ఇలాంటి సువాసనలన్నింటితో మగవాళ్ళ మనస్సును దోచేయొచ్చు..కావాలంటే టేస్ట్ చేసి చూడండి

By: sujeeth kumar
Subscribe to Boldsky

అపోజిట్ సెక్స్ వ్య‌క్తుల‌ను ఆక‌ర్షించేందుకే సుగంధ ప‌రిమ‌ళాల‌ను త‌యారుచేశార‌ని కొంద‌రి వాద‌న‌. వాస్త‌వానికి స‌హ‌జంగానే కొన్ని సువాస‌న‌ల‌కు ముగ్ధులైపోతారు.

ఒక ప‌రిశోధ‌కుల బృందం క‌లిసి మ‌గ‌వాళ్ల‌ను ఆక‌ర్షించే సుగంధ ప‌రిమళాలేమిటో అధ్యాయ‌నం చేశారు. వాళ్లు చేసిన ప‌రిశోధ‌న‌లో భాగంగా కొన్ని ర‌కాల సువాస‌నాల జాబితాను తయారుచేశారు. ఇందులోనూ ఎంతో రుచిక‌ర‌మైన ఆహార ప‌దార్థాల సువాస‌న మ‌గ‌వాళ్ల‌ను రంజింప‌జేస్తుంద‌ని తేల్చారు. వాటి వాస‌న పీలిస్తే చాలు మ‌గ‌వాళ్లు ఉద్రేకం చెందుతున్నార‌ని క‌నుగొన్నారు.

ఇత‌ర సుగంధ ప‌రిమ‌ళాల‌తో పోలిస్తే ఏయే ఆహార ప‌దార్థాల సువాస‌నల‌కు అబ్బాయిలు ప‌డిపోతారో తెలుసుకుందామా...

1. వెనీలా

1. వెనీలా

మ‌గ‌వాళ్ల మ‌గ‌త‌నాని కోసం డాక్ట‌ర్లు వెనీలాను సిఫార‌సు చేస్తుంటారు. వెనీలా సువాసన తీయ‌గా, ఆహ్వానించే విధంగా ఉంటుంది. అది నేరుగా మెద‌డుపై ప్ర‌భావం చూపించి మంచి మూడ్‌లోకి దించేలా చేస్తుంది.

2. డోన‌ట్‌, బ్లాక్ లికోరైస్‌

2. డోన‌ట్‌, బ్లాక్ లికోరైస్‌

ఈ రెండింటి కాంబినేష‌న్ తో మ‌గ‌వాళ్ల‌లో 30శాతం ఉద్రేక భావ‌న‌లు పెరుగుతాయ‌ని ప‌రిశోధ‌కుల బృందం కనుగొంది. ఈ రెండింటి తీయ‌ని వాసన మ‌గ‌వాళ్ల‌ల్లో సెక్స్ భావ‌న‌ల‌ను సుల‌భంగా పెంపొందిస్తాయ‌ట‌.

3. గుమ్మ‌డికాయ‌

3. గుమ్మ‌డికాయ‌

గుమ్మ‌డికాయ ముక్క‌ను, లావెండ‌ర్ సువాస‌న‌ను ఒకేసారి పీలిస్తే మ‌గ‌వాళ్లు మునుప‌టి కంటే 40శాతం ఎక్కువ‌గా కామోద్రోకానికి గుర‌వుతార‌ట‌. వెనీలా, దాల్చిన చెక్క‌ను గుమ్మ‌డికాయ‌లో ఉంచి వాస‌న పీలిస్తే సెక్స్ హార్మోన్లు ఉత్తేజిత‌మ‌వుతున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

4. ఆరెంజ్‌

4. ఆరెంజ్‌

ఆరెంజ్ ఫ‌లాల సువాస‌న అమోఘం. దీని వ‌ల్ల 20శాతం మ‌గ‌వాళ్ల‌లో ఉత్తేజం రేకేత్తిందని తేల్చారు. ఆరెంజ్ పండు వాస‌న చూసిన‌వారి ఊహాలోకంలో కాస్త విహ‌రించి ఎక్కువ‌గా అమ్మాయిల ప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యార‌ట‌.

5. పాప్‌కార్న్‌

5. పాప్‌కార్న్‌

ఇక మ‌న‌కెంతో ఇష్టమైన సాల్టీ, క్రంచీ పాప్‌కార్న్ కూడా జాబితాలో ఉంది. సినిమా చూస్తూ పాప్‌కార్న్ వాస‌న పీలుస్తూ తింటుంటే ఆ మ‌జాయే వేరు క‌దా! పాప్‌కార్న్ వాస‌న‌తో మ‌గ‌వాళ్లు ఉత్తేజితుల‌వుతారు. ఎంతో ఉల్లాసంగా మారిపోతారు. మంచి మూడ్‌లోకి వ‌స్తార‌ని ప‌రిశోధ‌కుల బృందం తేల్చిచెప్పింది.

ఈ జాబితాతో మీరు ఏకీభ‌విస్తారా? మీ అభిప్రాయాల‌ను కామెంట్ సెక్ష‌న్‌లో రాయ‌గ‌ల‌రు.

English summary

Smells Which Can Turn Men On That Are Scientifically Proven!

These smells/perfumes are based on the results got from the experiment. According to researchers, it was the scent of some common yummy foods that got the men aroused. Check out on the list of smells that can turn on men instantly when compared to other fragrances...
Story first published: Sunday, November 19, 2017, 18:00 [IST]
Subscribe Newsletter