Latest Updates
-
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.!
ఒకప్పుడు హాస్యం అంటే ఇంటిల్లిపాదీ చూసి మనసారా నవ్వుకునేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాలం పోయింది. కనీసం భార్యాభర్తలు కూడా కలిసి నవ్వుకోలేని విధంగా వెగటు పుట్టించే హాస్య సన్నివేశాలు సినిమాల్లో, కామెడీ షోల్లో రాజ్యమేలుతున్నాయి. ఇక, స్టాండప్ కామెడీ షోల సంగతి అయితే.. హాస్యం కోసం ఏదైనా మాట్లాడొచ్చు అనేలా బౌండరీలు దాటేస్తున్నాయి. ఇటీవల 370 బిర్యానీ స్టోరీ నెట్టింట రచ్చ లేపగా.. మగాళ్ల మర్మాంగంపై ఓ మహిళా కమెడియన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

స్టాండప్ కామెడీ షోల్లో హద్దు మీరి హాస్యం చేసిన కమెడియన్లు ప్రణిత్ మోర్, మధుర్ విర్లీలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో స్టాండప్ కామెడీ షో హాస్య నటి ఐశ్వర్య మోహన్‌రాజ్‌కు చెందిన పాత క్లిప్ ఒకటి సోషళ్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింంది. ఆమె వేసిన జోకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
స్టాండప్ కమెడియన్ ఐశ్వర్య మోహన్ రాజ్ కామెడీ షోలో భాగంగా మగాళ్ల మర్మాంగంపై చేసిన హాస్యం, దానిపై ప్రేక్షకులు స్పందించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మోహన్‌రాజ్ తన తమ్ముడి పుట్టుక గురించి, ఆ సమయంలో తన తల్లి స్పందించిన తీరు గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వీడియోలో ఐశ్వర్య మోహన్ రాజ్ వ్యాఖ్యలు.. "మా తమ్ముడు పుట్టినప్పుడు మా అమ్మ చిన్న పిల్లలా చాలా ఏడ్చింది. ఆ సమయంలో అతని మర్మాంగాన్ని కోసేయాలని భావించింది. కానీ ఆ హాస్పిటల్‌లోని నర్సు అలా చేయడానికి అంగీకరించలేదు. కానీ ఒక ఆడదానిగా, నేను మా అమ్మ కలను నెరవేర్చాలనుకుంటున్నాడు. నాకు కొడుకు పుడితే అతడి మర్మాంగాన్ని కచ్చితంగా కోసేస్తాను." అని మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై ప్రేక్షకులు సైతం హాస్యంగా స్పందించారు. మరోవైపు ఈ షోలో ఉన్న పురుషులు చప్పట్లు కొట్టి అభినందించారు.
రూ. 370 బిర్యానీ వివాదం నేపథ్యంలో మహిళలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగగా.. ఇప్పుడు మగవారిపై మహిళా కమెడియన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైంది. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన హిమాంశును సదరు సంస్థ ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు.. పురుషుల మర్మాంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మహిళ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని హాస్యం, విమర్శ కోణంలో కప్పిపుచ్చలేమని.. ఇలాంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు.
కామెడీలో మితిమీరిన అంశాలు, అభ్యంతరాలు, వాటి జవాబుదారీతనంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పాత స్టాండప్ కామెడీ క్లిప్పులను బయటకు తీయడం.. కామెడీ హద్దులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. డార్క్ కామెడీ పేరుతో ఏదైనా మాట్లాడవచ్చా అని.. లేదంటే మారుతున్న కాలం, స్టాండర్డ్స్ ప్రకారం కామెడీని పాజిటివ్‌గా తీసుకోవాలా అని భిన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.
మరి వివాదంలో చిక్కుకున్న ప్రణిత్ మోరె, హత్యలు, అత్యాచారాలకు సంబంధించి జోకులు వేసిన మధుర్ వీటికి బాధ్యత వహిస్తూ బహిరంగంగా క్షమాపణ చెప్పగా.. ఈ తాజా వివాదంపై ఐశ్వర్య ఎలా స్పందిస్తారు.. ఈ అంశం ఎంతవరకు పోతుంది.. ఇలాంటి సంఘటనలు మళ్లీ ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.



Click it and Unblock the Notifications