For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘అర్జున్ రెడ్డి‘ గురించి ఆసక్తికరమైన విషయాలు...

ఈ సందర్భంగా విజయదేవరకొండ కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం..

|

రీల్ లైప్ అయినా.. రియల్ లైఫ్ అయినా, సోషల్ మీడియాలో అయినా.. ప్రెస్ మీట్ లో అయినా చాలా చురుకుగా కనిపించే కుర్ర హీరో విజయదేవరకొండ(Vijaya devarakonda).

Unknown facts about Actor Vijayadevarakonda

సినిమా రంగంలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడమే కాకుండా స్టార్ డమ్ సంపాదించుకోవడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి తన టాలెంట్ నిరూపించుకుంటూ 'అర్జున్ రెడ్డి' బ్లాక్ బాస్టర్ తో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు టాలీవుడ్ ను షేక్ చేసేశాడు. అలాగే దక్షిణాది, బాలీవుడ్ అగ్రనటుల చేత ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ విజయ్ దేవరకొండను సూపర్ స్టార్ అనే స్థాయికి చేరుకున్నాడు.

Unknown facts about Actor Vijayadevarakonda

అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ యూత్ లో యమ క్రేజ్ సంపాదించుకున్నాడీ టాలీవుడ్ యంగ్ హీరో. తన అభిమానులను రౌడీస్ అని పిలుచుకునే ఈ రౌడీ హీరో ఏది చేసినా క్రేజీగానే ఉంటుంది.

Unknown facts about Actor Vijayadevarakonda

ఎందుకంటే తన రియల్ లైఫ్ లో ఏ పని చేసినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇంతకీ ఈ విషయాలన్నీ ఇప్పుడు చెబుతున్నామంటే ఈ రౌడీ హీరోది ఈరోజు పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయదేవరకొండ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

విజయ్ దేవరకొండ జననం..

విజయ్ దేవరకొండ జననం..

తెలంగాణలోని నాగర్ కర్నూల్ సమీపంలోని అచ్చంపేట వాసులైన దేవరకొండ గోవర్ధన్, మాధవిలతలకు విజయ్ దేవరకొండ 1989 సంవత్సరం మే 9వ తేదీన హైదరాబాదులో జన్మించాడు.

కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ కు..

కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ కు..

విజయ్ దేవరకొండ సొంతూరు అచ్చంపేట అయినప్పటికీ.. వారి చదువు, ఇతర కారణాల వల్ల కొన్ని సంవత్సరాల వీరి కుటుంబం హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యిందట. కానీ చదువుకున్నది మాత్రం పుట్టపర్తిలోని ఇంటర్నేషనల్ స్కూల్ లో. అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడట.

డిగ్రీపై ఆసక్తి లేకపోవడంతో..

డిగ్రీపై ఆసక్తి లేకపోవడంతో..

ఆ తర్వాత డిగ్రీ చదివేందుకు హైదరాబాదులోని భద్రికా కామర్స్ కాలేజీలో డిగ్రీ చదివేందుకు చేరాడట. అయితే అప్పటికే డిగ్రీ మీద ఆసక్తి తగ్గిపోయిందట. సినిమాలపై ఎంతో ఆసక్తి పెరిగిపోయిందట. అందుకే అప్పుడే కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమాలకు వెళ్లేవాడట.

నాన్నకు తెలిసిపోవడంతో..

నాన్నకు తెలిసిపోవడంతో..

విజయ దేవరకొండ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తున్న విషయం ఓ రోజు అతని నాన్నకు తెలిసిపోయిందట. దీని గురించి విజయ్ ని ప్రశ్నిస్తే, తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్ అని చెప్పాడట. దీంతో వాళ్లను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించాడట. వాళ్ల నాన్న తనను వెంటనే అక్కడ ఎందుకు చేర్పించడానికి ఓ కారణముందట. అతని నాన్నకు కూడా దర్శకత్వం వహించాలనే ఆశ ఉండేదట. కానీ సినిమాల్లో అవకాశం దొరకలేదట. అయితే దూరదర్శన్ కోసం సీరియళ్లకు దర్శకత్వం వహించారట.

కోర్సు పూర్తయిన తర్వాత..

కోర్సు పూర్తయిన తర్వాత..

విజయ్ దేవరకొండ యాక్టింగ్ కోర్సు పూర్తయిన వెంటనే ‘నువ్విలా‘ సినిమాతో తొలిసారి తెలుగు వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ఎవడే సుబ్రమణ్యంలో నానితో కలిసి నటించడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక తొలిసారిగా ‘పెళ్లి చూపులు‘లో హీరోగా ఓ మోస్తరు పేరు తెచ్చుకున్నాడు.

‘అర్జున్ రెడ్డి‘తో సెన్సెషన్..

‘అర్జున్ రెడ్డి‘తో సెన్సెషన్..

ఇక 2017లో రిలీజైన ‘అర్జున్ రెడ్డి‘తో విజయ్ దేవరకొండ సెన్సేషన్ స్రుష్టించాడు. ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయాడు. అక్కడి నుండి విజయ్ హవా ప్రారంభమైంది.

ఫ్యామిలీ హీరోగా..

ఫ్యామిలీ హీరోగా..

ఆ తర్వాత వచ్చిన ‘ఏ మంత్రం వేశావే‘ ఫ్లాప్ అవ్వగా, అదే ఏడాది వచ్చిన ‘గీత గోవిందం‘ఫ్యామిలీ హీరోగా, అమాయకుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు.

రియల్ లైఫ్ లోనూ..

రియల్ లైఫ్ లోనూ..

ఇలా యూత్ లో విజయ్ కు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే తన అభిమానులను రౌడీస్ అని పిలుస్తుంటాడు విజయ్. అయితే ఈ రౌడీ ఏది చేసినా క్రేజీగానే చేస్తాడు. ఏ పని చేసినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు.

సోషల్ మీడియాలో టాప్..

సోషల్ మీడియాలో టాప్..

ఈ రౌడీ హీరో రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. అందుకే తాజాగా అతనికి అరుదైన రికార్డు సైతం లభించింది. దక్షిణాదిన ఎక్కువమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఉన్న హీరోగా నిలిచాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంతగా విజయ్ కు 70 లక్షలకు పైగా ఇన్ స్టా గ్రామ్ ఫాలోయర్స్ ఉన్నారు.

ఇండియాలోనే టాప్..

ఇండియాలోనే టాప్..

విజయ్ దేవరకొండ నాలుగేళ్ల వరకు ఎవ్వరికి తెలియదు. వాస్తవం చెప్పాలంటే అప్పుడు విజయ్ బ్యాంకు అకౌంట్లో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. కానీ ఇప్పుడు మాత్రం ఇండియాలోనే టాప్ సెలబ్రిటీస్ లో ఒకడిగా ఉన్నాడు. అంతేకాదు 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి ఫోర్బ్స్ లిస్టులో టాప్ -30లో ప్లేస్ కూడా సంపాదించుకున్నాడు.

English summary

Unknown facts about Actor Vijayadevarakonda

Here we talking about unknown facts about actor vijayadevarakonda. Read on
Desktop Bottom Promotion