For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happay Birthday Trisha : కుర్రకారులో నిషా పెంచే త్రిష సినిమాల్లోకి రాకుంటే ఏమయ్యేదంటే...

|

ప్రభాస్ తో 'వర్షం'లో తడిసి ముద్దయ్యావు.. సిద్ధూతో'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అంటూ ఓ కనుసైగ చేశావు.. ప్రిన్స్ మహేష్ బాబుతో'అతడు'లో అమాయకంగా కనిపించావు.. 'క్రిష్ణ'లో రవితేజతో రొమాన్స్ చేశావు.. తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ కొట్టి నీ చిరునవ్వుతో తెలుగు ప్రేక్షకులందరినీ మైమరిపించావు..

అంతేకాదు 'కింగ్'లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో పాటు ఎందరో హీరోల సరసన నటించి తెలుగు రాష్ట్రాల్లోని అశేషమైన సినీ అభిమానులందరికీ తనివి తీరని తీపి ముద్దైపోయావు.. అలాంటి నీవు తెరపై కనిపిస్తే చాలు వీక్షకులందరికీ ఏదో తెలియని ఓ నిషా.. నీ నటన అల్లరి తమాషా.. మొత్తానికి వెండి తెరతో పాటు సినిమా ప్రియులందరూ నీ వల్ల ఎంతో కులాషా..

తెలుగులో ఎంతమంది హీరోయిన్లు వచ్చినా.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ చెన్నై చిన్నది.. రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో తిరుగులేని తారగా ఎదగడమే కాకుండా ఇప్పటికీ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది అందాల స్టార్ హీరోయిన్ త్రిష. ఈ మద్రాసీ బ్యూటీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

త్రిష జననం..

త్రిష జననం..

తమిళనాడు రాజధాని చెన్నయ్ లో నివసిస్తున్న ఉమ క్రిషన్ అనే దంపతులకు 1983 సంవత్సరంలో మే 4వ తేదీన త్రిష క్రిష్ణన్ జన్మించింది. తన చిన్నతనం అంతా త్రిష చెన్నయ్ లోనే గడిపింది.

త్రిష విద్యాభ్యాసం..

త్రిష విద్యాభ్యాసం..

త్రిష విద్యాభ్యాసం కూడా ఎక్కువగా చెన్నయ్ లోనే జరిగింది. మద్రాసు పట్టణంలోని చర్చ్ పార్క్ లోని సేక్రెడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. తర్వాత యతిరాజ్ మహిళా కళాశాలలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసింది.

నటిగా మారకుంటే..

నటిగా మారకుంటే..

అందాల తార త్రిష సినీ రంగుల ప్రపంచంలోకి రాకమునుపు క్రిమినల్ సైకాలజిస్టుగా మారాలని ఆశపడిందట. అయితే కెమెరా విపరీతంగా ఆకర్షించడంతో ఆమె గమ్యం మార్చుకుందట.

మోడల్ గా శ్రద్ధ..

మోడల్ గా శ్రద్ధ..

కెమెరాతో మంచి అనుబంధం పెంచుకున్న ఆమె మోడల్ గా రాణించడంపై కూడా శ్రద్ధ చూపించింది. అంతేకాదు బుల్లితెరలో వచ్చే కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించింది. అంతేకాదు పత్రికల్లో వ్యాపార ప్రకటనల్లో కూడా కనిపించింది. అలా అప్పుడే ఆమె నటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

మిస్ ఇండియా బ్యూటీఫుల్..

మిస్ ఇండియా బ్యూటీఫుల్..

అలా మోడలింగ్ పై శ్రద్ధ పెట్టిన త్రిష తొలిసారి మిస్ సలేమ్ పోటీల్లో పాల్గొంది. అనంతరం మిస్ మద్రాస్ పోటీల్లో కూడా పాల్గొంది. అనంతరం 2001లో మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ విజేతగా కూడా నిలిచింది.

తమిళంలో తొలి సినిమా..

తమిళంలో తొలి సినిమా..

త్రిష తమిళంలో తొలిసారి నటించింది. అంతుకుముందు ఆమె ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. 2003 సంవత్సరంలో ‘లిసా లిసా‘ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమె కెరీర్ ఊపందుకుంది.

‘వర్షం‘ కంటే ముందే..

‘వర్షం‘ కంటే ముందే..

అదే 2003 సంవత్సరంలోనే తెలుగు ‘నీ మనసు నాకు తెలుసు‘ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి ‘వర్షం‘లో ఎలా తడిసి ముద్దయ్యిందో మనందరికీ తెలిసిందే.

తెలుగు, తమిళంలో బిజీ..

తెలుగు, తమిళంలో బిజీ..

ఆ తర్వాత త్రిష రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అటు తమిళంలో.. ఇటు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ ఈ భామ అందరికీ నిషా ఎక్కించడంలో బాగా బిజీ అయిపోయింది.

అమ్మాయిలంతా అలా..

అమ్మాయిలంతా అలా..

దీంతో అమ్మాయిలంతా త్రిషలా ఉండాలని కోరుకునేవారంటే అతిశయోక్తి కాదు. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే ఆమె అందం.. అభినయం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తన నటనతోనూ ఎందరో మనసులను గెలిచింది ఈ చెన్నై చిన్నది.

2010లో హిందీలో ఎంట్రీ..

2010లో హిందీలో ఎంట్రీ..

తెలుగు, తమిళంలో బిజీగా ఉన్న సమయంలోనే త్రిషకు బాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశం దక్కింది. అలా ఆమె 2010 సంవత్సరంలో హిందీ చిత్రపరిశ్రమలో అడుగు పెట్టింది.

2012లో విషాదం..

2012లో విషాదం..

త్రిష ఓ వైపు సినిమాల్లో వరుస హిట్లతో చాలా బిజీగా ఉన్న సమయంలో ఆమెకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న త్రిష తండ్రి 2012లో మరణించాడు.

ఎక్కువ సమయం దేనికంటే..

ఎక్కువ సమయం దేనికంటే..

త్రిష ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. అయితే తను షూటింగు లేనప్పుడు ఖాళీ సమయంలో ఎక్కువ సమయం పుస్తకాలను చదవడానికి.. స్విమ్మింగ్ చేయడానికి కేటాయిస్తుందట. అలాగే కుటుంబ సభ్యులతోనూ సరదాగా గడుపుతుందట.

2015లో ఎంగేజ్ మెంట్..

2015లో ఎంగేజ్ మెంట్..

ఓ వైపు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న త్రిష 2015లో ప్రముఖ బిజినెస్ వరుణ మేనియాన్ తో ఎంగేజ్ మెంట్ అయ్యింది. అయితే అనుకోని కారణాల వల్ల వారి నిశ్చితార్థం రద్దయ్యింది.

అందం అవసరం లేదంట...

అందం అవసరం లేదంట...

ఈ నిశ్చితార్థం రద్దు గురించి మాట్లాడిన త్రిష తాను పెళ్లి చేసుకునే అబ్బాయి పెద్దగా అందగాడు కావాల్సిన అవసరం లేదని, తనను అర్థం చేసుకునేవాడైతే చాలని.. అంతకంటే తాను ఎక్కువగా ఏమి ఆశించడం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు నలుపు అంటే ఇష్టమట. తనకు కాబోయే వాడు నల్లగున్నా పర్వాలేదని చెప్పిందట ఈ భామ.

ప్రేమ వివాహమే..

ప్రేమ వివాహమే..

అయితే త్రిష కొన్ని సందర్భాల్లో తన వివాహం గురించి కొంత క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంట్లో వాళ్లు చూపించే సంబంధాలను అస్సలు పట్టించుకోనని.. తాను ప్రేమ వివాహానికే ఎక్కువగా ఆసక్తి చూపుతానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిందట.

పురస్కారాలు..

పురస్కారాలు..

సినీ పరిశ్రమలో చూపిన ప్రతిభకు నిదర్శనంగా త్రిషను ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. తెలుగులో దాదాపు 5 చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా అవార్డులను గెలుచుకుంది. అలాగే తమిళ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల్లో కూడా త్రిషను ఉత్తమ నటి అవార్డు వరించింది.

దివా ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు..

దివా ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు..

2012లో దివా ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు, 2013 సంవత్సరంలో ఉమెన్ అఛీవర్ అవార్డు, 2016లో ఫోర్టీన్ ఇయర్స్ ఇన్ సినిమా అవార్డులను త్రిషకు జెఎఫ్ డబ్ల్యూ సంస్థ అందించింది. వీటితో పాటు ఇంకా ఎన్నో అవార్డులను కూడా త్రిష అందుకుంది.

ఇప్పటికీ సింగిలే..

ఇప్పటికీ సింగిలే..

తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కోట్ల మంది మంది అభిమానుల గుండెలను కొల్లగొట్టిన త్రిష ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పెళ్లి రద్దయినా.. ఈ భామ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా? ఆ శుభవార్త తమకు ఎప్పుడు వినిపిస్తుందా? అని చాలా మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ముందుగా త్రిషకు బోల్డ్ స్కై తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు...

English summary

Happay Birthday Trisha : Unknown facts about Actress Trisha Krishnan

Here we talking about happy birthday trisha : unknown facts about actress trisha krishnan. Read on