Latest Updates
-
వ్యాధి ఒకటే అయినా స్త్రీ, పురుషుల్లో వేర్వేరు లక్షణాలు.. పోల్చుకుంటే ప్రాణ ముప్పు తప్పదు.! -
బ్యూటీ సీక్రెట్.. చుక్క నీరు, మినప్పప్పు లేకుండా నిమిషాల్లో చేసుకునే కీరదోస ఇడ్లీ.! -
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: వీరి అదృష్టం మారబోతుంది.. 12 రాశుల ఫలితాలివే.! -
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.!
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.!
సమాజ నిర్మాణంలో పురుషులతో పాటు మహిళల పాత్ర ఎంతో కీలకం. అటు ఇంటి బాధ్యతల్లో భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ తమ సంతానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న అతివలు కొందరైతే.. ఇటు భర్తకు ఆర్థిక అవసరాల్లో సైతం తోడ్పాటును అందిస్తూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నారు. మరి ఈ తరంలో గృహిణులు, ఉద్యోగం చేసే మహిళల్లో.. వారి బాధ్యతలు మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి.? ఎవరు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అనేదానిపై మానసిక నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గృహిణులు, ఉద్యోగం చేసే మహిళలు నిత్యం వివిధ రకాల మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటారని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీరిలో ఎవరి జీవితం కష్టతరమైనది అనేదానిపై చర్చకు వస్తే భిన్నాప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ బాధ్యతల్లో వీరి పాత్ర కీలకమైనా.. మానసికంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చివరికి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని సైకాలజిస్ట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
గృహిణులు, మహిళా ఉద్యోగినులు.. వీరిలో ఎవరి పాత్ర కష్టమో నిర్ణయించడం కష్టమని మానసిక ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఎందుకంటే రెండింటిలోనూ మనకి కనిపించని బాధ్యతలు ఎంతో ఉంటాయని చెబుతున్నారు. వారిలో దీర్ఘకాలిక ఒత్తిడి మున్ముందు శారీరక ఆరోగ్యం, ఎమోషనల్ బ్యాలెన్స్, సైకలాజికల్ కండిషన్‌పై నిశ్శబ్దంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
హౌస్ వైఫ్స్‌లో భావోద్వేగ భారం
ప్రతి రోజూ ఇంటి పనులు చక్కబెట్టడం, పిల్లలను చూసుకోవడం, వంటావార్పు, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలోనే గృహిణుల 80 శాతం జీవితం ముగుస్తుంది. ఈ క్రమంలో వారికి లభించే వ్యక్తిగత సమయం చాలా తక్కువ. అయితే ఇంటి బాధ్యతలను ఎంత సక్రమంగా నిర్వర్తిస్తున్నా ఇది వారికి గుర్తింపు ఇవ్వదు. కుటుంబీకుల బాగోగులు చూసుకునే క్రమంలో వారి ఆరోగ్యపై శ్రద్ధ చూపించరు. ఫలితంగా అలసట, ఒళ్లు నొప్పులు, బరువు పెరగడం, ఒత్తిడి, మానసిక నిస్పృహ, సరిగా నిద్రపోకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. వీటికి అదనంగా ఆర్థిక స్వాతంత్ర్యం, వారి శ్రమకి తగిన గుర్తింపు లేకపోవడం ఆత్మగౌరవంపై ప్రభావం చూపిస్తుంది. ఇది ఒంటరితనం అనే భావనకి దారితీస్తుంది.

ఉద్యోగినిగా సవాళ్లు
ఉద్యోగం చేసే మహిళలు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం అంత సులభమైన పని కాదని మానసికతత్వవేత్తలు చెబుతున్నారు. పనిలో డెడ్‌లైన్, ఎక్కువ సేపు ఆఫీస్ వర్క్, ఆహారపు అలవాట్లలలో మార్పులు, సరైన నిద్ర లేకపోవడం వంటివి ఒత్తిడి, అలసటని ఎదుర్కొనేలా చేస్తాయి. ఈ క్రమంలో అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, మైగ్రేన్లు, ఆందోళన ఎక్కువవుతుంది. అటు వృత్తి, ఇటు కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో కలిగే ఒత్తిడిని నిశ్శబ్దంగా అనుభవిస్తుంటారు. .
కారణాలు ఏవైనా
ఈ వర్గాల మహిళల్లో కారణాలు వేర్వేరుగా ఉన్నా వారిలో దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తాయి. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అయితే వీటిని నిర్లక్ష్యం చేయకూడదని.. కుటుంబ, వృత్తి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు మహిళల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని అంటున్నారు.
మహిళల నిత్య జీవనశైలిలో భాగంగా ప్రతిరోజూ వాకింగ్, యోగా, ధ్యానం, జర్నలింగ్, స్ట్రెచింగ్ చేయడం, ప్రశాంతంగా టీ లేదా కాఫీని ఆస్వాదించడం వంటివి వారిలో మానసిక అలసటను గణనీయంగా తగ్గిస్తాయని సైకాలజిస్ట్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఇంటాబయటా ఎక్కడైనా సరే అతివలు నిర్వర్తించే బాధ్యతల కంటే ముందు వారి సొంత శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తే అది మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుందనని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications