Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మరణం తర్వాత యమలోకానికి వెళ్లడానికి 47 రోజుల భయంకర జర్నీ..!!
మరణం అనేది వాస్తవం. ప్రతి పుట్టకకు చావు అనేది కంపల్సరీ ఉంటుంది. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే చావు తర్వాత కూడా మనకు ఇంకా ప్రయాణం ఉంటుందా ? అని అనుకుంటారు. ఇది వాస్తవం. మరణం తర్వాత కూడా ఇంకా జర్నీ నిలిచిపోదు.
ఏదో ఒకరోజు మనశరీరాలు శవం కాకతప్పదు. మన శవాన్ని కాల్చడమో, మట్టిలో కప్పిపెట్టడమే జరగక మానదు. అయితే మరణం తర్వాత శరీరం ప్రాధేయపడుతుందా ? అనేది కామన్ క్వశ్చన్. అసలు మరణం తర్వాత మనకు, మన ఆత్మకు ఏమవుతుంది ? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి ?
అయితే మరణించిన తర్వాత మంచి స్వభావంతో బతికిన వాళ్లు స్వర్గానికి వెళ్తారని హిందూ పురాణాలు చెబుతాయి. ఎవరైతే చెడు పనులు, ఇతరులకు హాని చేస్తారో వాళ్లు నరకానికి వెళ్తారని వివరించాయి. ప్రతి ఒక్కరి తలరాతను నిర్ణయించే, స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా నిర్ణయించేది చావు దేవుడు యమరాజు. ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు అనేది ఈయనే నిర్ణయిస్తారు.
ఒకవేళ మరణం తర్వాత ఆత్మ యమలోకంలోని యమరాజు దగ్గరకు వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుంది ? చనిపోయిన తర్వాత కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందా ? బతికి ఉండగా చేసిన తప్పులకు నరకానికి వెళ్లడమే కాకుండా.. ప్రయాణంలోనూ ఆటుపోట్లు తప్పవా ? అసలు మరణం తర్వాత యమలోకానికి చేసే జర్నీ గురించి గరుడ పురాణం ఏం చెబుతోందో చూద్దాం..

47రోజుల జర్నీ
మీకు తెలుసా మనం చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్లాల్సి వస్తే మాత్రం.. మరో 47 రోజుల ప్రయాణం ఉంటుంది. అదేనండి.. యమలోకానికి ప్రయాణానికి 47 రోజులు పడుతుందట.

చెడు పనులు
హత్యలు, అక్రమాలు, దొంగతనాలు వంటి నేరాలు చేసిన వాళ్లు నరకానికి వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది.

మాటలు రావు
చావుకి కొంత సమయం ముందు నుంచి.. ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా.. మాట్లాడలేకపోతాడు. కానీ తన జీవితాన్నంతటినీ ఒక్కసారి చూడగలుగుతాడు.

దివ్యదృష్టి
జీవితపు చివరి క్షణాల్లో అతనిలో దివ్యదృష్టి తెరుచుకుని.. ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకోగలుగుతారట. మిగిలిని అన్ని సెన్సెస్ నాశనం అయి.. శరీరం ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుంది.

యమధూతలు
చనిపోతున్న వ్యక్తి.. తనను యమలోకానికి తీసుకెళ్లడానికి యమరాజు పంపిన యమధూతలను చూడగలుగుతాడు.

నోరు ఆరిపోవడం
యమధూతలు కనిపిస్తున్న సమయంలో.. వాళ్ల భయంకర రూపం చూసి.. నోరు ఆరిపోతుంది.

యమధూతలకు గోళ్లే ఆయుధాలు
యమధూతలు చాలా భయంకరంగా ఉంటారు. ఎలాంటి షేప్ లేని ముఖాలు, గోళ్లే ఆయుధాలుగా ఉంటాయి. వాళ్లను చూసి చనిపోయిన వ్యక్తి చాలా భయానికి గురై.. యూరిన్ లేదా మోషన్ చేసేస్తారని గరుడ పురాణం చెబుతోంది.

ఆత్మను
యమధూతలు వెంటనే ఆ వ్యక్తి ఆత్మను పట్టుకుని.. తీసుకెళ్లిపోతారు.

విశ్రాంతి ఉండదు
యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి యమధూతలు అనుమతించరు.

భయపెట్టడం
యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమధూతలు చాలా భయాందోళనకు గురిచేస్తారు. నరకంలో యమరాజు చెప్పే జడ్జిమెంట్ గురించి వివరించి మరింత ఆందోళనకు గురిచేస్తారు.

ఆత్మ ఏడ్వడం
యమలోకంలో జరిగే భయంకరమైన కథలు యమధూతలు ఆత్మకు వివరించినప్పుడు.. ఆత్మ ఏడవడం మొదలుపెడుతుంది. కానీ.. యమధూతలు కనికరం, జాలి ఏమాత్రం చూపించరు.

నరకం
హత్యలు, దొంగతనాలు వంటి నేరాలు చేసినవాళ్లను యమధర్మ రాజు క్షమించడు. అందుకే వాళ్లను నరకానికి తీసుకెళ్తాడు.

గరుడ పురాణం
దేవుడిని పూజించని వాళ్లు, ఇతరుల తప్పులను క్షమించని వాళ్లకు స్వర్గానికి వెళ్లడానికి యమరాజు మోక్షం కల్పించడని గరుడ పురాణం చెబుతోంది.

కొరడాతో కొట్టడం
మొండిగా వ్యవహరించే ఆత్మలను యమధూతలను అతి కిరాతకంగా.. కొరడాతో కొట్టేస్తారు.

మండుతున్న ఇసుకలో నడక
అగ్నిలా మండిపోతున్న ఇసుకలో ఆత్మలు నడవలేకపోతాయి. అలాగే ఆకలితో ఉంటాయి. అదే సమయంలో యమధూతలు ఆత్మలను కొరడాతో కొట్టి నరకం చూపిస్తాయి.

సొమ్మసిల్లడం
చాలా సందర్భాల్లో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ కాసేపటికి నడవడం మొదలుపెట్టిన వెంటనే.. మళ్లీ కొరడాతో కొట్టి హింసిస్తారు యమధూతలు.

చనిపోయిన ప్రదేశానికి
యమలోకానికి చేరిన వెంటనే యమరాజు.. ఒకసారి.. ఆత్మను వాళ్లు చనిపోయిన స్థలానికి పంపిస్తారు.

అంత్యక్రియలు
చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా ? లేదా ? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ కిందకు పంపుతాడు.

అడవుల్లో తిరగడం
ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాలైన అడవుల్లో తిరుగుతూ ఉంటుంది.

పిండ ప్రదానం
గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే పిండ ప్రదానం చేయాలి.



Click it and Unblock the Notifications











