వీరే ది వెడ్డింగ్‌లో స్వర భాస్కర్ స్వయంతృప్తి పొందే సీన్ పై దుమ్ము దుమారం, మాస్టర్బేషన్ అంటే తెలుసా?

వీరే ది వెడ్డింగ్‌ సినిమాలో స్వర భాస్కర్‌కు మద్ధతుగా కూడా కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అసలు మాస్టర్బేషన్ (స్వయంతృప్తి) అంటే తెలుసా మీకు? వీరే ది వెడ్డింగ్‌ , మాస్టర్బేషన్, స్వయంతృప్తి.

లేడీ ఓరియెంటెడ్ కామెడీ హిందీ చిత్రం వీరే ది వెడ్డింగ్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు శ‌శాంక ఘోష్‌. క‌రీనా క‌పూర్‌, సోన‌మ్ క‌పూర్‌, స్వ‌ర‌భాస్క‌ర్‌, సుమిత్ వ్యాస్‌, వివేక్ ముషార‌న్ న‌టించారు. ఈ సోన‌మ్‌, క‌రీనా, స్వ‌ర‌భాస్క‌ర్‌, సుమిత్‌వ్యాస్ ఈ మూవీలో చాలా బాగా నటించారు.

అవన్నీ బోల్డ్‌గా చూపించారు

అవన్నీ బోల్డ్‌గా చూపించారు

కలింది పూరీ(కరీనా), అవ్నీ(సోనమ్‌), సాక్షి(స్వరభాస్కర్‌), మీరా(శిఖా) పాత్రలు మూవీలో బాగుంటాయి. అందరూ ఆయా పాత్రలకు న్యాయం చేశారు. వీరంతా బాల్య స్నేహితురాళ్లు. పదేళ్ల తర్వాత కలింది వివాహంలో అందరూ కలుస్తారు. వేడుకలో తమ జీవితాల్లోని సరదా విషయాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తారు. అలాగే వీరంతా వారి వ్యక్తిగత విషయాలను మాట్లాడుకుంటారు. అవన్నీ బోల్డ్‌గా చూపించారు.

ఫ్రెండ్స్ తో కలిసి

ఫ్రెండ్స్ తో కలిసి

అసలు ఓ అమ్మాయి నుంచి సమాజం ఏం ఆశిస్తోంది? వారికి ఎలాంటి ఆంక్షలు పెడుతోంది? కుటుంబ గౌరవం, పెళ్లి, సమాజంలో పరువు ప్రతిష్ఠలు లాంటి చట్రాల్లో చిక్కుకుని స్త్రీల ఆత్మాభిమానం ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతోంది? వంటి విషయాలను చర్చించేలా ఈ చిత్రం ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు.

స్వర భాస్కర్‌ బాగా వైరల్

ఇక అదంతా సినిమాకు సంబంధించిన విషయం అయితే ఇందులో నటించి నలుగురు భామలు అందాల ఆరబోతలో రెచ్చిపోయారు. ఇక పొట్టి డ్రెస్సులు ధరించిన విషయంలో ఇటీవల కరీనా కపూర్ ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. అలాగే వీరే ది వెడ్డింగ్‌లో నటించిన స్వర భాస్కర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. వీరే ది వెడ్డింగ్‌ చిత్రంలో ఆమె ఓ సంచలన సన్నివేశంలో నటించడమే అందుకు కారణం. ఈ సన్నివేశంపై సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ట్రోల్ చేస్తున్నారు

ఈ సన్నివేశాలన్ని నెటిజన్స్ మొత్తం ట్రోల్ చేస్తున్నారు.

చాలా మంది వీరే ది తమ ఇంట్లోని ఆడవాళ్లతో వెడ్డింగ్‌ మూవీకి వెళ్లామని కానీ మూవీలో ఆ సీన్ రాగానే ఏం చెయ్యాలో అర్థంకాక థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశామంటూ ట్వీట్లు చేశారు.

మాస్టర్బెషన్ సీన్ వచ్చినప్పుడు

"నేను నా

గ్రాండ్ మదర్‌తో వీరే ది వెడ్డింగ్ సినిమాకు వెళ్ళా.. స్వర భాస్కర్ మాస్టర్బెషన్ సీన్ వచ్చినప్పుడు

చూడలేక థియేటర్ నుంచి వచ్చేశాను. " అంటూ ఒక యువతి ట్వీట్ చేసింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్వీట్ చేశారు.

డబ్బులు తీసుకుని ఉంటారు

ఇక ట్రోలింగ్‌పై స్వర భాస్కర్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తున్నారు. కొందమంది డబ్బులు ఇచ్చిమరీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నాంటూ స్వర భాస్కర్ మండిపడుతున్నారు. వాళ్ళు సినిమా చూడడానికి, ఇలాంటి ట్వీట్స్ పెట్టడానికి డబ్బులు తీసుకుని ఉంటారంది.

స్వయంతృప్తి అంటే తెలుసా?

ఇక స్వర భాస్కర్‌కు మద్ధతుగా కూడా కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అసలు మాస్టర్బేషన్ (స్వయంతృప్తి) అంటే తెలుసా మీకు? దాని స్పెల్లింగ్‌ కూడా సరిగ్గా రానివాళ్లు.. వాళ్ల ఇంట్లో మహిళలతో సినిమాకు వెళ్లామంటూ ట్రోల్ చేయడం సరికాదంటూ కొందరు నెటిజన్లు స్వర భాస్కర్ కు మద్దుతు ఇస్తున్నారు.

చాలానే ఉంటాయి

నిల్‌ బ్యాటరీ సన్నాటా, అనార్కలీ ఆఫ్‌ అరా లాంటి చిత్రాలతో హిందీ తెరపై గుర్తింపు తెచ్చుకున్న స్వర భాస్కర్ వీరే ది వెడ్డింగ్ లో కాస్త బోల్డ్ గా నటించింది. ఈ మూవీలో మద్యపానం, ధూమపానం చేయడం, బూతులు మాట్లాడుకోవడం వంటివి చాలానే ఉన్నాయి.

బూతులు మాట్లాడుకుంటున్నారు

ఇక స్వరభాస్కర్ వీరే ది వెడ్డింగ్ మూవీ గురించి కూడా మాట్లాడారు.

"పట్టణాల్లో కొందరు యువతులు తాగుతున్నారు, ధూమపానం చేస్తున్నారు. బూతులు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి స్నేహితుల మధ్య జరిగే ఓ కథను మా చిత్రంలో చూపించాం కానీ కేవలం వీటిని చూపించేందుకు సినిమా చేయలేదు. వీర్‌ దే వెడ్డింగ్‌ చిత్రం నలుగురు పట్టణ యువతుల మధ్య జరిగే అనుబంధాల, భావోద్వేగాల కథ. "

స్వర భాస్కర్ గురించి..

అందరికీ ‘వాషింగ్ పౌడర్ నిర్మా' ప్రకటన గుర్తుండే ఉంటుంది. ఈ ప్రకటనలో నటించిన ముద్దుముద్దుగా ఉండే బేబీనే స్వర భాస్కర్. 2009లో సినీఅరంగేట్రం చేసిన ఆ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది.

డ్రస్ హాట్ టాపిక్

ఇక ‘వీర్‌ ది వెడ్డింగ్‌' ఆడియో లాంచ్‌‌లో స్వర భాస్కర్ స్టెప్పులేసి అభిమానులను అలరించింది. అంత వరకూ ఓకేగానీ ఆమె వేసుకున్న డ్రస్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు ‘వాషింగ్ పౌడర్ నిర్మా' యాడ్ చేసినప్పుడు ఆమె డ్రస్ స్టైల్.. ఆడియో లాంచ్‌లో పాటకు డ్యాన్స్ చేసినప్పుడు ఆమె డ్రెస్ స్టైల్ ఇంచుమించు ఒకేరకంగా ఉంటుంది.

క‌రీనా క‌పూర్

క‌రీనా క‌పూర్

ఇక వీరే ది వెడ్డింగ్ మూవీలో నటించిన బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ కు ఈ మధ్య ట్రోలింగ్ కు గురైంది. వీరే ది వెడ్డింగ్ చిత్రంలో కరీనా కపూర్ అస‌భ్య‌క‌ర రీతిలో బ‌ట్టలు ధరించారంటూ నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై క‌రీనా మీడియా ద్వారా ఇటీవల స్పందించారు కూడా.

కొడుకుంటే చిన్న డ్రెస్ వేసుకోకూడదా?

కొడుకుంటే చిన్న డ్రెస్ వేసుకోకూడదా?

" నాకు పెళ్ళైందని, నాకు ఓ కొడుకు ఉన్నాడ‌ని , ఇలా ఏవో కార‌ణాల‌తో చిన్న డ్రెస్ లు వేసుకోకూడ‌దు అని అన‌డం మూర్ఖ‌త్వం. అమ్మ వేసుకునే దుస్తులు అని అంటే ఏంటో నాకు ఏమి అర్థం కావ‌డం లేదు. స్వేచ్చ‌, స్వాతంత్య్రం ఇచ్చే కుటుంబం నుండి నేను వ‌చ్చాను. మా అమ్మ (బ‌బితా క‌పూర్), మా అత్త‌గారు (ష‌ర్మిలా ఠాగూర్‌) ఇప్ప‌టికీ మోడ్ర‌న్ దుస్తులు ధ‌రిస్తారు."

రోజుకొక కారణంతో ట్రోల్

రోజుకొక కారణంతో ట్రోల్

" చీర‌లో ఎంత అందంగా ఉంటారో, మోడ్ర‌న్ డ్రెస్సులలోను వారు అంతే ఆక‌ర్షిణీయంగా క‌నిపిస్తారు. గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు కూడా నాపై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌హిళ‌కి న‌చ్చేలా ఉండేట్టు స‌మాజం స్వేచ్ఛ‌నివ్వాలి. మాపై మీరు ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన అవి మా మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ తీయ‌వు అంటూ చెప్పుకొచ్చింది బెబో." మొత్తానికి వీరే ది వెడ్డింగ్ మూవీ అందులోని హీరోయిన్లు రోజుకొక కారణంతో ట్రోల్ కు గురవుతున్నారు.

మాస్టర్బేషన్ అంటే

మాస్టర్బేషన్ అంటే

శృంగారంలో పాల్గొనకుండా అందులోని ఆనందాన్ని అనుభవించాలనుకునే విధానాన్నే స్వయం తృప్తి‘హస్తప్రయోగం (మాస్టర్బేషన్) అంటారు. దీన్ని ఎక్కువగా అబ్బాయిలే చేసుకుంటారనుకుంటే పొరపాటు. అమ్మాయిలు కూడా వారి కోరికను మాస్టర్బేషన్ చేసుకుంటూ తీర్చుకుంటారు. శృంగారంలో పొందే ఆనందాన్ని అలా యవ్వనంలో ఉండే కొందరు అమ్మాయిలు ఆస్వాదిస్తుంటారు.

సెక్సాలజిస్టుల ప్రకారం

సెక్సాలజిస్టుల ప్రకారం

సెక్సాలజిస్టుల ప్రకారం ఇది ఏ మాత్రం తప్పు కాదు. ఆరోగ్యకరకమైన చర్య. కానీ ఏకంగా మూవీలో ఇలాంటి సన్నివేశం చూపించడం వల్లే మన జనాలు మండిపడుతున్నారు. కాగా యవ్వనంలో అమ్మాయిలకు మాస్టర్బేషన్ కామన్ అని, చాలా మంది మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారని.. అలాంటి విషయాలనే మేము మా చిత్రంలో చూపించామంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

Desktop Bottom Promotion