Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
ముప్పైలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
మీరు ముప్పైకి చేరువలో ఉన్నారా ? అయితే ముప్పైలోకి ఎంటర్ అయ్యే వాళ్లు ఎలాంటి అంశాలపై అవగాహన ఉండాలి అనేది చాలా అవసరం. దేనిపై దృష్టి సారించాలి. ఏయే అంశాలను తరవుగా నేర్చుకోవాలో అంచనా వేసుకోవాలి. థర్టీస్ లో తప్పకుండా తెలుసుకోవాల్సిన 15 అంశాలేంటో తెలుసుకుని.. జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా ఎంజాయ్ చేయండి.
Read more:ఇతరుల మనసు గెలుచుకోవడానికి మార్గాలు
ముప్పైలోకి ఎంటర్ అవుతున్నారంటే.. జీవితం గురించి చాలావరకు అర్థమైపోయింటుంది. ఎందుకంటే.. ఎడ్యుకేషన్, ఉద్యోగం, ఆర్థిక సమస్యలు అన్నింటిని ఫేస్ చేసుంటారు. సమస్యలకు పరిష్కారాలు వెతుక్కునే సామర్థ్యం కూడా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలపై తమకంటూ.. ఓ అభిప్రాయం, ఆలోచన ఉండాలి. ముప్పై నేర్చుకోవాల్సిన జీవిత పాటాలేంటో చూద్దాం..

సమస్యలకు డబ్బు పరిష్కారం కాదు
జీవితంలో ఎదురయ్యే సమస్యలను డబ్బు పరిష్కరించదు. చేతిలో డబ్బులు ఉంటే.. లగ్జరీగా బతకొచ్చు.. కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు కానీ.. మంచి స్నేహితులని, సంతోషాన్ని, సంతృప్తినిచ్చే ఉద్యోగాన్ని ఇవ్వలేదు. ఇవన్నీ కావాలంటే డబ్బు అవసరం లేదని గ్రహించాలి.

సమయం విలువ
మీకోసం సమయం ఆగదు. సమయంతోపాటు పరుగులు పెట్టాల్సిందే. కాబట్టి టైం విలువ తెలుసుకోవాలి. ఏ ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకుండా.. జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

ఎదుటి వాళ్ల అభిప్రాయం
మీ గురించి ఎదుటి వాళ్ల అభిప్రాయాలను నిజమేనని అంగీకరించాల్సిన అవసరం లేదు. ఏయే సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహనకు రావాలి.

ఆరోగ్యం
ముప్పైలోకి అడుగుపెడుతున్నారంటే.. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ సమయంలోనే నొప్పులు, అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి.. ముందుగానే జాగ్రత్త తీసుకుంటే మంచిది.

ఫ్యామిలీకి విలువ
ఫ్యామిలీని గౌరవించడం, గుర్తించడం, విలువనివ్వడం చాలా అవసరం. కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలి. వాళ్లు చెప్పే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఫ్యామిలీ నీ సుఖం కోసం ఏవిధంగా సహకరించింది అనే దానిని గుర్తుంచుకోవాలి.

క్షమించేగుణం
క్షమా గుణాన్ని అలవరుచుకోవాలి. ముప్పై ఏళ్లలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అలవరచుకోవాలి.

ప్రణాళికలు వాస్తవానికి సెట్ కావు
మనం ఊహించినట్లు జీవితం ఉండదని గ్రహించాలి. సమయానికి తగ్గట్టు జీవితంలో మార్పులు వస్తుంటాయి. మనం అనుకున్న ప్రణాళికలు అన్ని సందర్భాల్లో వర్కవుట్ కావని గ్రహించాలి.

చింతించడం
చింతించడం వల్ల భవిష్యత్ మారిపోదని తెలుసుకోవాలి. భవిష్యత్ లో ఎదుర్కోవాల్సిన ఎలాంటి పరిస్థితులనైనా.. ధైర్యంగా.. నమ్మకంతో ఫేస్ చేయాలి.

సక్సెస్
ముప్పై లోకి అడుగుపెడుతున్నారంటే.. మీకు సక్సెస్ కి అర్థం తెలిసుండాలి. విజయమనేది డబ్బు, విలాసం, గొప్పదనానికి సంబంధించింది కాదని తెలుసుకోవాలి. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ, ప్రశాంతత పొందడం కంటే మరో విజయం లేదని గ్రహించాలి.

స్వార్థం
స్వార్థంగా ఆలోచించడం మానుకోవాలి. అందరి దృష్టి నీపైనే ఉండాలన్న ఆశని పక్కనపెట్టాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో.. నీ వెనక ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాలి.

మాటతీరు
మీ మాటలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ప్రతి పదాన్ని ఆచితూచి వాడాలి. ఏది మాట్లాడాలన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. ఈ అంశాలు మీ క్యారెక్టర్ పై ప్రభావం చూపుతాయి.

సంతోషం
చిన్న చిన్న అంశాలే ఎక్కువ సంతోషాన్నిస్తాయి. వయసు పెరిగే కొద్దీ మీ ఆలోచనలు, అభిప్రాయాల్లో చాలా మార్పులు వస్తాయి.

జీవితం విలువ
ఈ వయసులో డబ్బుకి విలువ పూర్తీగా అర్థమవుతుంది. 20 ఏళ్లలో చేతిలో డబ్బులుంటే.. విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేస్తారు.. అదే డబ్బు 30 ఏళ్లలో విలువ నేర్పిస్తుంది. ఎప్పుడు ఎలా.. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనే దానిపై పూర్తీ అవగాహనకు వస్తారు.

స్నేహం
స్నేహానికి అర్థం తెలుసుకోవాలి. ముప్పైలోకి వచ్చాక.. స్నేహం విలువ తెలుస్తుంది. స్నేహితులతో ఎక్కువ గడపడానికి ఇష్టపడాలని భావిస్తారు.
ఇవి ముప్పైలో అడుగుపెట్టబోయే ముందు అవగాహనకు రావాల్సిన అంశాలు. ఎలాంటి సమస్యలనైనా గుండె ధైర్యంతో పరిష్కరించుకోండి.



Click it and Unblock the Notifications
