Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి..
ఉరుకుల పరుగుల జీవితంలో గంటల తరబడి వంటగదిలో గడపడానికి సమయం దొరకడం లేదా? తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే సామాన్లతోనే అదిరిపోయే రుచితో ఏదైనా స్పెషల్ డిష్ వండాలని ఉందా? అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా మీ ఇంట్లో ట్రై చేయండి. దీని క్రీమీ టెక్స్చర్, అద్భుతమైన సువాసనలకు మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ మీరే వండుకుంటారు.

ఎగ్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
మీడియం సైజు ఉల్లిపాయలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 4
ధనియాల పొడి - 1 టీస్పూన్
పుదీనా ఆకులు - 10 నుండి 12
పచ్చిమిర్చి - 2
ఉప్పు - అర టీస్పూన్
పాలు (మిక్సీ పట్టడానికి) - అర కప్పు
వెన్న (బట్టర్) - 2 టేబుల్ స్పూన్లు
పాలు (కూర వండటానికి) - అర కప్పు
నీళ్లు - అర కప్పు
గుడ్లు - 4
ఎగ్ కుర్మా తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, తాజా పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, ఉప్పు, అర కప్పు పాలు వేసి చాలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. పుదీనా, పాల కలయిక ఈ పేస్ట్ కు మంచి రంగును, సువాసనను ఇస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసి కరిగించండి. వెన్న కరిగాక ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి, మీడియం మంట మీద సరిగ్గా రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా కలుపుతూ వేయించండి.
-పేస్ట్ వేగుతుండగానే ఇల్లంతా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు అందులో మరో అర కప్పు పాలు, అరకప్పు నీళ్లు పోసి గరిటెతో బాగా కలపండి. ఇది ఉడుకుతూ రెస్టారెంట్ స్టైల్ క్రీమీ సాస్ లా మారుతుంది.
-ఇప్పుడు గ్రేవీ నెమ్మదిగా ఉడుకుతుండగా, 4 పచ్చి గుడ్లను ఒకదాని తర్వాత ఒకటి పగలగొట్టి నేరుగా ఆ గ్రేవీలో నెమ్మదిగా జారవిడవండి. గుడ్లు విడిపోకుండా, పచ్చసొన చెదరకుండా చాలా జాగ్రత్తగా వేయాలి.
-గుడ్లు వేసిన తర్వాత గరిటె పెట్టి అస్సలు కలపకూడదు. పాన్ పై మూత పెట్టి, సన్నని మంట మీద కచ్చితంగా 4 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. ఆ క్రీమీ కుర్మాలో గుడ్లు ఉడికి, మసాలా ఫ్లేవర్స్ అన్నీ గుడ్డుకు పడతాయి.
-అంతే ఘుమఘుమలాడే 10 నిమిషాల ఎగ్ కుర్మా రెడీ. మూత తీయగానే వచ్చే సువాసన మీ నోరూరించక మానదు. ఈ వేడివేడి ఎగ్ కుర్మాను చపాతీ, రోటీ, బగారా రైస్, పులావ్ లేదా పరాటాతో కలిపి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications