Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం
ఉద్యోగంలో చేరిన ఆరు గంటల్లోనే ఒక ఉద్యోగి రాజీనామా చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లింక్డ్‌ఇన్, ఎక్స్ వేదికలపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకి దారితీసింది. ఢిల్లీకి చెందిన ఒక కంపెనీలో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకోగా.. ఆ రోజే ఉద్యోగంలో చేరిన వ్యక్తి అదేరోజు రాజీనామా చేయడానికి దారితీసిన పరిణామాలేంటి.. దీనిపై నెటిజన్ల రియాక్షన్ ఏంటి.. తెలుసుకుందాం..

ఉద్యోగం కోసం కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చిన ఏ అభ్యర్థి అయినా ముందుగా సదరు కంపెనీ గ్రోత్, ప్రాఫిట్ తదితర వివరాలు తెలుసుకుంటారు. అదేవిధంగా వర్క్ కల్చర్‌పైనా ఒక అవగాహనకి రావడం కామన్. ఇక కంపెనీలు సైతం ఉద్యోగంలో చేరిన ఎంప్లాయ్‌కి ఇచ్చే బెనిఫిట్స్, ఫ్రెండ్లీ వాతావరణం ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక ఇవే అంచనాలతో వెళ్లిన అభ్యర్థి ఉద్యోగంలో సెలెక్ట్ అయి జాయినింగ్ రోజు ఎంత ఉత్సాహంగా వెళ్లాడో.. ఆ కాసేపటికే నాకొద్దు బాబూ ఈ ఉద్యోగం అంటూ బయటకు వచ్చేశాడు. ఈ సంఘటన ఇప్పుడు వర్క్ కల్చర్, పని ఒత్తిడిపైన నెట్టింట్లో తీవ్ర చర్చకి దారితీసింది.
అసలు ఏం జరిగిందంటే..
సదరు కంపెనీలో ఒక పాత ఉద్యోగి రాజీనామా చేసి వెళ్లిపోతూ ఉండగా.. తన స్థానంలో కొత్తగా చేరిన వ్యక్తికి జాబ్ ప్రొఫైల్ గురించి వివరించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలలో చెప్పే ఆకర్షణీయమైన మాటలు పక్కన పెట్టి, కంపెనీలోని అసలు వాతావరణం, పని ఒత్తిడి, డెడ్‌లైన్లు, కఠినమైన రూల్స్ గురించి ఆ కొత్త ఉద్యోగికి పాత ఉద్యోగి మొదటి రోజే పూర్తిగా వివరించి నిజం చెప్పేయడంతో ఆ కంపెనీ వర్క్ కల్చర్‌పై ఆ వ్యక్తికి ఒక అవగాహన వచ్చేసింది.
పూర్తి వివరణ తర్వాత కంపెనీలోని కఠినమైన పని పరిస్థితుల గురించి అవగాహనకి వచ్చిన ఆ కొత్త ఉద్యోగి షాక్‌కు గురై అందులో నుంచి తేరుకోలేకపోయారు. దీంతో తనకు శిక్షణ పూర్తయిన ఆరు గంటల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. "నేను అనుకున్నదానికంటే ఇక్కడ పని భారం చాలా ఎక్కువగా ఉంది, ఇది నాకు సెట్ అవ్వదు." అని మేనేజర్‌కు మెసేజ్ పెట్టి వెంటనే రాజీనామా చేశాడు. కొత్త ఉద్యోగి చేరిన కొన్ని గంటలకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సదరు మేనేజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పాత ఉద్యోగిపై మండిపడ్డారు.

నెటిజన్ల రియాక్షన్..
ఉద్యోగి రాజీనామాకి సంబంధించిన పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ ఉద్యోగి తీసుకున్న త్వరితగతిన నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. నచ్చని చోట నెలల తరబడి ఉండి మానసిక ఒత్తిడి తెచ్చుకోవడం కంటే, మొదటి రోజే బయటకు రావడం మంచిదని ఉద్యోగి నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
ఈ క్రమంలో మరికొందరు కంపెనీల తప్పును ఎత్తిచూపుతున్నారు. ఇంటర్వ్యూల సమయంలో జాబ్ ప్రొఫైల్స్ గురించి అబద్ధాలు చెప్పడం, చేరిన తర్వాత అసలు స్వరూపం చూపించడం వల్లనే ఇలాంటి 'ఇమ్మీడియట్ సెపరేషన్లు' జరుగుతున్నాయని పేర్కొన్నారు. కంపెనీల నియామక ప్రక్రియలోని పారదర్శకత లోపంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
