Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.!
మనం భోజనం చేసిన వెంటనే ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగా అందాలంటే మీ రోజువారీ కొన్ని అలవాట్లు ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే జీర్ణక్రియపై ప్రభావం పడటంతో పాటు ఇట్టే బరువురు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. మరి భోజనం తర్వాత ఎలాంటి అలవాట్లు ఉండటం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయం ఏదైనా తిన్న వెంటనే టీ, కాఫీ లాంటి కెఫీన్ పదార్థాలను తీసుకోకూడదు. ఆహారం తీసుకునే గంట ముందు లేదా ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటిలోని కెఫీన్ కారణంగా ఆహారంలోని ఐరన్‌ను గ్రహించుకునే శక్తిని శరీరం కోల్పోతుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గి రక్తహీనతకి దారితీస్తుంది.
తిన్న వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం చేయకూడదు. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. బాడీలో యాసిడ్ శాతం పెరిగి ఛాతీలో మంటకి దారితీస్తుంది. అంతేకాకుండు పుల్లటి త్రేన్పులు వస్తాయి. అందుకే భోజనం చేసిన వెంటనే కాసేపు నడవడం ద్వారా పేగుల్లో కదలికలు మొదలై జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోకూడదు. ఆహారం తర్వాత పండ్లు తినడం ద్వారా అవి కడుపులో పులిసినట్లుగా మారి గ్యాస్ సమస్యకి దారితీస్తుంది. ఫలితంగా పొట్ట నొప్పి, త్రేన్పులు మొదలవుతాయి. జీర్ణక్రియకు ఆటంకం కలిగి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.
కొందరికి భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం అలవాటు. కానీ ఇది చాలా తప్పు. ఇలా చేయడం ద్వారా ఆహారం జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. దీంతో పొట్ట చుట్టూ ఉన్న రక్తం శరీరంలోని ఇతర భాగాలకు చేరడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.

డిన్నర్ తర్వాత చాలా మంది బ్రష్ చేసి కానీ నిద్రపోరు. ఇలా చేయడం ద్వారా పళ్లలో చిక్కుకున్న వ్యర్థాలు తొలగిపోయి బ్యాక్టీరియా చేరకుండా ఉంటుందని భావిస్తారు. కానీ తిన్న వెంటనే బ్రష్ చేయకుండా ఓ గంటసేపైనా విరామం ఇవ్వాలని సూచిస్తున్నారు. తిన్న వెంటనే బ్రష్ చేసుకోవడం ద్వారా పళ్లపైన నోట్లోని ఆమ్లాల ఒత్తిడి పెరిగి ఎనామిల్ పొరను దెబ్బతీస్తుంది.
భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. భోజనానికి నిద్రకు కనీసం రెండు గంటల విరామమైనా ఉండాలి. తిన్న వెంటనే కాసేపు వాకింగ్ చేయాలి. తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మీల్స్ తర్వాత ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
