Latest Updates
-
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే..
శనివారం మీ రాశిఫలాలు (29-08-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, భాద్రపదమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈరోజు మీరు మీ ఆనందాన్ని స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. తల్లిదండ్రుల సహకారంతో మీ విశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలా బాగుంటుంది. సీనియర్ ఆఫీసర్లు మీ పనితో సంతృప్తి చెందుతారు. వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్కులు తీసుకోకూడదు. మీరు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే మీకు మంచి ప్రయోజనం లభిస్తుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఏ పనిలో అయినా విజయం దక్కాలంటే, మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు మీ స్నేహితులే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అటువంటి పరిస్థితిలో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ విషయాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి మీరు ప్రయత్నించడం మంచిది. మీ ఇంటి వాతావరణం ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు. ఈరోజు మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనవచ్చు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఏవైనా ప్రణాళికలు వేసుకుంటే.. అవి కచ్చితంగా సఫలమవుతాయి. విద్యార్థులు ఈరోజు కొన్ని అడ్డంకులను అధిగమించొచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు మీరు మంచి ప్రయోజనం పొందవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు దంతానికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. మీరు సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 10:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనిలో మీకు ఏకాగ్రత ఉంటుంది. మీరు మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వగలుగుతారు. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీరు విజయం సాధించొచ్చు. మీరు సానుకూల శక్తితో చుట్టుముడతారు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, ఎలాంటి సందేహాలను దృష్టిలో ఉంచుకోకండి. ఈరోజు కుటుంబం విషయంలో మంచిగా ఉంటుంది. మీ సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి. మీరు మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీ ప్రియమైన వారు మీ ఉత్సాహాన్ని పెంచుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువగా ఆలోచించకండి.
లక్కీ కలర్ : పీచ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఈరోజు మంచి అనుభూతి కలుగుతుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. ఉద్యోగులు చేసే పని ఈరోజు కార్యాలయంలో మీ ఉన్నత అధికారులను మాత్రమే కాకుండా మీ సహోద్యోగులను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని పనుల నిమిత్తం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మీకు శుభంగా ఉంటుంది. మీరు ప్రయాణించే పనిలో మీకు విజయం లభిస్తుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇది మాత్రమే కాదు, ఈ రోజు మీరు తెలివిగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది రాబోయే సమయంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు డబ్బుతో ఎలాంటి సమస్యా ఉండదు. అలాగే మీరు డబ్బు సంపాదించడానికి కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు. ఈరోజు నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మీ పనిలో జోక్యం చేసుకోకుండా చూడండి. మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. దీని వల్ల మీరు మంచి అనుభూతి చెందుతారు. వ్యాపారులు ఈరోజు చర్చలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని పరంగా అంతా బాగానే ఉంటుంది. మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా గడుపుతారు. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మరోవైపు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు ప్రత్యేక బహుమతిని ఇవ్వగలరు. అది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మరోవైపు మీ ఆరోగ్యం మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఏవైనా అడ్డంకులుంటే, మీరు మంచి అనుభవం ఉన్న వారి వద్ద నుండి సలహాల తీసుకోవాలి. లేదంటే మీరు అధ్యయనాలలో వెనుకబడిపోతారు. పని విషయంలో ఈరోజు మీరు ఒక సువర్ణావకాశాన్ని పొందొచ్చు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఆలోచనలు ఉంటాయి. మరోవైపు ఆశించిన ఫలితం లభించకపోవడం వల్ల శ్రామిక ప్రజలు చాలా నిరాశ చెందుతారు. మీ ప్రస్తుత ఉద్యోగంలో మీకు సంతృప్తి లేకపోతే, మీ ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నించండి. మీరు విజయాన్ని ఫ్లాగ్ చేయగల సామర్థ్యం మీకు ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీకు కార్యాలయంలో ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు కష్టపడి పనిచేస్తారు. మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మీ కృషి యొక్క సరైన ఫలితాలను మీరు త్వరలో పొందుతారు. వ్యాపారులు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియురాలు కొంత గొప్ప విజయాన్ని పొందవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో పెండింగులో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ యజమానికి చెడ్డ మూడ్ ఉంటుంది. మీ చిన్న పొరపాటు వారి కోపాన్ని తెప్పిస్తుంది. వ్యాపారులు పెద్ద లాభాలను పొందడానికి కొన్ని ముఖ్యమైన మరియు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో ఆకస్మిక సమస్య తలెత్తవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ రోజ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











