Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
Army Day 2021 : ‘సరిలేరు మీకెవ్వరు’ ఇవి తెలిస్తే.. సైనికులకు సలాం కొట్టకుండా ఉండలేరు...!
ఇండియన్ హీరోల(ఆర్మీ సైనికులు) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
మన దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ధైర్యంగా, స్వేచ్ఛగా బతుకుతున్నామంటే.. దానికి ప్రధాన కారణం భారత సైన్యమే. మన దేశ సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

భారత సైనికుల గురించి, వారి ధైర్య సాహాసాలు, పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచు కొండల్లో, గడ్డ కట్టే చలిలో, మంచు కొండల్లో.. ఎక్కువ ఎండ ఉండే ఎడారులు, లోయల్లో, జోరు వర్షాల్లోనూ నిద్రాహారాలు మానుకుని మనందరికీ రక్షణ కల్పిస్తున్న మన సైనికులు, మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ సైనికులకు సలాం చేయకుండా ఉండలేరు.

అందుకే క్యాలెండర్ లో సైనికులను స్మరించుకునేందుకు ఒక ప్రత్యేక రోజును కేటాయించారు. అయితే జనవరి 15వ తేదీ. ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీ ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. 1949లో కోడండేరా మడప్ప కారియప్ప(కె.ఎమ్.కరియప్ప అని కూడా పిలుస్తారు) భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. దీనికి ముందు అతను భారత మిలటరీ అధికారి మరియు స్వాతంత్ర్యం తర్వాత, భారతదేశ చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చేర్ నుండి ఈ పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా భారత సైనికుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

1895లో..
భారత సైన్యం 1895న ఏప్రిల్ 1వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఏర్పడింది. దీనిని బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అని పిలుస్తారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన తర్వాత దీనికి భారత సైన్యం అని పేరొచ్చింది.

నిరసనలు, అల్లర్లు..
బ్రిటీష్ పాలనలో దేశవ్యాప్తంగా అనేక నిరసనలు మరియు అల్లర్లు జరిగాయి. ఈ కారణంగా, ప్రజలను నియంత్రించండంలో మరియు నిర్వహణలో సహాయం కోసం భారతీయులను సైన్యంలోకి తీసుకున్నారు.

ఆర్మీ తర్వాతే ఎవరైనా..
1948 నుండి భారత్-పాకిస్థాన్ పై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఈ కారణంగా సుమారు 6 వేల మీటర్ల ఎత్తు వరకు ఇరు దేశాలు సైన్యాన్ని మొహరించాయి. అత్యంత ఎత్తైన పర్వతాల్లో యుద్ధం చేయడంలో భారత ఆర్మీ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఇండియన్ ఆర్మీకి చెందిన హై అల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్(HAWS) ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శిక్షణా కేంద్రాల్లో ఒకటి కావడం విశేషం. అగ్ని-క్షిపణి తొలి రెండు ప్రయోగాల్లో విఫలం కావడంతో చాలా దేశాలు మన ప్రయత్నాలను హేళన చేశాయి. అయితే, మూడో ప్రయత్నంలో మొక్కవోని దీక్షతో చేసిన ‘అగ్ని' ప్రయోగం విజయవంతం కావడంతో.. ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు మళ్లింది. అంతేకాదు ఈ విశ్వంలోనే ఇది అత్యున్నతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది.

సర్జికల్ స్ట్రయిక్స్..
దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ తొలిసారిగా 2016లో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి పాకిస్థాన్ లోని ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ వీడియోలను సైతం రిలీజ్ చేసి సంచలనం స్రుష్టించింది. అమెరికా, చైనా తర్వాత అత్యధిక సైనిక బలం కలిగిన దేశం మన భారతదేశం కావడం విశేషం. మన దేశంలో మొత్తం 13,25,000కి పైగా యాక్టివ్ ట్రూప్స్, 9,60,000 రిజర్వ్ ట్రూప్స్ ఉండటం మనకు గర్వకారణం.

సేవలోనూ..
2013లో ఉత్తరాఖాండ్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రజలను కాపాడేందుకు ఆర్మీ చర్యలు ప్రపంచంలోనే అతి పెద్ద రెస్క్యూ ఆపరేషన్. 2013, జూన్ 17వ తేదీన జరిగిన ఈ ఆపరేషన్లో సుమారు 20 వేల మంది సహాయసహకారాలు అందించారు. ఈ సందర్భంగా 2 వేలకు పైగా యుద్ధ విమానాలను నడిపింది ఆర్మీ. 3,82,400 కిలోల రిలీఫ్ మెటిరీయల్ ను కూడా సరఫరా చేసింది.



Click it and Unblock the Notifications
