Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.?
కొందరు మహిళల్లో గర్భం ధరించిన తర్వాత కొన్ని కారణాల వల్ల గర్భస్రావం అవుతుంటుంది. ఈ హఠాత్పరిణామంతో మానసికంగా డిప్రెషన్‌కి గురవుతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతారు. అయితే ఒకసారి గర్భస్రావం జరిగిన తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయా.. రెట్టింపవుతాయా అని చాలా మందిలో సందేహం నెలకొంటుంది.

గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో అరుదైన ఘట్టం. పెళ్లి తర్వాత దంపతుల జీవితానికి సంబంధించి మరో నూతన అధ్యాయం ఇది. ప్రెగ్నెన్నీ నిలిచిన సమయం నుంచి బిడ్డను కనేవరకు ప్రతి క్షణం ఎంతో ఉద్వేగభరితం, మధురానుభాతి. అయితే కొందరిలో గర్భధారణ జరిగిన కొన్ని రోజులకే కొన్ని కారణాల వల్ల అబార్షన్ అవుతుంది. ఈ గర్భస్రావంతో ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతారు. ఈ క్రమంలో తర్వాత గర్భం దాల్చే అవకాశం తమకు ఉందా లేదా అని సందిగ్ధంలో పడిపోతారు. గర్భం దాల్చడం సాధ్యమవుతుందా లేక చికిత్స తీసుకోవాలా లాంటి ప్రశ్నలు మొదలవుతాయి.
అయితే గర్భస్రావం తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం దానంతట అదే పెరగదని గైనకాలజిస్టు నిపుణులు అంటున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయని దీని అర్థం కాదని అంటున్నారు. గర్భస్రావం జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అండం, వీర్యకణాల నాణ్యత, ఫాలోపియన్ ట్యూబుల్లో పిండం అతుక్కుని గర్భాశయంలో రాకపోవడం, హార్ట్‌బీట్ లేకపోవడం, బిడ్డ ఎదుగుదల ఇలా పలు కారణాల వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
గర్భస్రావానికి సంబంధించి అంతర్లీనంగా కారణాలు ఏమీ లేకపోతే మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం సాధారణంగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. అబార్షన్ జరిగిన కొన్ని వారాల్లోనే అండాల విడుదల తిరిగి ప్రారంభం అవుతుందని.. దీని వల్ల మళ్లీ గర్భం దాల్చే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో గర్భస్రావం తర్వాత తమలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగిందని భావిస్తారు.. కానీ వాస్తవానికి మహిళల శరీరం సాధారణ పునరుత్పత్తి చక్రానికి చేరుకోవడం ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు.
అయితే ప్రతి గర్భస్రావం ఒకే కారణంతో జరగదు. అండాలు, వీర్యకణాల్లో క్రోమోజోముల్లో అసాధారణతలు ఉండటం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ గ్రంథి పనితీరు, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఇలా చాలా కారణాలు ఉండవచ్చు. అందుకే గర్భస్రావం తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం తీరు ఎలా ఉందనేది అంచనా వేయలేం. ల్యాబ్ టెస్టులు, అల్ట్రాసౌండ్ స్కాన్‌లు ద్వారా ఓ నిర్ధారణకి రావొచ్చని నిపుణులు అంటున్నారు.

అయితే ఒకసారి గర్భస్రాం జరిగిన తర్వాత మహిళ శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంది. ఈ సమయంలో వెంటనే గర్భం దాల్చడానికి మహిళను తొందరపెట్టకూడదు. ఆమె కోలుకోవడానికి సమయం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా గైనకాలజిస్టు సలహా మేరకు కొన్ని నెలలపాటు కుటుంబ నియంత్రణ పాటించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
అయితే మరోసారి ఇదేవిధంగా గర్భస్రావం జరిగినట్లయితే అందుకు సంబంధించి కారణాలు, చికిత్సపై తప్పనిసరిగా నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేసినట్లయితే ఇది ఇతర శరీర వ్యవస్థలపైనా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో గర్భస్రావం తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందా.. తగ్గుతుందా అనేది పూర్తిగా వారి శరీర తీరుపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. సరైన సంరక్షణ, జీవనశైలి పాటించినట్లయితే విజయవంతమైన, ఆరోగ్యకరమైన గర్భాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
