For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ‌నీమూన్‌లో ఉండ‌గా ఈ 7 ప‌నులు అస్స‌లు చేయ‌కండి. లేదంటే సెక్స్ స‌రిగ్గా చేయ‌లేరు!

By Sujeeth Kumar
|

ఇది హ‌నీమూన్ సీజ‌న్‌. కొత్త జంట‌లు టికెట్లు బుక్ చేసుకోవ‌డంలోనో, హ‌నీమూన్‌కు ఎక్క‌డికి వెళ్లాలో అన్న‌దాని పైన ఇప్ప‌టికే తుది నిర్ణ‌యానికి వ‌చ్చేసి ఉంటారు.
ఇవాళ రేపు పెళ్లిల త‌ర్వాత హ‌నీమూన్ వెళ్ల‌డ‌మ‌న్న‌ది స‌ర్వ‌సాధార‌ణ విష‌య‌మైపోయింది. కొత్త‌గా పెళ్ల‌యిన‌వారు ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డానికి ద‌గ్గ‌ర‌య్యేందుకు ఇది చ‌క్క‌ని అవ‌కాశంగా చెప్పుకోవ‌చ్చు.

మీ భాగ‌స్వామితో క‌లిసి మ‌ధుర క్ష‌ణాల‌ను సృష్టించుకొని జీవితాంతం గుర్తుపెట్టుకునే స‌రైన సంద‌ర్భ‌మిదే.

మీ ఇద్ద‌రు క‌లిసి ఏకాంతంగా గ‌డిపే క్ష‌ణాలు, అటు శారీర‌కంగా, మాన‌సికంగా ద‌గ్గ‌ర అయ్యేలా హ‌నీమూన్ స‌హ‌క‌రిస్తుంది. కాబ‌ట్టి హ‌నీమూన్ లో ఉండ‌గా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఆనంద‌మ‌యంగా గ‌డ‌ప‌వ‌చ్చు.

హ‌నీమూన్‌లో ఉండ‌గా కొన్ని విష‌యాల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధాన్ని అవి చెడ‌గొట్ట‌వ‌చ్చు. అవేమిటో తెలుసుకుందామా..

1. శ్రుతి మించి మద్య‌పాన సేవ‌నం

1. శ్రుతి మించి మద్య‌పాన సేవ‌నం

అధికంగా మ‌ద్య‌పానం సేవించ‌డం, ఎక్కువ‌గా కాఫీలు, టీలు తాగ‌డం వ‌ల్ల శృంగారంలో స‌మ‌ర్థంగా పాల్గొన‌లేరు. కెఫిన్ వ‌ల్ల ఆందోళ‌న స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అవి శృంగారంపై ప్ర‌భావం చూపిస్తాయి. అలాగే శ్రుతి మించి మ‌ద్యాన్ని సేవించ‌డం కూడా సెక్స్‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ట‌. ర‌స‌క్రీడ‌లో ప‌టుత్వాన్ని కోల్పోయేలా చేస్తాయ‌ని నిపుణులు అంటారు.

2. క‌స‌ర‌త్తులు అంత‌గా అవ‌స‌రంలేదు

2. క‌స‌ర‌త్తులు అంత‌గా అవ‌స‌రంలేదు

హ‌నీమూన్‌లో ఉన్నా కూడా బాడీ బిల్డింగ్ పైన బాగా శ్ర‌ద్ధ పెడుతున్నారా? ఎక్కువ‌గా వ్యాయామం చేస్తే అల‌సిపోయి సెక్స్ స‌రిగ్గా చేయ‌లేమోమో. కొన్ని ప‌రిశోధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే స‌రైన నిద్ర లేనికార‌ణంగా కూడా మూడ్ స‌రిగా రాద‌ని వెల్ల‌డించాయి. కాబ‌ట్టి హ‌నీమూన్‌లో ఉండ‌గా ఎల్ల‌ప్పుడూ రిలాక్స్ అయ్యేందుకు చూసుకోండి.

3. కొత్త మందుల వాడ‌కాన్ని ...

3. కొత్త మందుల వాడ‌కాన్ని ...

మీరు ఇటీవ‌లె కొత్త మందుల‌ను వేసుకోవ‌డం ప్రారంభించారా. అయితే అది మీ శృంగార ఉద్దీప‌న‌ను త‌గ్గించ‌గ‌ల‌దు జాగ్ర‌త్త‌. యాంగ్జ‌యిటీ స‌మ‌స్య‌లు తీసుకురాగ‌ల‌వు. ఏదైనా కొత్త మెడిసిన్ వాడి దానితో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్ట‌యితే వాటిని తాత్కాలికంగా మానేయాలి. మీ డాక్ట‌ర్‌తో ఈ విష‌య‌మై చ‌ర్చించి త‌గిన నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రు.

4. గుర‌క స‌మ‌స్య‌లు

4. గుర‌క స‌మ‌స్య‌లు

గుర‌క పెడుతున్నారా? అది మీ భాగ‌స్వామికి చిరాకు క‌లిగించ‌వ‌చ్చు. చిరాకు సంగ‌తి అటుంచితే గుర‌క కూడా శృంగార సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే అంశాల్లో ఒక‌టని నిపుణులు అంటారు. హ‌నీమూన్ కు వెళ్లేముందు ఒక‌సారి డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి గుర‌క నివార‌ణ‌కు చికిత్స తీసుకోవాలి. వీలైనంత వ‌ర‌కు స‌హ‌జ ప‌ద్ధ‌తుల‌నే ఆశ్ర‌యించాలి. మ‌గ‌వారికి, ఆడ‌వారికి గుర‌క ఇబ్బందుల‌ను కొనితెస్తుంది.

5. ఆహార ఎంపిక‌లో..

5. ఆహార ఎంపిక‌లో..

కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు సెక్స్ సామ‌ర్థ్యాన్ని త‌గ్గిస్తాయి. స్పైసీ ఫుడ్ తిన‌డాన్ని మానేయాలి. దీని వ‌ల్ల టెస్టోస్టెరాన్ దెబ్బ‌తింటుందంటారు. అదే విధంగా పుదీన‌, ఫ్లాక్స్ సీడ్‌, స్ట్రాబెర్రీలు, సోయ‌, బీట్‌రూట్‌, పిండి ప‌దార్థాలు మ‌రీ ఎక్కువుండే ఆహార ప‌దార్థాల‌కు సాధ్య‌మైనంత దూరంగా ఉండాలి. స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌ర్వాతే ఆహారాన్ని స్వీక‌రించాలి.

6. పాల సంబంధ ఉత్ప‌త్తుల‌కు దూరంగా..

6. పాల సంబంధ ఉత్ప‌త్తుల‌కు దూరంగా..

ఈ స‌మ‌యంలో పాల ఉత్ప‌త్తుల‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఈస్ట్రోజ‌న్‌, టెస్టోస్టిరాన్ లెవ‌ల్స్‌పైన ప్ర‌భావం చూపిస్తాయి. సెక్స్ సామ‌ర్థ్యం పెంచ‌డంలో టెస్టోస్టిరాన్‌ది కీల‌క‌పాత్ర‌. పాలు, పెరుగు, చీజ్ లాంటివి ఎక్కువ తీసుకుంటే టెస్టోస్టిరాన్ త‌గ్గుతుంది, ఈస్ట్రోజ‌న్ పెరుగుతుంది. కాబ‌ట్టి మితిమీరి పాల ప‌దార్థాలు స్వీక‌రించ‌కూడ‌దు అని అంటారు. అవి వ్య‌క్తిలో యాంగ్జైటీ క‌ల‌గ‌జేస్తాయి.

7. మాద‌క ద్ర‌వ్యాల‌కు దూరంగా..

7. మాద‌క ద్ర‌వ్యాల‌కు దూరంగా..

చాలా మంది మాద‌క ద్ర‌వ్యాల‌ను సేవిస్తూ ఎంజాయి చేస్తుంటారు. ఇది సెక్స్ లైఫ్‌ను నాశ‌నం చేసేయ‌గ‌ల‌దు. ముఖ్యంగా కెన్నాబిస్ అనే మాద‌క ద్ర‌వ్యం సేవించ‌కుండా ఉండాలి. కొన్ని పరిశోధ‌న‌లు తేల్చి చెప్పిందేమిటంటే మ‌రిజువానా తీసుకున్న 24 గంట‌ల్లో టెస్టోస్టిరాన్ స్థాయుల్లో త‌గ్గుద‌ల‌ను గ‌మ‌నించార‌ట‌. మ‌రి మీరూ ఇలాంటివి తీసుకోకుండా జాగ్ర‌త్త ప‌డండి.


English summary

Surprising Things That Can Kill Your Sex Drive During Honeymoon

Surprising Things That Can Kill Your Sex Drive During Honeymoon,Here, we mention to you the things that can kill your sex drive during the tour! And hence, it is highly recommended you stay away from these.
Story first published:Sunday, November 19, 2017, 10:36 [IST]
Desktop Bottom Promotion