Latest Updates
-
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.!
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.!
హిందూ సంప్రదాయం ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజ చేయడం ప్రత్యేకత. మరి ఈ రోజు బుధవారం. ఈ రోజు ఏ దేవతారాధాన చేస్తే మరిన్ని శుభాలు కలుగుతాయి. ఈ రోజు పూజలో పాటించాల్సిన నియమాలు, విధానాలు ఏంటి.. జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారు.. ఇక్కడ చూద్దాం.

బుధవారానికి బుధ గ్రహం అధిపతిగా ఉంటే.. ఆ గ్రహానికి గణనాథుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రోజు గణపతి ఆరాధన అత్యంత శ్రేష్ఠకరమని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీమహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. బుధ గ్రహ దోషాలు తొలగేందుకు, విద్యా బద్ధులు పెరిగేందుకు ఈ రోజు చేసే ప్రత్యేక పూజలు సానుకూల ఫలితాలు అందుతాయని సూచిస్తున్నారు.
గణపతి ఆరాధన
బుధవారం రోజు విఘ్నేశ్వరుడుని ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, బుద్ధి బలం, జ్ఞానం, వ్యాపారంలో విజయం సిద్ధిస్తాయి. ఈ రోజు గణేశుడికి పూజలో గరిక పోచలు సమర్పించి పూజిస్తే అనుకున్న పనులు త్వరగా పూర్తయి లాభం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.
పూజా విధానం
ఈ రోజు గణనాథుడికి పూజ చేసేటప్పుడు ఉదయాన్నే తలంటు స్నానం చేసి శుభ్రమైన ఆకుపచ్చ రంగు బట్టలను ధరించడం ఉత్తమం. ఈ రంగు బుధ గ్రహానికి ప్రీతికరమైనది. ఇష్టమైన మోదకాలు లేదా శనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తే శ్రేయస్కరం. ఇంకా పెసలు నైవేద్యంగా పెట్టవచ్చు. ముఖ్యంగా భక్తితో ఉపవాసం ఉండటం వల్ల బుధ గ్రహ స్థానం బలపడుతుంది. పిల్లలకు చదువులో ఏకాగ్రత, ఉద్యోగులకో వృత్తిలో పురోగతి దక్కుతుంది.
ఉదయం గణపతి పూజ చేయడానికి తగినంత సమయం లేనివారు సాయంత్రం ఆరాధన చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. సంధ్యాసమయంలో చేసే గణపతి పూజ విఘ్నాలను తొలగించడమే కాకుండా మనలో ఉన్న ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది. పూజలో "ఓం బుధాయ నమః" మంత్రం లేదా గణేశ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి.
మహా విష్ణువు పూజ
బుధవారం విష్ణుమూర్తి, శ్రీకృష్ణ భగవానుడిని పూజించడం ద్వారా విశేష ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పూజలో భాగంగా స్వామి వారికి ఎంతో ఇష్టమైన తులసీ దళాలను సమర్పించడం ద్వారా ఆయన ప్రత్యేక ఆశీర్వాదాలు పొందవచ్చు. విష్ణుభగవానుడికి పండ్లు, పాలు, ఏవైనా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ’విష్ణు సహస్రనామం' పఠించడం లేదా వింటే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి శాంతి, ఐశ్వర్యాన్ని అందిస్తుంది.



Click it and Unblock the Notifications
