Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
ప్రేమికులు అన్న తర్వాత వారి మధ్య ఎంతో కొంత శారీరక సాన్నిహిత్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏవైనా మనస్పర్థల కారణంగా వారి మధ్య పొరపచ్చాలు ఏర్పడి విడిపోయే పరిస్థితి వస్తే.. ఆ తర్వాత ఖచ్చితంగా వారి జ్ఞాపకాలు పదే పదే గుర్తు రావడం సహజం. వీటిని తలుచుకుని కొందరు అపరాధ భావనతో కుంగిపోతుంటారు. కానీ ఇలా బాధఫడటం సరైనదేనా.. వీటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతుంటారు.

ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వ్యక్తితో సరదాగా గడపడం, నచ్చిన ప్రదేశాలకు వెళ్లడం, వారి నుంచి కొన్ని సందర్భాల్లో వచ్చే రొమాంటిక్ స్మెల్ అనేది సర్వసాధారణం. అయితే బ్రేకప్ తర్వాత ఇవి వారికి పెను బాధను కలిగిస్తాయి. వారితో తిరిగిన ప్రదేశాలను చూసినా, వారి నుంచి వచ్చే మధుర వాసన గుర్తొచ్చినా త్వరగా ఆ మానసిక బాధ నుంచి బయటపడలేరు. ప్రస్తుత భాగస్వామితో ఉన్నప్పుడు ఆ క్షణాలు గుర్తొస్తే ఒక్కోసారి సంతోషం కలిగినా.. ప్రస్తుత రిలేషన్‌షిప్‌లో మోసం చేస్తున్నామే అపరాధ భావన వారిని వెంటాడుతుంది. అయితే ఆ బంధం నుంచి బయటపడినా మాజీ లవర్ సడెన్‌గా ఎందుకు గుర్తొస్తారు.. అలాంటి సమయంలో అపరాధ భావనతో ఎందుకు కుంగిపోవాలి.. దీనికి పరిష్కారమేంటి.? మనస్తత్వ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
గడిచిన బంధానికి సంబంధించి లైంగిక జ్ఞాపకాలు అనేవి ప్రస్తుత పరిస్థితుల్లో వారికి సున్నితమైన, భావోద్వేగభరితమైన జ్ఞాపకంగా ఉంటాయి. వారితో విడిపోయిన కారణాల కంటే సంతోషంగా గడిపిన క్షణాలే మన మెదడు గుర్తుంచుకుంటుంది. అయితే ప్రస్తుత జీవితం బోరింగ్‌గా, రొటీన్‌గా ఉన్న సమయంలో ఆ సందర్భాలు గుర్తొస్తే మనసు నూతన ఉత్సాహం పొందుతుంది. దీనినే లైంగిక వ్యామోహం అంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత బంధంలో మీరు లైంగికంగా, భావోద్వేగపరంగా అనుభూతి పొందకపోతే పాత జ్ఞాపకాలు ఎక్కువగా ఆ సమయంలో ఊరటను ఇస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి జ్ఞాపకాల ద్వారా మీరు గతంలో ఎంత ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేవారో గుర్తు చేస్తాయి. అయితే ఇది ఆ సమయంలో ఉత్తేజాన్ని ఇచ్చినా.. తర్వాతర్వాత మీరు అపరాధ భావనతో కుంగిపోతారు. ప్రస్తుత భాగస్వామిని మోసం చేస్తున్నామనే ఫీలింగ్ మీలో నిండిపోతుంది.

అయితే మీరు ఇలాంటి విషయాల్లో అపరాధ భావనకి గురి కావద్దని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ప్రస్తుత బంధం బలహీనం కాదని సూచిస్తున్నారు. గత తీపి జ్ఞాపకాల ద్వారా మీ ఇష్టాయిష్టాలు, మీరు దేనిని ఆస్వాదిస్తారు, ఎలాంటి సాన్నిహిత్యంతో సౌకర్యంగా ఉంటారో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెంచుకోవడంతో పాటు ప్రస్తుత బంధంలో సానుకూల శక్తికి దోహదపడుతుంది.
అయితే మీ గత బంధానికి సంబంధించి లైంగిక వ్యామోహాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది ఇక్కడ చాలా ముఖ్యం. మీ ప్రస్తుత బంధాన్ని బలపరుచుకోవాలనుకుంటే ఆ జ్ఞాపకాలు మీకు దోహదపడతాయి. కానీ గత భాగస్వామిని ప్రస్తుత భాగస్వామిని పోల్చుకున్నట్లయితే అది భావోద్వేగంగా ప్రతికూల పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది. అభద్రతా భావాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అందుకే నెగిటివ్ ఆలోచనలు వస్తే ఆ జ్ఞాపకాలను వీలైనంతగా మరిచిపోవడం ఉత్తమం.



Click it and Unblock the Notifications
