Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
Best Days for Hair Cutting: ఈరోజుల్లో హెయిర్ కట్ చేసుకుంటే అదృష్టం వరిస్తుందట...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, హెయిర్ కటింగ్ చేసుకోవడానికి ఏ రోజు ఉత్తమంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ప్రతి పనికీ ఓ పద్ధతి అనేది కచ్చితంగా ఉంటుంది. పూర్వకాలంలో ప్రతి పనిని ఒక సంప్రదాయంగా, ఆచారంగా భావించేవారు. ముఖ్యంగా మన పెద్దలు ఏ పని చేసినా, అందుకు మంచి సమయం, కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చేస్తుంటారు.

ఉదాహరణకు మనం జుట్టు కత్తిరించుకోవాలన్నా.. గోళ్లు కట్ చేసుకోవాలన్నా కూడా వారం, వర్జ్యం, సమయం వంటివి తప్పకుండా పాటిస్తారు. శాస్త్రాల ప్రకారం, నిర్దిష్ట సమయాల్లో, ప్రత్యేకమైన వారాల్లోనే హెయిర్ కట్ చేసుకుంటారు.

అయితే మనలో చాలా మంది ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే.. అప్పుడు మాత్రమే హెయిర్ కట్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఆయుష్షు తగ్గిపోయే ప్రమాదముందని పెద్దలు హెచ్చరిస్తున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జుట్టు, గోళ్లను, గడ్డం వంటివి ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసుకోకూడదు. అలా చేస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఈ సందర్భంగా ఏ రోజున హెయిర్ కట్ చేసుకోవాలి.. ఏ సమయంలో జుట్టు కత్తిరించుకుంటే అదృష్టం లభిస్తుందనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాత్రి పూట వద్దు..
శాస్త్రాల ప్రకారం, మీరు కటింగ్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటలలోపే పూర్తి చేయాలి. అప్పుడే మీకు శుభ ఫలితాలు వస్తాయి. సాయంకాలం పూట అంటే సూర్యస్తమయం తర్వాత చీకటి పడ్డాక ఎప్పటికీ కటింగ్ చేసుకోకూడదు. అలాగే తండ్రి, కుమారులు ఒకేరోజున, అన్నదమ్ములు కూడా ఒకేరోజున కటింగ్ చేసుకోకూడదు అనే నియమం ఉంది.

వారం రోజుల నియమాలు
హిందూమతంలో, వారంలోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు పాలించే దేవత మరియు పాలించే గ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ చేసే పనులను బట్టి, దేవతలను తృప్తిపరచి గ్రహాలను శాంతపరిచే విధంగా చేయాలి. మీరు ఈ నియమాన్ని పాటించకపోతే మీరు దేవుని మరియు గ్రహాల ఆగ్రహానికి గురవుతారు. బుధవారం రోజున శ్రీక్రిష్ణుడికి సంబంధించినదిగా భావిస్తారు. ఈరోజున జుట్టు మరియు గోర్లు కత్తిరించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజున కటింగ్ చేసుకున్న వారికి ఐదు నెలల ఆయుష్షు పెరుగుతుందట. అంతేకాక మీరు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. మీ సంపద కూడా పెరుగుతుందట. మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుందట.

సోమవారం చంద్రుడితో..
హిందూ మతం ప్రకారం, సోమవారం చంద్రునితో ముడిపడి ఉంది. చంద్రుడు మనుషుల మనసుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాడు. కాబట్టి ఈరోజు జుట్టు, గోర్లు కట్ చేసుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మరోవైపు పిల్లలు కావాలనుకువాళ్లు.. ఒకే కుమారుడు ఉండే వారు సోమవారం రోజున కటింగ్, షేవింగ్ వంటివి చేసుకోకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చాలా మంది నమ్ముతారు.

మంగళవారం అంగారకుడితో..
మంగళవారం రోజున అంగారకుడి చేత పాలించబడుతుందని నమ్ముతారు. ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం లేదా గడ్డం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయట. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మంగళవారం రోజున కటింగ్ షాపులు మూసేస్తారు. ఎందుకంటే ఈరోజున కటింగ్ చేసుకుంటే ఎనిమిది నెలల ఆయుష్షు తగ్గిపోతుందట. దీని ఫలితంగా మీ ఇంట్లో దుఃఖం కలుగుతుందట.

బుధవారం రోజున..
బుధవారం రోజున శ్రీక్రిష్ణుడికి సంబంధించినదిగా భావిస్తారు. ఈరోజున జుట్టు మరియు గోర్లు కత్తిరించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజున కటింగ్ చేసుకున్న వారికి ఐదు నెలల ఆయుష్షు పెరుగుతుందట. అంతేకాక మీరు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. మీ సంపద కూడా పెరుగుతుందట. మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుందట.

గురువారం రోజున..
గురువారం రోజున విష్ణుమూర్తికి అనుకూలంగా భావిస్తారు. ఈరోజున జుట్టు లేదా గోళ్లను కత్తిరించుకుంటే, లక్ష్మీదేవిని అవమానించినట్టుగా భావిస్తారు. లేకపోతే జీవితంలో మీరు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట. పిల్లల నుండి కొన్ని సమస్యలు రావొచ్చు.

శుక్రవారం రోజున..
ఈరోజున దుర్గాదేవికి అంకితమివ్వబడిన రోజుగా పరిగణిస్తారు. అలాగే శుక్ర గ్రహంతో ముడిపడి ఉన్నందున ఈరోజున జుట్టు మరియు గోళ్లను కత్తిరించుకోవడం మంచిగా భావిస్తారు. ఇలా చేయడం వలల్ మీ జీవితంలో విజయం, డబ్బు, కీర్తి పెరుగుతాయి.

శనివారం రోజున..
ఈరోజున శని దేవునికి అంకితమైన రోజున. ఈరోజున కటింగ్, షేవింగ్ చేసుకున్న వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి. మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆయుషు కూడా 7 నెలల పాటు తగ్గిపోతుంది.

ఆదివారం రోజున..
ఆదివారం రోజున సూర్యభగవానుడికి అంకితమైన రోజు. ఈరోజు చాలా మందికి హాలిడే కాబట్టి, చాలా మంది కటింగ్, షేవింగ్ చేసుకునేందుకు, అదే సమయంలో గోళ్లను కత్తిరించుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఒక నెల ఆయుష్షు తగ్గిపోతుంది. మీ మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది.

శాస్త్రాల ప్రకారం..
శాస్త్రాల ప్రకారం, క్షురకర్మకు అనుకూలమైన తిథులు ఇలా ఉన్నాయి. విధియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి శుభప్రదమైవిగా భావిస్తారు. అదే విధంగా ఆదివారం, శనివారం, మంగళవారం నాడు క్షవరం చేయించుకోవడం మంచిది కాదు.



Click it and Unblock the Notifications











