హృదయ రేఖ చివరి భాగం లో V అను అక్షరం ఉన్నవారు , తెలుసుకోవలసిన విషయాలు.

Subscribe to Boldsky

హృదయ రేఖ చివరి భాగం లో V అను అక్షరం ఉన్నవారు , తెలుసుకోవలసిన విషయాలుహస్తసాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు గురించి వివరించే కళగా చెప్పవచ్చు, దీనిని అరచేతి పఠనం లేదా చిరోలాజీ అని కూడా పిలుస్తారు. ఈ విధానం పలు సాంస్కృతిక వైవిధ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది. సాముద్రికాన్ని సాధన చేసిన వారిని సాధారణంగా హస్తసాముద్రికులు , అరచేతిని చదవగలిగేవారు , చేతిని చదివేవారు , చేతి విశ్లేషకులు లేదా సాముద్రికులు అని పిలుస్తారు.

సాముద్రికం యొక్క సాధనను సాధారణంగా ఒక నకిలీశాస్త్రంగా సూచిస్తారు. క్రింది వివరించిన సమాచారం ఆధునిక హస్తసాముద్రికుల ఉదాహరణగా చెప్పవచ్చు; పలు సాముద్రిక పాఠశాల్లో పలు అంశాలు మరియు అరచేతిలో లక్షణాల యొక్క పలు - తరచూ వివాదస్పద- అనువాదాలు ఉన్నాయి.

హస్త సాముద్రికo ప్రకారం, మీ చేతి మీద ఉండే కొన్ని సాధారణ గీతలు మీ ఆర్ధిక పరిస్థితిని గురించి చెప్పగలవు.

చేతి మీద ఉండే గీతల యొక్క ప్రతి ఒక్క వంపు, మూడు గీతల కూడలి అలా మిగిలిన ప్రతి చేతి గీతలు కూడా అనేక అంశాలను తెలుపగలవు. మీ చేతి మీద ఉన్న గీతలే మీ రాతను చెప్పగలవు అంటే, ఆశ్చర్యపోక మానరు.

Does The Letter V On Your Palm Signify Anything?

కొంతమందికి చేతి మీద ప్రత్యేకంగా V అనే అక్షరం ఉంటుంది, ఆ అక్షరం గురించే మేమిక్కడ చెప్పబోతున్నాము. ఇది హృదయ రేఖ మీద ఉంటుంది, దీనికoటూ ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఉంది.

ముందు మీ హృదయ రేఖను గురించి తెలుసుకోండి.

ముందు మీ హృదయ రేఖను గురించి తెలుసుకోండి.

హస్త సాముద్రికం ప్రకారం 4 ప్రధాన గీతలు మనిషి యొక్క అన్ని అంశాలను అంచనా వేయగలవు, అందులో ముఖ్యమైనది హృదయ రేఖ . ఈ హృదయ రేఖ ద్వారా మనిషి యొక్క సంబంధాలను, భావోద్వేగాలను కూడా అంచనా వేయవచ్చు. మీ గురించి ఇతర వ్యక్తులకు తెలియకపోయినా ఈ హస్త సాముద్రికo తెల్సిన వారు మిమ్ములను అంచనా వెయ్యగలరు.

ఒక వేళ ఈ హృదయ రేఖ లేకపోతే :

ఒక వేళ ఈ హృదయ రేఖ లేకపోతే :

ఈ హృదయ రేఖ లేని వారు నిర్ధయులుగా ఉంటారని చెప్పబడింది. వీరు ప్రేమ అనే పడానికే దూరంగా, కనీసం మెచ్చుకోలు కూడా ప్రదర్శించకుండా ఉండే హృదయం లేని వారిగా ఉంటారని చెప్పబడింది. మీ హృదయ రేఖను బట్టి మీ గత సంబంధాలను కూడా చెప్పవచ్చు. దయ జాలి లేని వారుగా కఠినాత్ములుగా ఉండడం వలన సంబంధాలు కూడా అంతగా బాగోవు.

ఈ హృదయ రేఖ మీద V అను అక్షరం ఉన్నవారైతే :

ఈ హృదయ రేఖ మీద V అను అక్షరం ఉన్నవారైతే :

V దీనిని సూచిస్తుంది:

ఈ V అను అక్షరం మీ పూర్తికాని వ్యాపారాన్ని లేదా మీ వ్యక్తిగత పురోగతిని సూచిస్తుంది . కానీ వీరు అదృష్టవంతులుగా, విజేతలై ఉంటారు , మరియు జీవితంలో ఎక్కువ ధనాన్ని పొందగలిగే వారుగా ఉంటారు, వీరు ఎక్కడికెళ్లినా వీరి వెన్నంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం V అని అక్షరం కలిగి ఉన్నవారిని ప్రత్యేకంగా భావిస్తారు. వీరిని దాటి అదృష్టం ఎవరికీ ఉండదు అని చెప్పబడింది.

వీరు ఆశీర్వదించబడిన వారు:

వీరు ఆశీర్వదించబడిన వారు:

వీరు అదృష్టం వరించిన వారుగా ఉంటారు. మరియు దయాగుణం కలిగిన వారిగా ఉంటారు. వీరు స్నేహితులకు లాభ నష్టాలలో తోడుగా ఉంటారు. వీరిని స్నేహితులుగా కలిగి ఉండడం కూడా అదృష్టమే. కుటుంబానికి, ప్రియమైన వారికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. తద్వారా అందరికీ ఇష్టులై ఉంటారు.

సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు.

సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు.

సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. కానీ తెలివిగా, ప్రణాళికా బద్దంగా జీవితం గడపాలన్న ఆలోచన కలవారు. నలుగురికీ ఆదర్శ ప్రాయంగా ఉంటారు. వీరు ఎందులో అడుగుపెట్టినా అందులో విజయం వరించేలా ఉంటుంది. ఆర్భాటాలకు దూరంగా, ప్రేమలకు దగ్గరగా ఉండడం వీరి నైజo. తద్వారా ఎల్లప్పుడూ వీరి చుట్టూతా ఒక సమూహం ఉంటుంది. వీరు కొందరికి ఎప్పుడూ ఒక ప్రశ్నగానే ఉంటారు. వీరికి ఉన్న పేరును చూసి ఓర్వలేని వారు శత్రువుగా కూడా భావిస్తుంటారు, కానీ వీరు మాత్రం అందరినీ తమవారిగా భావిస్తుంటారు.

 అంతే కాకుండా:

అంతే కాకుండా:

అంతే కాకుండా సమాజంలో పేరుప్రఖ్యాతలను గడిస్తారు. వీరి జీవిత ప్రారంభంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు, కానీ నెమ్మదిగా అన్నీ వీరికి అనుగుణంగా మారుతాయి. వీరు కోరుకున్న వ్యక్తితోనే జీవితాన్ని పంచుకుంటారు. ముఖ్యంగా వీరి వయసు 35దాటిన తర్వాతనే వీరికి మంచిరోజులు ప్రారంభమవుతాయని చెప్పబడినది.

వీరిని చూసి ఓర్వలేని వారు

వీరిని చూసి ఓర్వలేని వారు

వీరిని చూసి ఓర్వలేని వారు జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులను కలిగించినా, దేనికీ బెదరకుండా ముందుకు సాగే తత్వం కలవారు. స్వతహాగా ధైర్యవంతులుగా ఉంటారు. ఎటువంటి ప్రతికూల ప్రభావిత అంశాలు కూడా వీరి మార్గంలో అడ్డు కాజాలవు. సానుకూల దృక్పధంతో అడుగులు ముందుకు వేస్తుంటారు. విజేత అంటే వీరిని చూపించవచ్చు నిస్సందేహంగా.

మీకు V అక్షరం ఉందా ... అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Does The Letter 'V' On Your Palm Signify Anything?

    There are certain predictions in palmistry that help us know about the different letters on our palm. These predictions are based on the letters that are present. For example, if you have a letter V present on your heart line, it means that these people do not show any form of regret, love and appreciate anyone apart from themselves.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more