా ఆ అదనపు పనికి ఎలాంటి గుర్తింపూ, వేతనమూ ఉండదు. ఇది ఆ ఆఫీసు మేనేజ్‌మెంట్ తీసుకొచ్చిన కొత్త నియమం. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
సాధారణంగా ఏ కంపెనీలో అయినా భోజన విరామ సమయం 30 నిమిషాలు ఉంటుంది. అయితే లంచ్ సమయంలో అప్పుడప్పుడూ కొంత సమయం అదనంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది సర్వసాధారణం. కానీ.. ఇప్పుడు మీరు అలా చేయలేరు. ఉద్యోగి ఒక్క ఆలస్యం చేసినా ఒక గంట అదనంగా పనిచేయాల్సి ఉంటుందని ఆఫీసు యాజమాన్యం బాంబు పేల్చింది. ఆ గంట సేపు ఏకాగ్రతతో పనిచేయాలని.. అయితే ఈ ఓవర్‌టైం పనికి ఎలాంటి వేతనం ఉండదని తెలిపింది.
ఉద్యోగులు నిర్ణీత సమయంలో త్వరగా భోజనం చేసి వర్క్‌లోకి చేరుకోవాలని.. లేదంటే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ పోస్ట్‌ను ఎక్స్‌లో షేర్ చేయగా.. ఇప్పటికే 1,50,000 వీక్షణలు వచ్చాయి. ఈ వింత నియమంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు ఎక్స్‌లో పొందుపరచలేదు.
ఇలాంటి నియమాలు మైక్రో మేనేజ్‌మెంట్‌కి అత్యంత దారుణమైన ఉదాహరణగా పేర్కొంటున్నారు. నిమిషం ఆలస్యమైతే జీతం లేకుండా గంటసేపు పని చేయించడం పూర్తిగా దారుణం, చట్టవిరుద్ధమని ఆరోపిస్తున్నారు. మరో యూజర్.. అయితే ఉద్యోగులు తాము లంచ్ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసిన సందర్భాల్లో పనిచేసిన ప్రతి అదనపు నిమిషాన్ని కూడా లెక్కపెట్టుకుని వారికి పూర్తి గంట ఓవర్‌టైమ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల ఇలా ప్రవర్తించడం కంపెనీ పనితీరుకు హాని కలిగిస్తుందన్నారు.

మరికొందరు కంపెనీ నియమాలకు మద్దతు తెలుపుతున్నారు. కంపెనీ పూర్తి జీతం చెల్లిస్తున్నప్పుడు వారి వర్క్ షెడ్యూల్‌ను పాటించాలని సలహా ఇస్తున్నారు. ఇలాంటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం కోల్పోవడం కంటే కంపెనీ నియమాలకు అనుగుణంగా పనిచేయడం మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమయాన్ని వృథా చేయకుండా భోజన విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో వ్యాపారం నడపడం అంత సులభం కాదని.. ప్రతి నిమిషం ఎంతో విలువైనదని మరికొందరు అభిప్రాయపడ్డారు.



Click it and Unblock the Notifications
