పెళ్లయితేనేం: పెళ్లయిన ఆమెకు లిప్ టు లిప్ కిస్ పెట్టిన ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె

Subscribe to Boldsky

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె నిర్ణ యాలు ఎంత కఠినంగా ఉంటాయన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఫిలిప్పీన్స్‌ లో పేరుకు పోయిన డ్రగ్‌ మాఫియాను అరి కట్టేందుకు ఆయన గతంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుని అంతర్జాతీయం వార్తల్లో నిలిచారు.

నిరంకుశ అధ్యక్షుడు

ఫిలిప్పీన్స్‌కు ఈయన నిరంకుశ అధ్యక్షుడు అంటుంటారు. అందుకే రొడ్రిగో డ్యుటెర్టెపై రోజుకో విమర్శ వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ మహిళకు కొన్ని వేల మంది సమక్షంలో బహిరంగంగా లిప్ టు లిప్ కిస్ ఇప్పించుకున్నాడు.

పెద్దాలపై పెదాలుంచి

పెద్దాలపై పెదాలుంచి

పెద్దాలపై పెదాలుంచి ఆయన ఆమెను ముద్దడాడు. రొడ్రిగో చేసిన ఈ పని ఇప్పుడు అంతటా వైరల్ అయిపోయింది. ఇక ఈ సీన్ డైరెక్ట్ గా చూసిన వారంతా షాక్ అయ్యారు. తాజాగా రొడ్రిగో డ్యుటెర్టెపై దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించారు.

ఫిలిపైనో మహిళ

ఫిలిపైనో మహిళ

సియోల్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్'కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతను స్టేజిపైకి పిలిచారు ఆయన. అందులో ఓ ఫిలిపైనో మహిళ కూడా వేదిక మీదకు వచ్చింది.

పెదవులపై ముద్దు

పెదవులపై ముద్దు

తర్వాత ఆమెకు ఓ పుస్తకాన్ని బహుకరించాడు.అంతటితో ఆగలేదు రొడ్రిగో డ్యుటెర్టె.. అనంతరం తన పెదవులపై ముద్దు పెట్టాల్సిందిగా పలుమార్లు కోరారు. దీంతో తొలుత షాక్ తింది ఆ మహిళ.

వేలిని పెదవులపై ఉంచి

వేలిని పెదవులపై ఉంచి

తర్వాత నవ్వాపుకోలేకుండా నవ్వింది. పడీపడీ నవ్వారు. అయినప్పటికీ అధ్యక్షుడు వదిలిపెట్టలేదు. పెదవులపై ముద్దు పెట్టాలని వేలిని పెదవులపై ఉంచి పలుమార్లు కోరారు. పెట్టు పెట్టు ముద్దు పెట్టు అంటూ పెదాలను చూపిస్తూ ఆమెకు మరీ దగ్గరగా వెళ్లాడు.

నాకు పెళ్లి అయ్యింది

నాకు పెళ్లి అయ్యింది

రొడ్రిగో డ్యుటెర్టె. తర్వాత ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఓ మిస్ మీరు ఒంటరినా? లేక పెళ్లయ్యిందా అని అన్నాడు... పుస్తకం బదులు నా పెదాలను ముద్దాడండి అని రొడ్రిగో అడిగాడు.. లేదండి నాకు పెళ్లి అయ్యిందని ఆమె బదులిచ్చినా రొడ్రిగో డ్యుటెర్టె మాత్రం వినలేదు.

పెళ్లి అయితేనేం

పెళ్లి అయితేనేం

పెళ్లి అయితేనేం.. ముద్దు పెట్టాల్సిందంటూ ఆమెను రొడ్రిగో డ్యుటెర్టెపై ప్రాధేయపడ్డాడు. ఇక అంత మంది ఎదుట రొడ్రిగో డ్యుటెర్టె అలా అడగడంతో ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించింది.

మొహమాట పడుతూనే

మొహమాట పడుతూనే

తర్వాత మొహమాట పడుతూనే ఆమె రొడ్రిగో డ్యుటెర్టె పెదాలను చుంబించింది. మొత్తానికి మరోమార్గం లేని ఆమె ముద్దు పెట్టి అధ్యక్షుడి కోరిక తీర్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ టీవీ చానెల్ లైవ్ ప్రసారం చేయడంతో అధ్యక్షుడి కిస్ వైరల్ అయింది.

ఇదంతా సరదా కోసం

ఇదంతా సరదా కోసం

ఇక అక్కడున్న జనమంతా వాళ్లద్దరినే చూస్తూ ఉండిపోయారు. కాసేపు అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే ఆ వెంటనే రొడ్రిగో డ్యుటెర్టె ఈ ముద్దు సీన్ గురించి వివరించారు. హలో ఇదంతా సరదా కోసం చేశాను అని రొడ్రిగో డ్యుటెర్టె అన్నాడు.

అసభ్యంగా ప్రవర్తించారు

అసభ్యంగా ప్రవర్తించారు

ఈ ముద్దు సీన్ ను ఎవరూ సీరియస్‌గా తీసుకోకండంటూ అక్కడున్న వారిని రొడ్రిగో డ్యుటెర్టె కోరాడు. ఇక 73 ఏళ్ల రొడ్రిగో డ్యుటెర్టె గతంలో కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. పబ్లిక్ లోనే మహిళలపై కామెంట్స్ చేసి... హేయ్ జస్ట్ ఫన్నీ అని రొడ్రిగో డ్యుటెర్టె చెప్పేవాడు.

విమర్శలు గుప్పిస్తున్నారు

విమర్శలు గుప్పిస్తున్నారు

అయితే సియోల్‌లో మాత్రం తాను కార్యక్రమానికి హాజరైన ప్రజలను వినోదపరిచేందుకు అలా చేశానని రొడ్రిగో డ్యుటెర్టె చెప్పుకొచ్చాడు. అయినా రొడ్రిగో డ్యుటెర్టెపై ఫిలిప్పీన్స్‌లోని మహిళా సంఘాల నాయకులు, రాజకీయ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

చెంపపై పెట్టాల్సింది

చెంపపై పెట్టాల్సింది

నీ సరదా కోసం ఓ మహిళను ఇబ్బంది పెట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. మరికొందరు ‘అది తప్పు అని, అంతలా అయితే చెంపపై పెట్టాల్సింది' అని అంటున్నారు. విమర్శలు తారాస్థాయికి చేరటంతో మనీలాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఆ మహిళను ఇంటర్వ్యూ చేశాయి.

నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు

నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు

ఇది చాలా చిన్న వ్యవహారమని, తనకు, తన భర్తకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు వస్తుందో తెలీటం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరికొందరు రొడ్రిగోకు మద్ధతుగా ట్వీట్లు చేస్తుండగా, ఇంకొందరు మాత్రం మహిళ స్థానంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ను అంటించి(మార్ఫింగ్‌) సరదా కామెంట్లతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నారు.

డ్రగ్స్‌ ఆరోపణలపై

డ్రగ్స్‌ ఆరోపణలపై

అయితే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఫిలిప్పీన్స్‌ డ్యుటెర్టె కుమారుడు పాలో డ్యుటర్టెపై వచ్చిన డ్రగ్స్‌ ఆరోపణలపై కూడా ఆయన గతంలో తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్‌ అక్రమరవాణాకు పాల్పడ్డాడని నిరూపితమైతే తన కుమారుడినైనా కాల్చిపారేయాల్సిం దేనంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాల్చిపారేయమని ఆదేశిస్తాను

కాల్చిపారేయమని ఆదేశిస్తాను

చైనా డీలర్లతో కలిసి పాలో డ్యుటర్టె దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణాచేస్తున్నారన్న ఆరోపణలపై అధ్యక్షుడు రొడ్రిగో అప్పట్లో అలా స్పందించారు. 'డ్రగ్స్‌ మాఫియాలో మా కుటుంబానికి సంబంధమే లేదు. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకుంటాను. నా కుమారుడు పాలో డ్రగ్స్‌ రాకెట్‌లో భాగస్వామి అని నిరూపించినట్టయితే అతడ్ని కాల్చిపారేయమని ఆదేశిస్తాను. పాలోను చంపిన వారికి రక్షణ కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ అప్పట్లో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె సంచలన వ్యాఖ్యలు చేశారు.

లగ్జరీ కార్లను నుజ్జునుజ్జు చేయించారు

లగ్జరీ కార్లను నుజ్జునుజ్జు చేయించారు

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏవేవో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక గతంలో దాదాపు రెండు డజన్ల లగ్జరీ కార్లను ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె నుజ్జునుజ్జు చేయించారు. పన్ను ఎగవేసి కొన్న లగ్జరీ కార్లను

బుల్‌డోజర్లతో తొక్కించారు.

డ్యుటెర్టె అలా చేశారు

డ్యుటెర్టె అలా చేశారు

సాధారణంగా ఇలా పన్ను ఎగవేసి దేశంలో నడుపుతున్న కార్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక వేలంలో అమ్ముతుంది. వచ్చిన మొత్తాన్ని ఎగవేసిన సొమ్ముకింద జమ చేసుకుంటుంది. అయితే అందుకు భిన్నంగా అధ్యక్షుడు డ్యుటెర్టె అలా చేశారు.

16ఏళ్లు ఉన్నప్పుడే హత్య

16ఏళ్లు ఉన్నప్పుడే హత్య

ఇలా ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె ఏదీ చేసిన ఒక సంచలనమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె గురించి చాలా విషయాలున్నాయి. ఇక 16ఏళ్లు ఉన్నప్పుడే హత్య చేశానని గతంలో రొడ్రిగో వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇప్పుడు మాత్రం లిప్ టు లిప్ కిస్ ఇప్పించుకుని మళ్లీ వైరల్ అయ్యాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    philippine president rodrigo duterte kissed a married woman on the lips

    philippine president rodrigo duterte kissed a married woman on the lips
    Story first published: Tuesday, June 5, 2018, 15:00 [IST]
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more