For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (15-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. మీ ఇద్దరి మధ్య అపార్థాలు పెరుగుతాయి. మీ అస్థిర ప్రవర్తన మీ జీవిత భాగస్వామిని అసంతృప్తికి గురిచేస్తుంది. ఈ సందర్భంలో వారి పట్ల మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోవాలి. మీరు ఈ క్షణంలో ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే, భవిష్యత్తులో నష్టపోతారు. మీరు ఒకేసారి అనేక పనులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల తప్పులు కూడా జరుగుతాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో పనిభారం అకస్మాత్తుగా పెరగడం వల్ల మీకు చాలా కోపం వస్తుంది. మీరు మీ పనులను ప్రశాంతమైన మనస్సుతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తే, మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. వ్యాపారవేత్తలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లేత ఆకుపచ్చ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు కొంత బలహీనంగా ఉంటారు. మీరు మంచి వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ జీవిత భాగస్వామితో కొంత విభేదాలు తలెత్తవచ్చు. కానీ సాయంత్రంలోపు అంతా సాధారణం అవుతుంది. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి కావాలంటే, మీరు ఒకరి భావాలను ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏకాంతంలో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. అందువల్ల మీరు కొన్ని ఇతర ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు. మీ వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీ వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. అందువల్ల వారిని పిక్నిక్ కోసం తీసుకెళ్లడం మంచిది. ఈ రోజు మీరు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అక్కడ మీరు కోరుకోకపోయినా రాజీ పడవలసి ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 33

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఈరోజు మీరు కష్టపడి పనిచేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయం యొక్క వాతావరణం చాలా బాగుంటుంది. వేగం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ ఉత్సాహం కూడా పెరుగుతుంది. వ్యాపారవేత్తలు మిశ్రమ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు అకస్మాత్తుగా ప్రత్యేక అతిథి రాక ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. కానీ మీరు మీ పనిని పూర్తి ఏకాగ్రతతో చేస్తారు. తద్వారా మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మీరు భాగస్వామ్యంతో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు మీ ప్రణాళిక ముందుకు సాగవచ్చు. ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుటుంబసభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మీకు ఉపశమనం కలుగుతుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:40 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కోపంగా ఉండకూడదు. ఎందుకంటే మీకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఈ రోజు మీరు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఒకరితో ఒకరు సమయం గడపడం ద్వారా మీరిద్దరూ ప్రేమలో మునిగిపోతారు. ఆఫీసులో మీరు మీ పనులన్నింటినీ సమయానికి పూర్తి చేయగలుగుతారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:55 నుండి రాత్రి 10:10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే మీకు తగినంత విశ్రాంతి లభించే అవకాశం లభిస్తుంది. ఈ రోజు వివాహ జీవితానికి చాలా ముఖ్యమైన రోజు కానుంది. కార్యాలయ వాతావరణం బాగుంటుంది. మీ పని కూడా వేగవంతం అవుతుంది. మీ భాగస్వామి మానసిక స్థితి ఈ రోజు సరిగ్గా ఉండదు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా, ఈ రోజు మీ జీవితంలో సానుకూల మార్పు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు అదనపు డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి రాత్రి 10:40 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈ రోజు వారి సామర్థ్యం మరియు కృషి ద్వారా అన్ని పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఈ రోజు మీ వివాహ జీవితంలో ఉత్తమ రోజులలో ఒకటి. మీరు మీ జీవిత భాగస్వామితో చిరస్మరణీయమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రోజు పని విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. వ్యాపారంలో కొంత పెద్ద ప్రయోజనం పొందవచ్చు. మీ వ్యాపారం భవిష్యత్తులో వేగంగా పెరుగుతుంది. ఇది మీ కుటుంబసభ్యులకు ఆనందకరమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధం యొక్క మాధుర్యం అలాగే ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

English summary

Daily Horoscope January 15, 2020

If you don’t know what are the opportunities and challenges that lie in your way then it is best that you read your daily horoscope today. Check out what the stars have in store for you so that you can work on your strengths and overcome your weaknesses.
Story first published:Wednesday, January 15, 2020, 0:54 [IST]
Desktop Bottom Promotion