Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా?
రోజూ ఒకేరకమైన బంగాళదుంప (ఆలూ) లేదా పనీర్ పరాఠాలు తిని మీకు విసుగొచ్చిందా? ఏదైనా కొత్తగా, రుచికరంగా తినాలనిపిస్తోందా? అయితే దహీ లచ్చా పరాఠా ట్రై చేయండి. బయట కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయేంత మృదువుగా ఉండటం దీని ప్రత్యేకత. దీన్ని తయారు చేయడానికి చుక్క నీరు కూడా అవసరం లేదు.

దహీ లచ్చా పరాఠా తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి లేదా మైదా - 2 కప్పులు
తాజా పెరుగు -అర కప్పు
పాలు - అర కప్పు
ఉప్పు - అర టీస్పూన్
పొడి చక్కెర - 2 టీస్పూన్లు
నూనె - 1 టీస్పూన్ (పిండిలో కలపడానికి) + పావు కప్పు (పొరల కోసం)
కార్న్‌ఫ్లోర్- అర కప్పు
చిల్లీ ఫ్లేక్స్ - కొద్దిగా
సన్నగా తరిగిన ఉల్లికాడలు - కొద్దిగా

దహీ లచ్చా పరాఠా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో పెరుగు, పాలు, ఉప్పు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో పిండిని కొద్దికొద్దిగా వేస్తూ మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. చివరగా ఒక టీస్పూన్ నూనె వేసి, 5 నుండి 7 నిమిషాల పాటు సాగే గుణం వచ్చేలా బాగా పిసకాలి.
-ఇప్పుడు కలిపిన పిండిపై మూతపెట్టి కనీసం అరగంట పాటు పక్కన పెట్టాలి.
-తర్వాత ఒక చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పావుకప్పు నూనె వేసి పేస్ట్ లా కలుపుకోవాలి.
-ఇప్పుడు నానబెట్టిన పిండి ముద్దను తీసుకుని పెద్దగా, పల్చటి చపాతీలా ఒత్తుకోవాలి. దీనిపై కార్న్‌ఫ్లోర్-నూనె మిశ్రమాన్ని అంతటా సమానంగా రాయాలి. ఆ తర్వాత చపాతీ అంచుల నుండి మధ్యలోకి చిన్న చిన్న గాట్లు (కట్స్) పెట్టాలి. దానిపై చిల్లీ ఫ్లేక్స్, తరిగిన ఉల్లికాడలు చల్లాలి. దీనివల్ల పరాటాకి కారంతో పాటు మంచి రుచి వస్తుంది.
-ఇప్పుడు కత్తిరించిన ముక్కలను ఒక్కొక్కటిగా మధ్యలోకి మడవాలి. ఇలా చేయడం వల్లే పరాఠాకి అందమైన పొరలు వస్తాయి. మడిచిన వెంటనే ఒత్తకుండా, పొరలు సెట్ అవ్వడానికి ఓ 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-పది నిమిషాల తర్వాత పొరలు విడిపోకుండా పిండిని సున్నితంగా చపాతీలా ఒత్తుకోవాలి.
-స్టవ్ వెలిగించి పెనం వేడయ్యాక పరాఠాను వేయాలి. పెరుగు, పాలు వాడటం వల్ల పరాటా త్వరగా రంగు మారుతుంది. కాబట్టి మంటను మీడియంలోనే ఉంచి కాల్చాలి. నెయ్యి లేదా నూనె రాస్తూ, రెండు వైపులా అంచులు కరకరలాడేలా, బంగారు రంగు వచ్చేలా కాల్చుకోవాలి.
-పెనం మీద నుండి పరాఠాను తీసిన వెంటనే, రెండు చేతులతో దాన్ని పట్టుకుని లోపలికి సున్నితంగా నలిపినట్లుగా (క్రష్) చేయాలి. ఈ చిన్న ట్రిక్ వల్ల పరాటా పొరలన్నీ విడిపోయి, డాబా స్టైల్ లచ్చా పరాటాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
-అంతే నోరూరించే దహీ లచ్చా పరాటా రెడీ. దీన్ని వేడివేడిగా పుదీనా పెరుగు, కారపు పచ్చడి లేదా క్రీమీ పనీర్ కర్రీతో తింటే వాహ్వా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications