For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజిప్టు చర్రిత తెలుసుకుంటే ఆశ్చర్య పోవాల్సిందే !

By Y. Bharath Kumar Reddy
|

ఈజిప్ట్ లో భిన్న సంస్కృతికి కొన్ని వేల ఏళ్ల కిందే నెలకొంది. స్ఫింక్స్ , పిరమిడ్స్ , వాలీ ఆఫ్ కింగ్స్ లోని సమాధులు, లుక్సర్ ఇంకా కార్నాక్ లో ఉన్న దేవాలయాలు, పురాతన ఈజిప్ట్ సంస్కృతికి నిదర్శనాలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు పూర్వం ఈజిప్ట్ లో ఫెరోల సామ్రాజ్య స్థాపన ప్రారంభమైంది. వీరు మరణానంతరం కూడా జీవితంపై ఉన్న నమ్మకంతో సమాధుల పేర్లతో పిరమిడ్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలో అతి పొడవైన నైల్ నది వల్లే ఈజిప్ట్ కు అంత ప్రాచుర్యం ఏర్పడింది.

ఇక్కడ క్రీస్తుపూర్వం 3300 నుంచి 2686 వరకు జరిగిన కాలాన్ని మొట్టమొదటి రాజుల కాలంగా పరిగణిస్తారు. క్రీస్తు పూర్వం 2686 నుంచి 2181 వరకు ఫెరోలు పరిపాలించారు. క్రీస్తుపూర్వం 2181 నుంచి 1550 సంవత్సరం వరకు పాత రాజవంశ పతనానికి కొత్తరాజవంశ అవతరణకు మధ్య ఒక 130 సంవత్సరాలు ఈజిప్ట్ రాజవంశ చరిత్రలో అల్లకల్లోలం ఏర్పడింది. ఇక ఇక్కడ కొత్త రాజవంశంక్రీస్తుపూర్వం 1550 నుంచి 1069 సంవత్సరం వరకు కొనసాగింది. 19 సంవత్సరాలకే అనుమాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ఫెరో టుటన్‌కామూన్ చరిత్ర ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ చరిత్రలో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. వాటిని తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం.

1. సోదరులతో కాపురం చేసిన క్లియోపాత్ర

1. సోదరులతో కాపురం చేసిన క్లియోపాత్ర

ఈజిప్ట్ అందమైనా రాణి క్లియోపాత్ర ప్రపంచంలో అందిరికీ తెలిసే ఉంటుంది. ఆమె చాలా అందెగత్తె. అంతేకాదండోయ్. ఒక శృంగార బానిస. ఆమె ఈజిప్ట్ కు చివరి ఫారో. క్రీస్తు పూర్వం 69 లో పుట్టింది. ఆమె ఎంతో మంది మగాళ్ల ను తన బానిసలుగా చేసుకుంది. తన అందంతో అందరనినీ తనవంశం చేసుకుంది. ఆమెకు సెక్స్ అంటే చాలా పిచ్చి. ఇక ఈమె తన సోదరులనే పెళ్లి చేసుకుంది. ఒక్కొక్కరిని ఒక్కో సమయంలో ఈమె పెళ్లాడింది. ఈమె వివాహము చేసుకున్న తన సోదరులు టోలెమి 13, 14 కలిసి కొన్ని రోజుల రాజ్యపాలన చేసింది. కానీ చివరకు మాత్రం ఒంటరిదైంది. అంతేకాదు చాలామందితో ఈమె తన సంబంధాలు కొనసాగించింది.

2. గ్రేట్ పిరమిడ్

2. గ్రేట్ పిరమిడ్

ప్రపంచంలో అత్యంత, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు ఈజిప్ట్ పిరమిడ్లను.ఇవి ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా ఉంటాయి. ఇవి ఈజిప్టు రాజుల సమాధులు. ఇందులో ఒకటి గ్రేట్ పిరమిడ్. దీని మధ్య భాగంలో ఛియోవ్స్ సమాధి ఉంటుంది. దీని నిర్మాణానికి 1,00,000 మంది బానిసలు పని చేశారు. రాజులు శవాన్ని ఉంచే శవపేటిక (కాఫిల్ లేక సర్కోఫంగస్) ఈ గ్రానైట్ గదిలో పశ్చిమాన ఉంది. ఉత్తర దిశ నుంచి పిరమిడ్ లోపలికి ప్రవేశ మార్గం ఉంది. అక్కడ నుంచి ఒక వరండా ఉంది.

3. బీర్

3. బీర్

ఈజిప్ట్ ను రాజులు పరిపాలించే కాలంలో బీర్ ఎక్కువగా వినియోగంలో ఉండేది. దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. అలాగే బీర్ ను వీరు కరెన్సీ లాగా కూడా వినియోగించేవారు.

4. మార్క్ అంటోని, క్లియోపాత్రలకు ఇష్టమైనవి అవే

4. మార్క్ అంటోని, క్లియోపాత్రలకు ఇష్టమైనవి అవే

మార్క్ అంటోని, క్లియోపాత్రల బంధం అప్పట్లో రికార్డ్. వీరిద్దరూ ఎంతో సరదాగా గడిపేవారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు. అలాగే ప్రాక్టికల్ జోక్స్ వేయడమంటే ఇద్దరికీ ఇష్టమే. ఇద్దరికీ సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువే

5. అందరూ అందంగా తయారయ్యే వారు

5. అందరూ అందంగా తయారయ్యే వారు

ఇక ఈజిప్ట్ లో అప్పట్లో ఆడవారితో పాటు మగవారు కూడా అందంగా ముస్తాబయ్యేవారు. వీరు అందంగా మేకప్ చేసుకుని బయటకు వెళ్లేవారు. అప్పట్లోనే వీర సన్ స్క్రీన్ లోషన్స్ వినియోగించేవారు.

6. జంతువుల మమ్మీలు కూడా ఉండేవి

6. జంతువుల మమ్మీలు కూడా ఉండేవి

ఈజిప్టులో చనిపోయిన చాలా పిల్లులను కూడా ఇలా మమ్మీలుగా మార్చారు. ఒక మొసలిని కూడా వీరు ఇలా మమ్మీలుగా మార్చారు. జంతువులపై వీరికి ఎంత ఎక్కువ ఆప్యాయత ఉండేదనే విషయం దీన్నిబట్టి తెలుస్తుంది.

7. క్లియోపాత్ర ఈజిప్టియన్ కాదు

7. క్లియోపాత్ర ఈజిప్టియన్ కాదు

ఈమె అలెగ్జాండర్ మరణానంతరము ఈజిప్ట్ ను పాలించిన హేల్లెని స్టిక్ కాలపు గ్రీకు సంతతి కుటుంబానికి చెందిన టోలమాక్ రాజవంశపు చెందిన ఆమె. టోలెమీలు ఈజిప్ట్ ను పరిపాలించినా వీరు గ్రీక్ భాషే మాట్లాడేవారు. ప్రజలు కూడా ఈజిప్ట్ మాట్లాడటాన్నినిరాకరించేవారు. ఈమె తనను తాను ఈజిప్ట్ దేవత పోల్చుకునే వారు. యిసిస్ యొక్క పునర్జన్మగా ఆమె తనకుతాను భావిస్తోంది.

8. ఈజిప్ట్ రాజు టుటన్‌కామూన్

8. ఈజిప్ట్ రాజు టుటన్‌కామూన్

ఈజిప్ట్ ను కింగ్ టుటన్‌కామూన్ బీసీ 1332-1323 మధ్యపరిపాలించారు. అయితే ఈయన హిప్పోపొటమస్ అనే జంతువు దాడిలో చనిపోయినట్లు తెలుస్తుంది. ఈయన చనిపోయినప్పుడు శరీరంలో గుండె, ఛాతీ భాగం లేదు. ఆ జంతువును వేటాడే క్రమంలో అది తిరబడి దాడి చేయడంతో ఈయన చనిపోయాడు. కానీ ఈయన మరణానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

9. ఆడామగ ఇద్దరూ సమానమే

9. ఆడామగ ఇద్దరూ సమానమే

ఈజిప్ట్ లో అప్పట్లో స్త్రీ, పురుషులిద్దరూ సమానమే. సమాజంలో ఇద్దరికీ ఒకే గౌరవం ఉండేది. ఇరువురి కోసం ఒకే రకమైన చట్టాలు అమలులో ఉండేవి. భార్యాభర్తలకు సంబంధించిన ఆస్తులను భార్యలు కూడా తమకు నచ్చితే అమ్ముకోవొచ్చు. అలాగే సంపాదించుకునే స్వేచ్ఛ ఉండేది. వారు వ్యాపారాలు కూడా చేయొచ్చు. అలాగే వారికి ఇష్టం లేకుండా భర్తలకు విడాకులు ఇచ్చే సంప్రదాయం కూడా ఉండేది.

10. కండోమ్స్ ఉపయోగించేవారు

10. కండోమ్స్ ఉపయోగించేవారు

ఈజిప్ట్ లో అప్పట్లోనే కండోమ్స్ ఉపయోగించేవారు. లయన్ క్లాత్స్ ను వీరు కండోమ్ లుగా వినియోగించేవారు. పలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వీరు ఇలా చేసేవారు.

11. ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం

11. ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం

ఈజిప్టులో రాజ కుటుంబీకులు చనిపోతే వారి శరీరాలను మమ్మీలుగా మార్చే పద్ధతి అందరికీ తెలిసిందే. శరీరాలను భద్రపరిస్తే మరణించిన వారి ఆత్మలు శాంతిస్తాయని ఈజిప్షియన్ల నమ్మకం. దీనికి వీలుగా శవాలను భద్రపర్చడం ఒక ఆనవాయితీగా వచ్చింది.

12. అనారోగ్యాలతో బాధపడే వారు

12. అనారోగ్యాలతో బాధపడే వారు

ఈజిప్టును పరిపాలించిన వారంతా అనారోగ్యాలతో బాధపడే వారు. వీరు తీసుకునే ఆహారం కాస్త డిఫరెంట్ గా ఉండేది. వీరు రోజూ మాంసం, బీర్, వైన్, బ్రెడ్, తేనె తదితర పదార్థాలను ఆహారాలుగా తీసుకునే వారు. వీరు ఎక్కువగా డయాబెటిస్ తదితర వ్యాధులతో బాధపడ్డారు కూడా.

13. క్లియోపాత్రకు 12 భాషలు వచ్చేవి

13. క్లియోపాత్రకు 12 భాషలు వచ్చేవి

క్లియోపాత్ర మ్యాథ్స్, ఫిలాసపీ చదివారు. ఈమె 12 భాషల్లో మాట్లాడేవారు. చాలా విషయాలపై ఈమెకు ఎక్కువగా నాలెడ్జ్ ఉండేది.

14. మమ్మీలను ఇలా తయారు చేసేవారు

14. మమ్మీలను ఇలా తయారు చేసేవారు

మమ్మీగా తయారుచేయడానికి శరీరం నుంచి పొట్ట, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులను ఎడమవైపు నుంచి తొలగించేవారు. గుండెను మాత్రం అలానే ఉంచేవారు. మెదడును తొలగించి ఖాళీ పుర్రెలో జిగురు కలిపిన బట్ట పీలకలతో నింపేవారు. శరీరం నుంచి చెమ్మను తొలగించడానికి ఒక రకమైన లవణ పదార్థాన్ని వినియోగించేవారు. మృతదేహంపై జిగురులాంటి పదార్థాన్ని పూసేవారు. దానికి ఒక పెద్ద వస్త్రాన్ని చుట్టుకుంటూ పోయేవారు.

శరీరం గట్టిపడి ఆకారాన్ని పరిరక్షించేందుకు ఆ తర్వాత 15 రోజులు ఆరబెట్టేవారు. చివరకు వస్త్రాన్ని చుట్టేవారు. చుట్టేటప్పుడు అనేక తాయెత్తులను మృతదేహంపై ఉంచి ముఖం, భుజాలు, మిగతా శరీరంపై చివరిసారిగా వస్త్రాన్ని కప్పేవారు. ఇలా మృత కళేబరాన్ని పరిరక్షించే ప్రక్రియకు 70 రోజుల పట్టేది.

15. కొన్ని మమ్మీల్లో అవయవాలను ఉంచే చేశారు

15. కొన్ని మమ్మీల్లో అవయవాలను ఉంచే చేశారు

క్రీ.పూ 1800 సంవత్సరం నాటి 21వ రాజవంశీకుల కాలంలో తయారైన మమ్మీల్లో మృతదేహం లోపల భాగంలో కండరాలు, మాంసం ఉన్నట్లు కొన్ని పదార్థాలు నింపడంలో కళాత్మకతను ప్రదర్శించారు. మమ్మీ సంరక్షణ ప్రక్రియలో భాగంలో ముందుగా శవ పేటికల్లోనూ, ఆ తర్వాత శవాగారంలో ఉంచేవారు.

16. వారి జుట్టు కనపడకుండా ఉండేది

16. వారి జుట్టు కనపడకుండా ఉండేది

ఫారోస్ హెయిర్ చాలా భయంకరంగా ఉండేది. అయితే వీరిలో ఆడవారైనా, మగవారైనా ఒక కిరీటంలాంటి దాన్ని తలకు పెట్టుకునే వారు.

17. గిజా పిరమిడ్ ఎంతో ప్రత్యేకం

17. గిజా పిరమిడ్ ఎంతో ప్రత్యేకం

గిజా పిరిమిడ్ ఈజిప్ట్ లో ఎంతో ప్రత్యేకమైనది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిది గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ ఈజిఫ్ట్‌. దీనిని క్రీస్తుపూర్వం 2550లో ఫారో రాజులు నిర్మించారు.

18. టూత్ పేస్ట్ వినియోగించేవారు

18. టూత్ పేస్ట్ వినియోగించేవారు

వీరు అప్పట్లోనే టూత్ పేస్ట్ వాడేవారు. రోజూ వీరు దీనితోనే పళ్లు తోముకునేవారు. పెప్పర్ ప్లేవర్ ను ఎక్కువగా వాడేవారు. అలాగే ఉప్పుతో తయారు చేసిన పేస్ట్ లు కూడా ఉండేవి.

19. క్యాలెండర్స్

19. క్యాలెండర్స్

వీరు ఉయోగించే క్యాలెండర్స్ కూడా డిఫరెంట్ గా ఉండేవి. అస్ట్రోనోమికల్ క్యాలెండర్, లూనర్ క్యాలెండర్, ఇక ఏ రోజుకారోజు విషయాలు తెలుసుకునేలా రూపొందించుకున్న క్యాలెండర్స్ ను వీరు వినియోగించేవారు.

20. జంతువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు

20. జంతువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు

వీరు జంతువులకు కూడా ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చేవారు. పశువులతో గొర్రెలు, మేకలు, పందులను వీరు పెంచేవారు. బాతులు, పావురాలు పెంచుకునేవారు. వీరు బరువులు మోసేందుకు గాడిదలను ఉపయోగించేవారు. గుర్రాలు, ఒంటెలను కూడా వీరు ఉపయోగించుకునేవారు. కుక్కలు, పిల్లులు, కోతులు పెంపుడు జంతువులుగా ఉండేవి.

21. వ్యవసాయం ఎక్కువ

21. వ్యవసాయం ఎక్కువ

ఎక్కువ మంది పురాతన ఈజిప్షియన్లు రైతులుగా ఉండేవారు. వీరు ఆరోగ్య సూత్రాలు పాటించేవారు. అలాగే వేషధారణకు ప్రాధాన్యత ఇచ్చేవారు. స్నానానికి జంతువుల కొవ్వు, సుద్దముక్క నుంచి చేసిన పిండి సబ్బును ఉపయోగించేవారు. బ్రెడ్, బీరు వీని ముఖ్య ఆహారం. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఖర్జూరా, అంజీరాలను వీరు ఆహారంగా తీసుకునేవారు.

22. సామగ్రి మొత్తం సమాధుల్లో

22. సామగ్రి మొత్తం సమాధుల్లో

మరణించిన సంపన్న ఈజిప్షియన్లను పెద్దఎత్తున విలాస వస్తువులతో పూడ్చిపెట్టేవారు. సమాధుల్లో మరణించినవారి వస్తువులను కూడా ఉంచేవారు. వారూ రోజూ ఉపయోగించే సామగ్రి మొత్తం కూడా సమాధుల్లో ఉంచేవారు.

Read more about: pulse insync facts పల్స్
English summary

ancient egypt facts myths

From who really built the pyramids to Cleopatra's favorite prank, these are the most fascinating Ancient Egypt facts you'll ever read.
Desktop Bottom Promotion