Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనందరి నోట తరచుగా వినిపించే మాట.. నాకు సమయం లేదు. ఆఫీసులో గంటల తరబడి కంప్యూటర్ ముందు పని, ఇంటి బాధ్యతలు, టార్గెట్లు, ఎడతెగని మొబైల్ వాడకం..వీటన్నింటి మధ్య మన శారీరక, మానసిక ఆరోగ్యాలకు సమయం కేటాయించడం ఒక పెద్ద సవాలుగా మారిపోయింది.

శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఒత్తిడి, అలసట, వెన్నునొప్పి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఫిట్ గా ఉండాలంటే రోజూ గంటల తరబడి జిమ్ లో చెమటోడ్చాలనే భయం చాలా మందిని వెనక్కి లాగుతోంది. కానీ ఆరోగ్యంగా ఉండటానికి గంటల కొద్దీ కష్టపడాల్సిన అవసరం లేదు. యోగా.. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక అద్భుతమైన వరం.
అందుకే ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ దీని ప్రాముఖ్యతను చాటిచెబుతున్నారు. మీ బిజీ దినచర్యలో కేవలం 10 నుండి 15 నిమిషాలు కేటాయిస్తే చాలు అద్భుతమైన ప్రయోజనాలను అందించే 5 బెస్ట్ యోగాసనాల గురించి ఇక్కడ చూడండి.
సూర్య నమస్కారాలు (సంపూర్ణ వ్యాయామం)
సమయం అస్సలు లేనివారికి సూర్య నమస్కారం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది 12 విభిన్న ఆసనాల కలయిక. రోజూ ఉదయం కేవలం 5 నిమిషాల పాటు దీనిని సాధన చేయడం వల్ల శరీరంలోని ప్రతి కండరం ఉత్తేజితం అవుతుంది. క్యాలరీలు వేగంగా కరిగి బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా, చురుకుగా పనిచేయడానికి అవసరమైన శక్తిని ఇది అందిస్తుంది.
వృక్షాసనం (ఏకాగ్రతకు కేరాఫ్ అడ్రస్)
రోజులో ఎక్కువ భాగం కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్లకే అతుక్కుపోవడం వల్ల మెదడు త్వరగా అలిసిపోతుంది. వృక్షాసనం (చెట్టు భంగిమ) మన శారీరక సమతుల్యతను మెరుగుపరచడమే కాకుండా, ఏకాగ్రతను తిరిగి తీసుకువస్తుంది. రోజుకు రెండు నిమిషాలు ఈ ఆసనం వేస్తే మానసిక ప్రశాంతతతో పాటు పనులపై ఫోకస్ అద్భుతంగా పెరుగుతుంది.
భుజంగాసనం (వెన్నునొప్పికి చెక్)
కదలకుండా కుర్చీల్లో కూర్చుని పనిచేసే వారు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య నడుము, వీపు నొప్పి. పాము పడగ ఎత్తినట్లుగా ఉండే భుజంగాసనం వెన్నెముకను బలోపేతం చేస్తుంది. వెన్నుపూసకు మంచి ఫ్లెక్సిబిలిటీని ఇచ్చి నొప్పులను దూరం చేస్తుంది. అంతేకాకుండా, ఛాతీ భాగాన్ని సాగదీసి ఒత్తిడిని తగ్గించడంలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది.

వజ్రాసనం (జీర్ణక్రియకు దివ్యౌషధం)
సాధారణంగా యోగాసనాలను ఖాళీ కడుపుతో చేయాలి. కానీ భోజనం చేసిన వెంటనే చేయగలిగే ఏకైక ఆసనం వజ్రాసనం. తిన్న తర్వాత 5 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. ఆహారం వేగంగా జీర్ణం కావడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. దీనిని ఎవరైనా సులభంగా వేయవచ్చు.
అనులోమ్-విలోమ్ (ఒత్తిడి మాయం)
మీకు ఎలాంటి శారీరక కదలికలు చేయడానికి సమయం లేనప్పుడు, కనీసం ఒక 5 నిమిషాలు కళ్లు మూసుకుని ఈ ప్రాణాయామం చేయండి. నాడీ శోధన ప్రాణాయామంగా పిలువబడే అనులోమ్-విలోమ్ శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది.
సమయం లేదు అనేది మనకు మనమే చెప్పుకునే ఒక సాకు మాత్రమే. 24 గంటల సమయంలో మన ఆరోగ్యం కోసం కేవలం 15 నిమిషాలు కేటాయించడం కష్టమేమీ కాదు. ఈ ఐదు సులభమైన యోగాసనాలను మీ రోజువారీ దినచర్యలో భాగం చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో, మనసులో వచ్చే సానుకూల మార్పులను, ఉత్సాహాన్ని మీరే గమనిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications