Latest Updates
-
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.!
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా..
బీహార్ సాంప్రదాయ స్వీట్ థేకువా (Thekua) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా దేశ స్పీకర్ రిచర్డ్ రసికు ఈ ప్రసిద్ధ బీహారీ వంటకాన్ని బహుమతిగా ఇవ్వడంతో దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఛత్ పూజ పండుగతో దీనికి విడదీయరాని బంధం ఉంది. ప్రసాదంగా సమర్పించే ఈ థేకువా రుచికి, తయారీలోని సరళతకు ఎంతో పేరుగాంచింది.

థేకువా కేవలం పండుగ ప్రసాదం మాత్రమే కాదు, ఎంతో ఆరోగ్యకరమైన, పోషకభరితమైన స్నాక్. తక్కువ పదార్థాలతో తయారయ్యే ఈ తీపి వంటకం గాలి చొరబడని డబ్బాలో పెడితే నెల రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. థేకువాని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో, అందులోని పోషకాలు, ప్రయోజనాల గురించి ఇక్కడ చూడండి.
థేకువా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
బెల్లం లేదా చక్కెర: 1 కప్పు
నెయ్యి: అర కప్పు పిండిలో కలపడానికి
యాలకుల పొడి: 1 టీస్పూన్
వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు లేదా తురుము: 2 టేబుల్ స్పూన్లు
సోంపు గింజలు: 1 టేబుల్ స్పూన్
నీళ్లు: పిండి కలపడానికి
నెయ్యి లేదా నూనె: డీప్ ఫ్రై చేయడానికి
థేకువా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో బెల్లాన్ని వేసి కరిగించాలి. పాకం రానవసరం లేదు.
-ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, యాలకుల పొడి, సోంపు గింజలు, ఎండు కొబ్బరి వేసి చేత్తో బాగా కలపాలి. నెయ్యి పిండికి బాగా పట్టాలి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా పూరీ పిండిలా ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు.
-ఆ పిండి నుండి చిన్న చిన్న ముద్దలను తీసుకుని గుండ్రంగా చేసి అరచేతితో తేలికగా నొక్కాలి. సాంప్రదాయకంగా దీనిపై అందమైన ఆకృతులు రావడానికి చెక్కతో చేసిన ప్రత్యేకమైన అచ్చులను ఉపయోగిస్తారు. అచ్చు లేకపోతే స్పూన్ లేదా ఫోర్క్ తో డిజైన్లు వేసుకోవచ్చు.
-స్టవ్ మీద బాండీ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. మంటను మీడియంలో ఉంచి థేకువాలను వేసి రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు నెమ్మదిగా వేయించాలి.
-వేయించిన వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇవి కరకరలాడుతూ తయారవుతాయి.

పోషక విలువలు (సుమారుగా ఒక థేకువాలో)
క్యాలరీలు: 120 - 150 kcal
కార్బోహైడ్రేట్లు: 15 - 20 గ్రాములు
ప్రొటీన్లు: 2 గ్రాములు
కొవ్వులు: 5 - 7 గ్రాములు
ఫైబర్: 1 - 2 గ్రాములు
ఐరన్,కాల్షియం: బెల్లం వాడటం వల్ల తగిన మోతాదులో లభిస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
తక్షణ శక్తినిస్తుంది: ఇందులో వాడే గోధుమ పిండి, బెల్లం శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లను అందించి తక్షణ శక్తిని ఇస్తాయి. ప్రయాణ సమయాల్లో ఇది అద్భుతమైన స్నాక్.
జీర్ణక్రియకు మేలు: థేకువాలో ఉపయోగించే సోంపు గింజలు, యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి.
రక్తహీనత నివారణ: చక్కెర బదులు బెల్లం వాడటం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను నివారిస్తుంది.
రోగనిరోధక శక్తి: నెయ్యి, బెల్లం కలయిక శరీరంలో ఉష్ణాన్ని పుట్టించి, ముఖ్యంగా చలికాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి.
ఎముకల బలం: ఇందులో వాడే స్వచ్ఛమైన నెయ్యి ద్వారా శరీరానికి మంచి కొవ్వులు, విటమిన్లు అందుతాయి. ఇవి ఎముకల దృఢత్వానికి, కీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications