Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
ఈ ఉప్పు ధర కిలో 35 వేలు.. బంగారం కూడా దీని ముందు దిగదుడుపే, అంత ధర ఎందుకంటే?
ఉప్పు అనేది మనిషి జీవితంలో ఒక అనివార్యమైన ఒక వంట పదార్థం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉప్పు లేకుండా మనిషి జీవనం సాగించలేడు. అందుకే ఉప్పు చేసే మేలు ఎవరూ చేయరు అనే సామెత కూడా ఉంది. సాధారణ ఉప్పు అన్ని దేశాలలో చౌక ధరలకు లభిస్తుండగా, కొన్ని అరుదైన ఉప్పు రకాలు అత్యంత భారీ ధరకు అమ్ముడవుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే కొరియన్ వెదురు ఉప్పు. ఈ ఉప్పును వెదురు ఉప్పు, ఊదా రంగు వెదురు ఉప్పు లేదా జుగ్యోమ్ అని కూడా పిలుస్తారు. దీని ధర కిలో 35,000 కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎందుకు అంత ధర? ఈ ఉప్పుతో కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు
కొరియన్ వెదురు ఉప్పును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పుగా పరిగణిస్తారు. ఈ ఉప్పును కొరియన్ వంటలతో పాటు సాంప్రదాయకమైన కొరియన్ వైద్యంలో ఔషధంగా దీనిని వినియోగిస్తుంటారు. అయితే ఈ ఉప్పు అంత ఖరీదు పలకడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దీనిని తయారు చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ.

ఈ ఉప్పును తయారు చేయడానికి ముందుగా.. సముద్రపు ఉప్పును వెదురు కర్రతో ఉంచి, పైన్ కలపను ఉపయోగించి అధిక ఉష్ణోగ్రతల వద్ద తొమ్మిది సార్లు కాలుస్తారు. దీని వల్ల ఈ ఉప్పుకు అత్యధిక ధర పలుకుతుంది.
కొరియన్ వెదురు ఉప్పు ఎలా తయారు చేయబడింది?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జుగ్యోమ్ లేదా కొరియన్ వెదురు ఉప్పు తయారీకి సంక్లిష్టమైన ప్రక్రియ అవసరం. సంప్రదాయ సముద్రపు ఉప్పు వెదురు డబ్బాల్లో ప్యాక్ చేస్తారు. దీనిని పసుపు మట్టితో కప్పుతారు. అనంతరం ఆ వెదురును ఇనుప ఓవెన్‌లో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఉప్పు ముద్దలు గట్టిపడతాయి. వాటిని బయటకు తీసి, మరొక వెదురు కర్రలో నింపి, మళ్లీ కాలుస్తారు. ఈ ప్రక్రియ తొమ్మిది సార్లు పునరావృతమవుతుంది. తొమ్మిదవ ఫైరింగ్ సమయంలో 1000°C వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి.
బేకింగ్ ప్రక్రియ తర్వాత, వెదురు ఉప్పులో నీలం, పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు స్ఫటికాలు ఏర్పడతాయి. అలాగే ఈ ఉప్పుకు ప్రత్యేకమైన తీపి రుచిని కమ్రోజాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఉప్పు వెదురు రుచిని గ్రహిస్తుంది. అందుకే ఈ రుచి వస్తుంది.
బాగా కాల్చిన వెదురు ఉప్పు, "పర్పుల్ వెదురు ఉప్పు" అని పిలుస్తారు, ఇది ఒక విలక్షణమైన ఊదా రంగును కలిగి ఉంటుంది. ఇది 1,500 °C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉత్పత్తి అవుతుంది. ఈ ఉప్పును తయారు చేసే మొత్తం ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది. అలాగే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి దాదాపు 50 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఉప్పును కాల్చడానికి ఉపయోగించే ప్రత్యేక ఫర్నేస్‌లను ఆపరేట్ చేయడానికి నైపుణ్యం కలిగిన కళాకారులు అవసరం. ఇంత శ్రమ, ప్రత్యేకత వల్లనే ఈ ఉప్పు ధర బంగారంతో సమానం.



Click it and Unblock the Notifications
