Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ప్రియుడిపై మోజుతో భర్తకు ఇష్టమైన మాంసం వండి తినిపించింది.. తర్వాత చంపేయాలనుకుంది
ప్రియుడిపై మోజుతో భర్తకు ఇష్టమైన మాంసం వండి తినిపించింది.. తర్వాత చంపేయాలనుకుంది. దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. భర్తను చంపిన భార్య, గుంటూరు దాచేపల్లిలో భర్తపై దాడి
రుచికరంగా మాంసం కూర వండి అందులో నిద్ర మాత్రలు కలిపింది ఆ భార్య. ప్రేమగా భర్తకు వడ్డించింది. అతడు శుభ్రంగా తినేసి నిద్రలోకి జారుకున్నాడు. ఆదమరచి నిద్రపోతున్న అతడి ముఖంపై ప్రియుడితో కలిసి దిండు వేసి బలవంతంగా నొక్కింది. ఊహించని ఈ పరిణామానికి ఉలిక్కిపడి లేచి గట్టిగా అరిచాడు డానియేలు. ఇది సీరియల్ కాదు... సినిమా కాదు. నిజజీవితంలో జరిగిన సంఘటన.

అమ్మాయిలను సున్నిత మనస్కులనుకుంటారు అందరూ అమ్మాయిలను సున్నిత మనస్కులనుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా కఠినంగా ఉంటారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లను కడతేరుస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలసి భార్య చేసిన యత్నం విఫలమైంది.
అందరూ అమ్మాయిలను సున్నిత మనస్కులనుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా కఠినంగా ఉంటారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లను కడతేరుస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలసి భార్య చేసిన యత్నం విఫలమైంది.

దానియేలుకు రత్నకుమారితో వివాహం
దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.... కేసానుపల్లికి చెందిన వినుకొండ దానియేలుకు అదే గ్రామానికి చెందిన రత్నకుమారితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు.

వీరి మధ్యలోకి బెంజిమెన్
వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి మధ్యలోకి బెంజిమెన్ అనే వ్యక్తి వచ్చాడు. చర్చి ఫాదర్‌గా తనని తాను పరిచయం చేసుకుని కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతుండేవాడు. పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన కంభంపాటి బెంజిమెన్‌కు కేసానుపల్లి ఎస్సీ కాలనీలో చర్చి ఫాదర్‌గా చెప్పకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

రత్నకుమారి, బెంజిమన్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది
ఈ క్రమంలోనే రత్నకుమారి, బెంజిమన్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. చీకటి రహస్యం ఎంతో కాలం దాగలేదు. భర్తకు తెలిసింది.
రత్నకుమారితో బెంజిమెన్ చనువుగా ఉండడాన్ని గమనించిన భర్త దానియేలు పలుమార్లు బెంజిమెన్‌ను హెచ్చరించాడు.

బెంజిమెన్‌తో కలిసి ప్లాన్
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాత్రి దానియేలు ఇంటికి వచ్చాడు. భోజనం పెట్టామని భార్యను దానియేలు అడిగాడు. భర్తని ఎలాగైనాఅడ్డుతొలగించుకోవాలని ప్రియుడు బెంజిమెన్‌తో కలిసి ప్లాన్ చేసింది భార్య.

మాంసం కూర వండి అందులో నిద్ర మాత్రలు
రుచికరంగా మాంసం కూర వండి అందులో నిద్ర మాత్రలు కలిపింది. ప్రేమగా భర్తకు వడ్డించింది. భోజనం తర్వాత దానియేలు నిద్రపోయాడు.
పథకం ప్రకారం బెంజిమెన్... రత్నకుమారి సహకారంతో ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న దానియేలు ముఖంపై దిండువేసి బెంజిమెన్ బలవంతంగా నొక్కాడు.

పెద్దగా కేకలు వేశాడు
ఊపిరాడకపోవడంతో నిద్రమత్తులోనే ఉలిక్కిపడిన దానియేలు పెద్దగా కేకలు వేశాడు. పక్క ఇంటిలో నిద్రపోతున్న వృద్ధులు ఆ అరుపులు విని చుట్టుపక్కల వారికి తెలిపారు. దానియేలు అన్న వినుకొండ మోషే వెంటనే అక్కడికి చేరుకున్నాడు.

బెంజిమెన్ నుంచి అతడిని రక్షించాడు
దానియేలుపై జరుగుతున్న హత్యాయత్నాన్ని గమనించి బెంజిమెన్ నుంచి అతడిని రక్షించాడు. ఈలోగా స్థానికులు గుంపులుగా చేరడంతో బెంజిమెన్, రత్నకుమారి అర్ధరాత్రి పరారయ్యారు. దాచేపల్లి పోలీసులుసంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
