Latest Updates
-
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.!
వాట్సాప్‌లో ప్రచారం వల్ల పిల్లలను ఎత్తుకెళ్లేవారని ఐదుగురిని ఎంత దారుణంగా చంపారో చూడండి, మేల్కొండి
వాట్సాప్‌లో ప్రచారం వల్ల పిల్లలను ఎత్తుకెళ్లేవారని ఐదుగురిని ఎంత దారుణంగా చంపారో చూడండి, మేల్కొండి. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులను దారుణంగా చంపారు.
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామంలోకి అడుగుపెట్టిన ఐదుగురు వ్యక్తులను చిన్నారులను కిడ్నాప్ చేసేవారిగా అనుమానించి స్థానికులు కొట్టిచంపేశారు. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు మిగతా ప్రయాణికులతో కలిసి గిరిజన తండా రయిన్‌పడాలో దిగారు.
అదే సమయంలో అక్కడ ప్రతివారం జరిగే ఆదివారం సంత జరుగుతోంది. బస్సు దిగిన వ్యక్తులు ఓ చిన్నారితో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో... సంతకోసం వచ్చిన గ్రామస్తులు వారిని కిడ్నాపర్లుగా అనుమానించారు.

మూకుమ్మడిగా తరలివచ్చి
ఆ తర్వాత మూకుమ్మడిగా తరలివచ్చి వచ్చి కొత్త వ్యక్తులను పట్టుకుని చావబాదారు. వారి ఆగ్రహానికి ఆ ఐదుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. మృతి చెందిన వారు భరత్ శంకర్ భోసలే(45), అతని సోదరుడు దాదారావ్ శంకర్ భోసలే, రాజు భోసలే, భరత్ మాల్వే(47) సోలాపూర్ దగ్గర్లోని ఖావే గ్రామానికి చెందిన వారు.

చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇంత ముందుకు వ్యాప్తి చెందినట్లుగానే గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నట్టు పుకార్లు వ్యాపించాయి.ధులే జిల్లాలోని గిరిజన ప్రాబల్యం గల గ్రామం రేయిన్‌పాడా గ్రామం. ధులే నుంచి 80 కిలోమీటర్ల దూరంలో సకారీ మండలంలో ఉంది ఈ రాయినపాఢా గ్రామం.

రెయిన్‌పడ సర్పంచ్ కార్యాలయంలో
రెయిన్‌పడ సర్పంచ్ కార్యాలయంలో ఈ ఉదంతం జరిగింది. అందుకే ఆ గది లోపలంతా రక్తపు మరకలున్నాయి. అందులో ఐదుగురు అమాయకులు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. కాళ్లు, చేతులతోనే ఆ ఐదుగురిని కుళ్ల పొడవడంతో వారి నుంచి రక్తం ఎక్కువ కారినట్టులేదు. ముందస్తు ప్రణాళికతో కొంత మంది కర్రలతో వచ్చి కొట్టడంతో బాధితుల నుంచి కొంత రక్తం చిందింది.

మృతులంతా షోలాపూర్‌లోని ఖేవా గ్రామస్తులు
మృతులంతా షోలాపూర్‌లోని ఖేవా గ్రామానికి చెందిన వారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. గోసవి తెగవారి ప్రధాన వత్తి భిక్షాటన. వీరు ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు వెళుతుంటారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో డేరాలు వేసుకొని ఉంటారు. ఊరూరు, ఇల్లిళ్లు తిరుగుతూ అడుక్కుతింటారు. తమ ప్రాంతానికి కొంత వారవడంతో పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారన్న అనుమానంతో రెయిన్‌పడ గ్రామస్థులు ఓ ఐదుగురిని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొట్టి చంపారు.

వాట్సాప్‌లో జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగా
వారిని ఆపేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అత్యవసర పరిస్థితుల్లో చేసే ‘ఎస్‌ఓఎస్' ఫోన్ కాల్ ద్వారా సమీపంలోనే ఉన్న పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా వారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. వాట్సాప్‌లో జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగానే ఈ దారుణం కూడా జరిగింది. ‘మీ పరిసర ప్రాంతాల్లో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు దిగాయి. వారు పిల్లలను ఎత్తుకుపోయి కిడ్నీలను, ఇతర అవయవాలను తీసుకొని అమ్ముకుంటారు' అన్న వాట్సాప్ సందేశాలు ఆ గ్రామంలో చక్కర్లు కొట్టాయి.

వాట్సాప్ సందేశాలను గుడ్డిగా నమ్మి
ఈ వాట్సాప్ సందేశాలను ప్రజలు గుడ్డిగా నమ్మి అనుమానాస్పదులపై దాడులు చేయడంతో అమాయకులు అన్యాయంగా మరణించారు. " నా కొడుకును వారంత గుడ్డిగా ఎలా చంపేస్తారు? చంపేముందైనా ఒక్కసారి ఆలోచించి ఉండవచ్చుగదా!"అని చనిపోయిన వ్యక్తి తల్లి రోదించింది.

ఒక్క అధికారి ఇక్కడికి రాలేదు
"ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఒక్క అధికారి ఇక్కడికి రాలేదు. మాకు న్యాయం కావాలి. చనిపోయిన వారికి నష్టపరిహారం అందించాలి. రేయిన్‌పాడా సర్పంచ్‌పై కేసు పెట్టాం. మాకు న్యాయం జరిగే వరకు వాళ్ల మృతదేహాలను మాకు అప్పగించకండి. కిల్లర్స్‌పై పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకోవాలి.." అని దాడిలో చనిపోయిన దాదారావ్ శంకర్ భోసలే కొడుకు సంతోశ్ భోసలే డిమాండ్ చేశాడు.

ఓ చిన్నారితో మాట్లాడుతుండగా
మొదట వారు ఐదుగురు సంత జరిగే ప్రదేశానికి వచ్చారు. భిక్షం అడుగుతున్నారు. అందులో ఓ యువకుడు ఓ చిన్నారితో మాట్లాడుతున్నట్లు గ్రామస్తులకు కనిపించింది. దూరం నుంచి చూసిన స్థానిక ప్రజలు వారిని కిడ్నాపర్లుగా భావించారు. ఒకరినొకరు పిలుచుకుంటూ వారి వద్దకు రుగెత్తికెళ్లారు. వారు ఏమి చెబుతున్నారో వినిపించుకోకుండానే ఎవర్రా మీరు? అంటూ చితకబాదడం మొదలు పెట్టారు. వారు తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంటబడి కొట్టారు. ఇద్దరు యువకులు వారిని వారించబోయినా ఊరుకోలేదు.

పంచాయితీ కార్యాలయంలో దూరారు
ఆ ఇద్దరు యువకులు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పింపల్నర్ పోలీసు స్టేషన్‌కు ‘ఎస్‌ఓఎస్ (సేవ్ అవర్ షిప్ లేదా సేవ్ అవర్ సోల్స్) కాల్' చేశారు. అలా పరుగెత్తిన ఐదుగురు యువకులు సమీపంలోకి పంచాయితీ కార్యాలయంలో దూరారు. వారిని రక్షించడం కోసం ఇద్దరు యువకులు గొళ్లం పెట్టారు. కానీ గ్రామస్తులు తలుపులు పగులకొట్టుకొని లోపలికి వెళ్లి దాడి చేశారు. పోలీసులు ఆలస్యంగా వచ్చారు. అంతలో గ్రామస్తులు ఆ ఐదుగురిని చంపేశారు. కొంత మంది యువకులు కర్రలు పట్టుకొని వచ్చి కొట్టారు.

35 మందిపై కేసు నమోదు
పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేసి వారిలో 23 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురించి తెలిసి బాధితుల తరఫున ఖేవా సర్పంచ్ రెయిన్‌పడ వచ్చారు. బాధితులను తీసుకెళ్లి ధూలే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్ల పట్టాలివ్వాలని వారు కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.
కలెక్టర్ జోక్యంతో చివరకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారానికి బాధితులు అంగీకరించారు. ఇలాంటి దారుణాలు వరుసగా జరుగుతున్నా ఈ వాట్సాప్ వదంతులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా చదువుకున్న యువత వీటిపైన గ్రామాల్లో అవగాహన కల్పించి అమాయకుల ప్రాణాలు పోకుండా చూడాల్సిన అవసరం ఉంది.



Click it and Unblock the Notifications