Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.!
ఆధునిక కాలంలో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, లేటు వయసులో పెళ్లి ఇలా చాలా కారణాల వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య క్రమంగా పడిపోతుంది. ఈ సమస్యకి యోగాసనాల ద్వారా పరిష్కారం చూపవచ్చు.

పురుషుల్లో వీర్యంలోని శుక్ర కణాల చలనశీలత తగ్గిపోవడం, ఇన్‌ఫెక్షన్, డెత్ స్పెర్మ్ సెల్స్, నాణ్యత తగ్గిపోవడం, చీము కణాల శాతం పెరగడం ఇలా పలు వాటి ద్వారా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో వీర్యంలో బతికున్న కణాలు సైతం ఈ అడ్డంకుల కారణంగా అండాన్ని చేరుకోలేకపోతున్నాయని.. ఫలితంగా గర్భం దాల్చడానికి కష్టతరంగా మారిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో సంతానం కోసం ప్రయత్నించే మగవారు ఈ సమస్యను నివారించేందుకు తమ జీవనశైలిని పూర్తిగా మార్చేస్తున్నారు. వీర్య కణాల సంఖ్యను ఆరోగ్యకరంగా పెంచే ఆహారానికి, డైట్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు సంబంధించి సప్లిమెంట్స్ సైతం తీసుకుంటున్నారు. వ్యాయామం, వాకింగ్ ఇలా డైలీ రొటీన్‌లో ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు యోగాను భాగం చేసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు ఉంటాయని యోగా ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఈ యోగాసనాలు వేయడం ద్వారా స్మెర్మ్ కౌంట్ పెరుగుతుందని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
భుజంగాసనం
ఈ ఆసనం వేయడం ద్వారా పురుషుల్లో పునరుత్పత్తి భాగాలను ప్రేరేపిస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించి పునరుత్పత్తి వ్యవస్థకి రక్త ప్రసరణ ముఖ్యం. ఈ యోగాసనం ద్వారా ఒకసారి 10 పుష్‌అప్‌లతో వేయడం ద్వారా పొత్తి కడుపు కింది భాగాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాల నొప్పిని నివారిస్తుంది. వీర్య కణాల ఉత్పత్తితో నాణ్యతను సైతం పెంచుతుంది.
గాడెస్ పోస్ స్క్వాట్స్
ఈ ఆసనానికి ఒక 20 సార్లు వేయడం ద్వారా పొత్తి కడుపు కింది భాగంలో కండరాలను ఉత్తేజపరుస్తుంది. దీంతో వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. చీము కణాలను నివారిస్తుంది.
బటర్‌ఫ్లై భంగిమ
బటర్‌ఫ్లై యోగాసనం భార్యభర్తలిద్దరిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ యోగాసనం చాలా సులభం. ఈ ఆసనాన్ని ఐదు నిమిషాల పాటు చేయడం ద్వారా పొత్తి కడుపు భాగాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి వృషణాలకు రక్తం సరఫరా మెరుగవుతుంది. దంపతుల మధ్య లైంగిక శక్తిని ఉత్తేజపరుస్తుంది.
ఈ యోగాసనాలు కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగానూ మిమ్మల్ని బలంగా ఉంచడానికి దోహదపడుతుంది. సంతానోత్పత్తి ప్రక్రియలో మానసికంగానూ ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఆసనాలు ఒత్తిడి నుంచి సరైన నిద్రను అందిస్తాయి. రోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఓ అరగంట పాటు వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు తీసుకున్న డైట్ శరీరానికి సక్రమంగా అంది వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
