వీరప్పన్ డిమాండ్లకు ప్రభుత్వమిచ్చిన స్పందనలు ఇవే ..

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

కూసే మునుస్వామి వీరప్ప గౌండర్ అలియాస్ వీరప్పన్ (52), పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది చాలా మందికి. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో రారాజుగా సత్యమంగళం అడవులలో పోలీసులకు, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్ ఎందరికో ఆరాధ్య దేవునిగా కూడా ఉన్నాడంటే నమ్మగలమా ! . వీరప్పన్ భార్య పేరు ముత్తులక్ష్మి. వీరప్పన్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

2000 లో జరిగిన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కిడ్నాప్ తో దేశంలోనే ప్రకంపనలు పుట్టించిన వీరప్పన్ కోరిన డిమాండ్లు ప్రజలను, ప్రభుత్వాలను ఆశ్చర్యచకితుల్ని చేశాయి. 2002 లో కర్నాటక మాజీ మంత్రి నాగప్పను కూడా చామరాజనగర్లోని తన ఇంటిలోనే కిడ్నాప్ చేసినా, పోలీసుల ఎన్కౌంటర్ ఫెయిల్ అయిన దృష్ట్యా, ఎన్కౌంటర్ జరిగిన 3 రోజులకు నాగప్ప మృతదేహం పోలీసులకు దొరికింది.

Veerappans 10 Demands and Governments Response! ,

కర్నాటక గవర్నమెంట్ వీరప్పన్ ను సజీవంగా అయినా నిర్జీవంగా అయినా పట్టిచ్చిన వారికి లేదా వీరప్పన్ ను పట్టించడంలో సహాయం చేసిన వారికి 50 కోట్ల నజరానాను కూడా ప్రకటించింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు.

కొందరికి చెడు, మంచిగా కనిపిస్తే, కొందరికి మంచి, చెడుగా కనిపిస్తుంది. కొందరు చెడు చేసినా, అది మంచికే అన్న భావనలో ఉంటారు. వీరప్పన్ జీవితం కూడా అనేకమందికి అలా ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది.

ఈ వ్యాసంలో వీరప్పన్ మరణించే వరకు ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్లు మరియు తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాల స్పందనల గురించిన వివరణ ఇవ్వబడినది.

ఒకటవ డిమాండ్:

ఒకటవ డిమాండ్:

కావేరీ జలాల సమస్యకు శాశ్వత పరిష్కారం దృష్ట్యా ప్రజలందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ తక్షణ చర్యలలో భాగంగా 205 టి.ఎం.సి ల జలాలను విడుదల చేయాలి. భవిష్యత్తులో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా చూసుకోవలసిన భాద్యతను ప్రభుత్వాలు స్వచ్చందంగా తీసుకోవాలి.

స్పందన :

ప్రధాన మంత్రి చైర్మన్ గా వ్యవహరిoచేలా కావేరి నది అథారిటీ, తాత్కాలిక ఉత్తర్వులను అమలు చేయడానికి ఏర్పాటు చేయబడింది. అథారిటీ ఎటువంటి సమస్యల గురించైనా నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది. ట్రిబ్యునల్ తుది తీర్పు త్వరలో వస్తుంది.

రెండవ డిమాండ్ :

రెండవ డిమాండ్ :

1991 కావేరి అల్లర్లలో తమిళ బాధితులకు తగినంత మరియు సమర్థనీయ పరిహారాన్ని చెల్లించాలి. అలాగే, తమిళుల జీవితాలను, ఆస్తులను కర్నాటక కాపాడాలి.

స్పందన:

కర్ణాటక ప్రభుత్వాన్ని మే 1999 లో కావేరి రియాట్స్ రిలీఫ్ అథారిటీని ఏర్పాటు చేయవలసినదిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. తమిళనాడు నుంచి వలస వచ్చిన 2,000 మందితో సహా అథారిటీకి సుమారు 10,000 దావాలు వచ్చాయి. మే 31, 2001 వరకు సుప్రీం కోర్టు ఆమోదంతో దాని పని కోసం గడువు పొడిగించబడింది.

మూడవ డిమాండ్:

మూడవ డిమాండ్:

కర్ణాటకలో తమిళాన్ని అధికార పరిపాలనా భాషగా ప్రకటించబడాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం లో తమిళులు రెండవ అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్నారు.

స్పందన:

కేంద్రం ఆదేశించిన ప్రకారం, కర్ణాటకలో మే 1999 లో భాషా మైనారిటీ జనాభాలో 15 శాతంగా ఉన్న ప్రాంతాల్లో, ప్రభుత్వం నోటీసులు కూడా మైనారిటీ భాషలోనే ఉండాలి.

నాల్గవ డిమాండ్:

నాల్గవ డిమాండ్:

కర్ణాటకలో వెంటనే బెంగుళూరులో తిరువల్లువార్ విగ్రహం ఏర్పాటు చేయాలి.

స్పందన :

తమిళనాడులోని చెన్నై, మరియు కర్ణాటక లోని బెంగుళూరులలో వరుసగా తిరువల్లువార్, సర్వజ్ఞ విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి.

అయిదవ డిమాండ్:

అయిదవ డిమాండ్:

సదాశివ కమీషన్, టాస్క్ఫోర్స్ దురాగతాల దృష్ట్యా, కర్నాటక హైకోర్టు విధించిన స్టే ఆర్డర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి. కమిషన్ నివేదికను ప్రజలకు అందజేయాలి. అత్యాచారానికి గురికాబడిన వారికి కర్నాటక ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ప్రభావితం కాబడిన ఇతరులకు ఐదు లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలి. నేరం చేసిన పోలీసు అధికారులను శిక్షించాలి.

స్పందన :

కర్ణాటక ప్రభుత్వం విధించిన స్టే ను వెనక్కి తీసుకుంది. టాస్క్ఫోర్స్ ద్వారా వేధింపులకు గురికాబడిన గ్రామస్తులు మరియు గిరిజనుల ఫిర్యాదులపై ఎన్.హెచ్.ఆర్.సి , జూన్ 1999 లో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మిస్టర్. సదాశివ నేతృత్వంలోని ఈ కమిటీ కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి మిస్టర్.సివి. నరసింహన్, మాజీ సిబిఐ డైరెక్టర్ లతో కలిసి మూడు సభలు నిర్వహించారు. కర్నాటక ప్రభుత్వం ఎన్.హెచ్.ఆర్.సి యొక్క తుది సిఫార్సును కట్టుబడి ఉంటుంది.

ఆరవ డిమాండ్:

ఆరవ డిమాండ్:

కర్నాటక జైళ్లలో అమాయకులైన నేరస్థులను విడుదల చేయాలి.

స్పందన:

టాడా ఆరోపణలను వెనక్కి తీసుకున్న వెంటనే, ఈ ఖైదీలు విడుదల చేయబడుతారు.

ఏడవ డిమాండ్:

ఏడవ డిమాండ్:

చనిపోయిన తొమ్మిది మంది ఎస్సి / ఎస్టీల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలి (కర్నాటకలో).

స్పందన :

పరిహారం అనుకూలంగా పరిగణించబడుతుందని తెలుపబడినది.

ఎనిమిదవ డిమాండ్ :

ఎనిమిదవ డిమాండ్ :

తక్షణ సహాయం కింద నీలగిరిలోని రైతులకు, తేయాకు కనీస సేకరణ ధర 15రూ చేయాలి.

స్పందన :

తమిళనాడు కేంద్రం తేయాకు సేకరణ ధరని పెంచేందుకు చర్యలు తీసుకున్నాయి. సుమారు రూ. 4.50 నుండి రూ. 9.50 దాకా పెంచాయి.

తొమ్మిదవ డిమాండ్ :

తొమ్మిదవ డిమాండ్ :

ప్రస్తుతం తమిళనాడు జైళ్లలో ఉన్న ఐదుగురు వ్యక్తులను విడుదల చేయాలి.

స్పందన :

పరిహారం అనుకూలంగా పరిగణించబడుతుందని తెలుపబడినది.

పదవ డిమాండ్ :

పదవ డిమాండ్ :

తమిళనాడులోని మంజోలై ఎస్టేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించి, తమిళనాడు మరియు కర్నాటకలో కాఫీ మరియు టీ ఎస్టేట్ కార్మికుల కోసం కనీస వేతనాలను రోజుకు రూ.150 రూపాయలను చేయాలి.

స్పందన :

తమిళనాడు లోని ఎస్టేట్ కార్మికులు కనీస వేతనం రోజుకు రూ. 74.62. గృహ మరియు వైద్య సౌకర్యాలు మరియు సంక్షేమ చర్యలు తీసుకోవాల్సిన ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటే, వేతనాలు రోజుకు రూ. 139.

కేరళ మరియు పశ్చిమ బెంగాల్ కంటే వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనాలు మరింత పెరుగుదల మాత్రం చర్చల ద్వారా పరిష్కారం కాలేదు.

English summary

Veerappan's 10 Demands and Governments Response!

Veerappan's 10 Demands and Governments Response! ,
Story first published: Wednesday, May 9, 2018, 19:00 [IST]