Latest Updates
-
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే!
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి?
బరువు తగ్గాలని అనుకునేవారు తరచుగా ఏ ఎక్సర్ సైజ్ లు చేయాలనే దానిపైనే ఎక్కువగా శ్రద్ధ పెడతారు. కానీ మీరు ఎప్పుడు వ్యాయామం చేస్తున్నారు అనేది కూడా మీ శరీరంలోని కొవ్వును కరిగించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? వ్యాయామం చేసే సమయానికి, బరువు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధంపై జరిగిన తాజా పరిశోధనలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాయి.

ఉదయం పూట ఎక్సర్ సైజ్
ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల బరువు వేగంగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 7 నుండి 9 గంటల మధ్య వర్క వుట్ చేసే వారిలో బాడీ మాస్ ఇండెక్స్ (BMI) తక్కువగా ఉండటమే కాకుండా, నడుము చుట్టుకొలత కూడా త్వరగా తగ్గుతుందట. దీనికి ఒక శాస్త్రీయ కారణం ఉంది.
రాత్రంతా నిద్ర (ఉపవాసం) తర్వాత ఉదయం మన శరీరంలో గ్లైకోజెన్ (నిల్వ ఉన్న కార్బోహైడ్రేట్లు) స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వ్యాయామం చేస్తే, శరీరం శక్తి కోసం నేరుగా నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా, ఉదయం పూట ఆఫీసు పనులు, ఇతర సామాజిక కార్యక్రమాల ఆటంకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వ్యాయామాన్ని ప్రతిరోజూ ఒక అలవాటుగా క్రమం తప్పకుండా చేయగలుగుతాము.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం.. సమారు 14,000 మంది ఫిట్ నెస్ పరికరాల డేటాను ఒక సంవత్సరం పాటు పరిశీలించారు. అందరూ సమానంగా వ్యాయామం చేసినప్పటికీ, ఉదయం చేసిన వారిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి.
ఊబకాయం వచ్చే ప్రమాదం 35% తక్కువ
గుండె జబ్బుల (కరోనరీ ఆర్టరీ వ్యాధి) ప్రమాదం 31% తక్కువ.
టైప్ 2 మధుమేహం వచ్చే ముప్పు 30% తక్కువ.
అధిక కొలెస్ట్రాల్ సమస్య 21% తక్కువ.
హై బీపీ (అధిక రక్తపోటు) ప్రమాదం 18% వరకు తగ్గాయి.

సాయంత్రం వ్యాయామం
అయితే సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనం లేదా? అంటే.. ఖచ్చితంగా ఉంది. సాయంత్రం వేళ మన శరీర ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కండరాల పనితీరు, బలం, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ గరిష్ట స్థాయిలో ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారిలో జీవక్రియను మెరుగుపరచడానికి సాయంత్రం వ్యాయామాలు బాగా తోడ్పడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా, రోజంతా పనిలో పడిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక స్థితిని (మూడ్) మెరుగుపరచుకోవడానికి సాయంత్రం వర్క వుట్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
ఏ సమయం ఉత్తమం?
శాస్త్రీయంగా చూస్తే.. ఉదయం వ్యాయామం కొవ్వును వేగంగా కరిగిస్తే, సాయంత్రం వ్యాయామం శరీర పనితీరును పెంచుతుంది. మీ ప్రధాన లక్ష్యం త్వరగా బరువు తగ్గడమే అయితే, ఉదయం పూట వ్యాయామం చేయడం మీకు కొద్దిగా అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది.
కానీ అంతిమంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద నిజం.. పర్ఫెక్షన్ కంటే క్రమశిక్షణ అనేది ఇక్కడ అసలైన హీరో. వ్యాయామం చేసే సమయం కంటే.. మీరు రోజూ ఎంత క్యాలరీలు బర్న్ చేస్తున్నారు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎంత నిద్రపోతున్నారు అనేదే బరువు తగ్గడాన్ని నిర్ణయిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications