Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Jakhu Temple: షిమ్లా హనుమాన్ ఆలయంలో ప్రియాంక గాంధీ పూజలు, ఈ ఆలయం చాలా పవర్‌ఫుల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ షిమ్లాలోని జాఖూ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశంతో పాటు కర్ణాటక రాష్ట్ర శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రియాంక ఈ ఆలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాఖూ హనుమాన్ ఆలయం ప్రత్యేక, విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షిమ్లాలోని ప్రధాన దేవాలయం:
జాఖూ దేవాలయం హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి. ఈ హనుమాన్ టెంపుల్ జాఖూ కొండపై ఉంటుంది. అలా దీనికి జాఖూ హనుమాన్ టెంపుల్ అనే పేరు వచ్చింది. పచ్చని చెట్లు, తెల్లటి మంచు, ప్రకృతితో ఈ దేవాలయం చాలా సుందరంగా ఉంటుంది. ఈ దేవాలయం గురించి పురాణాల్లోనూ ఉంది. ఈ ప్రదేశంలో షిమ్లాలో ఎక్కువగా సందర్శించే దేవాలయాల్లో ఒకటి.

అతిపెద్ద హనుమాన్ విగ్రహం:
జాఖూ హనుమాన్ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ అక్కడి ఎత్తైన హనుమాన్ విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. పచ్చని చెట్లని మధ్యలో కాషాయ రంగులో కనిపించే హనుమాన్ విగ్రహం చాలా గంభీరంగా, అందంగా ఉంటుంది. ఎత్తైన చెట్ల కంటే ఎత్తుగా ఈ విగ్రహం కనువిందు చేస్తుంది.
జాఖూ ఆలయ పురాణం:
రామాయణంలో ఇంద్రజిత్తు లక్ష్మణుడిని గాయపరుస్తాడు. లక్ష్మణుడిని బతికించడానికి ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్తాడు. ఆ సమయంలో జాఖూ కొండపై కొంతసేపు ఆగాడని, ఓ ఋషిని కలిసి సంజీవని సమాచారం తెలుసుకున్నాడని పురాణం చెబుతోంది.
సంజీవనిని తీసుకున్న తర్వాత తిరిగి వెళ్లే దారిలో కలుస్తానని యాకు ఋషికి వాగ్దానం ఇస్తాడు హనుమాన్. అయితే వివిధ కారణాల వల్ల యాకు ఋషిని కలవలేకపోతాడు. హనుమాన్ గౌరవార్థం ఆ ఋషి జాఖూ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ కోతులు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. వాటిని హనుమాన్ వారసులుగా భావిస్తారు. వాటికి కూడా దైవత్వం ఉందని నమ్ముతారు.



Click it and Unblock the Notifications
