Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
ఆర్థికస్థితిని మెరుగుపరచడానికి సూచించదగిన జ్యోతిషశాస్త్ర నివారణలు
ఆర్థికస్థితిని మెరుగుపరచడానికి సూచించదగిన జ్యోతిషశాస్త్ర నివారణలు
డబ్బెవరికి చేదు? మన ఉనికిని సున్నితంగా మరియు సౌకర్యవంతంగా చేసే ఏకైక సాధనం డబ్బు. అతను / ఆమె తమకు డబ్బు ముఖ్యం కాదని చెబుతున్నట్లు మీకు కనిపిస్తే, ఆ వ్యక్తి మీకు ఖచ్చితంగా అబద్ధం చెబుతున్నాడని అర్ధం. మీరు పరిపూర్ణంగా లక్ష్మీకటాక్షంచే ఆశీర్వదించబడ్డారని నిర్ధారించడానికి గల ప్రాథమిక సాధనం ఏమిటంటే, మీరు కుబేరుని సంతృప్తి పరచడమే. అతను సంపద యొక్క దేవునిగా ఉంటూ, అతన్ని సంతృప్తిగా ఉంచిన ఎడల మీ జీవితంలో దేనికీ కొరత ఉండదని సూచించబడుతుంది. కావున కుబేరుని సంతోషంగా ఉంచేందుకుగల మార్గాలని తెలుసుకోవడం ద్వారా, మీ ఆర్ధికస్థితిని మెరుగుపరచుకోవచ్చునని సూచించబడుతుంది.

ఆర్థికస్థితిని మెరుగుపరచడానికి సూచించదగిన జ్యోతిష శాస్త్ర నివారణలు :ః

నగదు ఉంచే లాకర్ లేదా అల్మరాను
1. నగదు ఉంచే లాకర్ లేదా అల్మరాను ఇంటి దక్షిణ లేదా నైరుతి గోడలో ఉంచండి మరియు అది ప్రధానంగా ఉత్తర దిశలో తెరుచుకునేలా చూసుకోండి. కుబేరుని స్థానం ఉత్తర దిశగా ఉంటుంది. మరియు ఈ దిశలో లాకర్ లేదా అల్మారాను తెరవడం ద్వారా, అతను దానిని మరలా పూరించగలడని నిర్ధారిస్తుంది.

2. సంపదను ఆకర్షించడానికి, నగదు కలిగిన లాకర్
సంపదను ఆకర్షించడానికి, నగదు కలిగిన లాకర్ ముందు అద్దం ఉంచండి, తద్వారా అద్దం లాకర్ యొక్క ప్రతిబింబాన్ని చూపుతుంది. ఇది మీ జీవితంలో సానుకూల దృక్పధాన్ని పెంపొందిస్తుందని సూచించబడుతుంది.

3. ఎప్పుడూ ఉచితంగా దేనినీ తీసుకోకండి,
ఎప్పుడూ ఉచితంగా దేనినీ తీసుకోకండి, ఆశించకండి లేదా మీ సేవలను ఉచితంగా ఇవ్వకండి. చేసిన ప్రతి పనికీ కొంత పరిహారం డబ్బు వారీగా పొందేలా చూసుకోండి.

4. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు
ప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఉండదని గుర్తుంచుకోండి. లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రతి అంశములోనూ ఈ మాటను గుర్తుంచుకోండి. చెడు మార్గంలో వచ్చిన డబ్బుని కుబేరుడు నిలవనీయడని చెప్పబడుతుంది.

5. ప్రతి నెలా మీ సంపాదనలో కొంత భాగాన్ని
ప్రతి నెలా మీ సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వంతో అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. ఇది మీకు లక్ష్మీ దేవి క్రుపను ఇస్తుంది, తద్వారా మీకు మరియు మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది.

ఇంట్లో ఉన్న మహిళలను ఎంతో గౌరవంగా చూసుకోండి
6. ఇంట్లో ఉన్న మహిళలను ఎంతో గౌరవంగా చూసుకోండి. వారు లక్ష్మీ దేవి స్వరూపాలని గుర్తుంచుకోండి. మహిళను గౌరవించని ప్రదేశంలో లక్ష్మీ దేవి అడుగు కూడా వేయడానికి ఇష్టపడదు.

7. మీ ప్రార్థనా స్థలంలో కుబేరుని యంత్రాన్ని
మీ ప్రార్థనా స్థలంలో కుబేరుని యంత్రాన్ని ఎర్రటి వస్త్రం మీద ఉంచి, మిమ్మల్ని ఆశీర్వదించమని ప్రతిరోజూ ఆయనను ప్రార్థించండి.

ఇంట్లో తులసి మొక్కను నాటండి
8. ఇంట్లో తులసి మొక్కను నాటండి మరియు ప్రతి సాయంత్రం మొక్క దగ్గర నెయ్యితో నిండిన మట్టి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి మీ ఇంటిని ఎన్నటికీ విడిచిపెట్టదు. అంతేకాకుండా సమృద్ధి మరియు శ్రేయస్సుతో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది.

9. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మంచిగా వచ్చిన ధనాన్నే
లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మంచిగా వచ్చిన ధనాన్నే విరాళాలుగా ఇవ్వండి. నల్ల ధనంతో ఉదారంగా చేసిన దానం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వజాలవు.

ఇంట్లో విరిగిన పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు లేదా ఉపయోగించవద్దు.
ఇంట్లో విరిగిన పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు లేదా ఉపయోగించవద్దు. ఇది, మీకు రావలసిన ధనాన్ని కూడా ఆపుతుందని చెప్పబడుతుంది.

ప్రతి శుక్రవారం విష్ణువుకు
11. ప్రతి శుక్రవారం విష్ణువుకు దక్షిణ భాగాన తెరచి ఉన్న శంఖం ద్వారా నీటిని అందివ్వడం అనేది, లక్ష్మీ దేవిని ఎంతో ఆనందపరుస్తుంది.

12. స్నానం చేసిన తరువాత,
స్నానం చేసిన తరువాత, ప్రతి రోజూ ప్రార్థన చేసి లక్ష్మీ దేవి ఆశీర్వాదాన్ని పొందండి. మరియు మీ నుదిటిపై కుంకుమ తిలకాన్ని దిద్దండి.

మహిళా ఇంటిపెద్ద, ప్రతిరోజూ ఉదయం ప్రధాన ద్వారం వద్ద
13. మహిళా ఇంటిపెద్ద, ప్రతిరోజూ ఉదయం ప్రధాన ద్వారం వద్ద గ్లాసుడు నీటిని పారబోయాలి. ఇది సంపద మరియు శ్రేయస్సులను ఇంట్లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేస్తుంది.

14. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, ప్రతి బుధవారం ఆవుకు పచ్చటి గడ్డిని తినిపించండి. ఇంట్లో గోమాత ఉండడమంటే, లక్ష్మీ దేవి ఉన్నట్లేనని గుర్తుంచుకోండి.

15. నెలలో ఏదైనా శుక్రవారం
నెలలో ఏదైనా శుక్రవారం, పెళ్లి కాని ముగ్గురు అమ్మాయిలకు పాయసాన్ని తినిపించండి మరియు వారికి కొంత డబ్బుతో పాటు పసుపు వస్త్రాలను కూడా దానం చేయండి. ఇది లక్ష్మీ దేవిని ఆనందపరుస్తుంది. క్రమంగా ఆమె మీ నివాసాన్ని ఆశీర్వదిస్తుంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామతదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications