Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
బిర్యానీ.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరని వారుండరు. భారతీయుల పాలిట ఇదొక ఎమోషన్. ఆదివారం వచ్చినా, ఇంట్లో ఏ చిన్న పండుగ జరిగినా మన ప్లేట్ లో బిర్యానీ ఉండాల్సిందే. అయితే ప్రాణంగా తినే ఈ బిర్యానీ విషయంలో రుచి కోసం మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మన ఆరోగ్యంపై తీవ్రమైన విషపూరిత ప్రభావాలను చూపుతాయని మీకు తెలుసా?

ఇటీవల జరిగిన కొన్ని ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో, బిర్యానీ తిన్న తర్వాత ఏమి తినకూడదో వివరిస్తూ ఆరోగ్య నిపుణులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బిర్యానీ కొంచెం ఘాటుగా ఉండి, జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అస్సలు చేయకూడని పనులు ఏంటో చూడండి.
టీ లేదా కాఫీ
హెవీగా తిన్న తర్వాత ఓ కప్పు వేడి వేడి టీ తాగితే బాగుంటుందని చాలామందికి అలవాటు. కానీ టీలోని టానిన్స్ బిర్యానీ ద్వారా లభించే ప్రోటీన్లను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల పోషకాలు అందకపోగా, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.
బిర్యానీ, పుచ్చకాయ
ముంబైలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఈ కాంబినేషన్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయుర్వేదం, ఆహార శాస్త్రం ప్రకారం.. బిర్యానీ జీర్ణం కావడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.
కానీ పుచ్చకాయ లాంటి నీటి శాతం ఉన్న పండ్లు కేవలం 20-30 నిమిషాల్లోనే అరిగిపోతాయి. బిర్యానీ తిన్న వెంటనే పండ్లు తింటే అవి అరగకుండా కడుపులోనే ఉండిపోయి కుళ్ళిపోవడం మొదలవుతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ.
పాలు, పాల ఉత్పత్తులకు దూరం
సాధారణంగా బిర్యానీలో చికెన్ లేదా మటన్ వాడతారు. మాంసాహారం, పాలు ఒకదానికొకటి విరుద్ధ ఆహారాలు. బిర్యానీ తిన్న వెంటనే పాలు తాగడం లేదా పాలతో చేసిన స్వీట్లు తినడం వల్ల చర్మ వ్యాధులు, తీవ్రమైన జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రోబయోటిక్ గా పనిచేసే పెరుగు లేదా మజ్జిగను మరీ చల్లగా లేకుండా, మితంగా మాత్రమే వాడాలి.
కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ వద్దు
బిర్యానీలోని కారం తగ్గించుకోవడానికి చాలామంది వెంటనే ఫ్రిజ్ లోంచి తీసిన కూల్ డ్రింక్స్ లేదా చల్లటి నీళ్లు తాగుతుంటారు. ఇది మనం చేసే అతిపెద్ద తప్పు. బిర్యానీ తయారీలో నూనె, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కడుపులోకి చల్లటి నీరు వెళ్లగానే, ఆ నూనె అంతా గడ్డకట్టిపోయి జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్తి వస్తాయి. దీర్ఘకాలంలో ఇది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది.

నిపుణుల సూచనలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం బిర్యానీ తిన్న తర్వాత కనీసం 30 నుండి 60 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఎండాకాలంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి బయట తినేటప్పుడు ఆహారం తాజాగా ఉందో లేదో గమనించండి.
ఒకవేళ బిర్యానీ తిన్న తర్వాత వికారం, ఆగని వాంతులు, లేదా తీవ్రమైన కడుపునొప్పి లాంటివి వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అవి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కావచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
