For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ రాశి ప్రకారం మీకు కలిసొచ్చే అదృష్టమేంటి ?

  By Swathi
  |

  మనందరికీ ఖచ్చితంగా లక్కీ చార్మ్ ఉంటుంది. అంటే.. మనం నమ్మే అదృష్టం ఉంటుంది. కొంతమంది దేవుడి ఫోటో, పుస్తకం, బైక్, అమ్మ ఫోటో, ఇష్టమైనవాళ్లు, తాయత్తు, డ్రెస్, కలర్ .. ఇలా ఏదో ఒకదాన్ని తమ అదృష్టమని భావిస్తారు. ఏదైనా పని చేసేటప్పుడు సక్సెస్ అవడానికి వాళ్లు అదృష్టంగా భావించే వస్తువు లేదా మనుషులు తమకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు.

  అయితే ఇలాంటి నమ్మకాలు కొంతమందికి సక్సెస్ అవుతాయి. కొంతమందికి ఫెయిల్యూర్ అవుతాయి. కొంతమంది తమకు అదృష్టం తీసుకొచ్చే వాటిని గుర్తించడంలో ఫెయిల్ అవుతారు. లక్కీ చార్మ్ అంటే.. మీకు అదృష్టం తీసుకొచ్చే ఏదో ఒక వస్తువును కొనుక్కోవడం కాదు. మీ జీవితాంతం మీకు తోడుగా, మీతోనే ఉండే వ్యక్తి లేదా వస్తువును మీకు అదృష్టం తీసుకొచ్చేదిగా గుర్తించాలి.

  మీ రాశి ప్రకారం మీకు కలిసొచ్చే అదృష్టమేంటి

  మరి మీ జీవితంలో మీకు కలిసొచ్చే అదృష్టమేంటి ? ఎలా, దేనిద్వారా మీకు కావాల్సిన అదృష్టం పొందగలుగుతారు ? మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అదృష్టాన్ని ఎలా గుర్తిస్తారు ? తెలియదా ? అయితే మీ రాశి తెలిస్తే చాలు.. మీకు అదృష్టం తీసుకొచ్చేది ఏంటో తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. మీ రాశి చెబుతున్న మీ అదృష్టమేంటో ఇప్పుడే తెలుసుకోండి. ..

  మేష రాశి

  మేష రాశి

  మేషరాశి వాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీళ్లు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. మీకు నచ్చినవిధంగా పనులు చేస్తారు. మీ లక్కీ ఛార్మ్ ట్రావెలింగ్.

  మీరు ట్రావెలింగ్ చేయడం వల్ల మీకు అదృష్టంతోపాటు సంతోషమూ దొరుకుతుంది.

  వృషభ రాశి

  వృషభ రాశి

  వృషభ రాశి వాళ్లకు చాలా ఓర్పు ఉంటుంది. మీరు ఎవరైనా నమ్మదగినవాళ్లు. మీ లక్కీ చార్మ్ మీరు ఇష్టపడే పుస్తకం. ఆ బుక్ మీరు చదివినప్పుడల్లా మీకు ప్రశాంతతను అందిస్తుంది. ఆ పుస్తకాన్ని మీ దగ్గర పెట్టుకుంటే.. మీరు ఎక్కడ ఉన్నా.. ఇంట్లోనే ఉన్నామన్న ఫీలింగ్ కలిగిస్తుంది.

  MOST READ:తెల్లజుట్టుకి న్యాచురల్ కలర్ అందించే హోంమేడ్ హెయిర్ డై..!

  మిధున రాశి

  మిధున రాశి

  మిధునరాశివాళ్లకు చాలా ఎనర్జీ ఉంటుంది. మీ మనలో వచ్చే ప్రతి ఆలోచనకు సమాధానం ఉంటుంది. మీకు అదృష్టం తీసుకొచ్చేది మీ ఫ్యామిలీనే. మీరు ఏ సమస్యా ఎదుర్కోకుండా.. మీ కుటుంబం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.

  కర్కాటక రాశి

  కర్కాటక రాశి

  కర్కాటక రాశివాళ్లు చాలా నమ్మకస్తులు.. అలాగే డిపెండబుల్ గా ఉంటారు. మీరు మీ గురించి చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మీకు అదృష్టం తీసుకొచ్చేది.. ఏదైనా జంతువు లేదా మీకు ఇష్టమైన పెట్. వాటితో గడపడం వల్ల మీరు ఎలాంటి పరిస్థితిలోనైనా.. వాటితో గడిపితే.. హ్యాపీగా ఉంటారు.

  సింహ రాశి

  సింహ రాశి

  సింహరాశి వాళ్లకు కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా ఎక్కువ. మీ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. మీరు ఇష్టపడే మీ స్నేహితులే మీ అదృష్టం. మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఏం చేయాలో తనకు బాగా తెలుసు. అలాగే మీ లైఫ్ లో మీకు ప్రశాంతతను తీసుకొస్తుంది.

  కన్యారాశి

  కన్యారాశి

  కన్యారాశి వాళ్లకు అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ. ఇతరులకు సహాయపడే గుణం ఎక్కువగా ఉంటుంది. మీకోసం మీరు సమయాన్ని కేటాయించడం వల్ల మీరు అదృష్టం పొందగలరు. మీ గురించి మీరు ఆలోచించడం వల్ల ఎక్కువ సంతోషం పొందగలుగుతారు.

  MOST READ:ఓం నమః శివాయ !! మంత్ర జపం ఎలా చేయాలి ? పొందే ఫలితాలేంటి ?

  తులా రాశి

  తులా రాశి

  మీరు ఎక్కువగా ప్రశాంతత కోరుకుంటారు. మీకు అదృష్టం తీసుకొచ్చేది పూలు. మీ చుట్టూ ఆప్యాయత పొందడానికి ఇష్టపడతారు. ఎక్కువ పూలు ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉండగలుగుతారు.

  వృశ్చిక రాశి

  వృశ్చిక రాశి

  వృశ్చిక రాశి వాళ్లు చాలా డైనమిక్ పర్సన్స్. అలాగే అందరికంటే చాలా విభిన్నంగా ఉంటారు. మీకు మీరే లక్కీ ఛార్మ్ అనిచెప్పవచ్చు. మిమ్మల్ని సంతోషపెట్టే విషయాలు మీకంటే.. వేరేది ఏదీ ఉండదు. మీరు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది.

  ధనుస్సు రాశి

  ధనుస్సు రాశి

  ధనస్సు రాశివాళ్లు చాలా ఎనర్జీ ఉంటుంది. మీ జీవితంలో ఓ చిన్న విషయం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. మీ చిన్ననాటి స్నేహితులు మీ లక్కీ ఛార్మ్. మిమ్మల్ని ఎప్పుడూ సంతోషపెట్టడతారు. వాళ్లు పాత తీపి గుర్తులతో మీ ముఖంలో చిరునవ్వు తీసుకొస్తారు. వాళ్లు మీ దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు.

  MOST READ:మీ రాశి ప్రకారం మీలో నలుగురికి నచ్చే క్వాలిటీ ఏంటి ?

  మరక రాశి

  మరక రాశి

  ఏ పనినైనా చేయడానికి వెనకాడరు. మీకు అదృష్టం తీసుకొచ్చేది మీ ఫేవరేట్ మూవీ. సినిమాలు చూడటం వల్ల మీరు ఈ ప్రపంచాన్ని కొత్తగా చూస్తారు, ఆనందాన్ని పొందుతారు. ఎప్పుడైనా మీకు జీవితంపై నిరాశ కలిగినా, ఏ పనిచేయాలి అనిపించకపోయినా.. మీ ఫేవరేట్ సినిమా చూస్తే చాలు.. మీరు ఇన్స్ పైర్ అవుతారు.

  కుంభ రాశి

  కుంభ రాశి

  ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవడానికి ముందు ఉంటారు. చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. మీ లక్కీ చార్మ్ వాటర్. మీరు నీళ్లలో ఉన్నా.. మీ చుట్టూ నీళ్లు ఉంటే చాలు.. మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు.

  మీన రాశి

  మీన రాశి

  మీకు అదృష్టం తీసుకొచ్చేది మ్యూజిక్. మ్యూజిక్ కంటే మరేది మిమ్మల్ని సంతోషపెట్టలేదు. మ్యూజిక్ మిమ్మల్ని చాలా క్రియేటివ్ గా, ఇమ్యాజినేటివ్ గా ఆలోచించేలా చేస్తుంది.

  English summary

  What Is YOUR Lucky Charm? Your Zodiac Says…

  What Is YOUR Lucky Charm? Your Zodiac Says. A lucky charm doesn’t always have to be something you especially buy because you think it’s lucky. It could be something or someone that has been close to you all your life!
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more