For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (27-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ వారం మీ జాతకం ఎలా ఉందో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల పట్ల నిరాశపడొచ్చు. అయితే మీ మనసు నుండి ప్రతికూల ఆలోచనలను మీరు ఎలా తొలగించుకోవాలో ఆలోచించడం మంచిది. మీరు మీ వ్యక్తిగత విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే, మీరు పాజిటివిటీని అనుభవిస్తారు. వైవాహిక జీవితంలో మెరుగుదల కావాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత త్వరగా కోపం తెచ్చుకుంటారో, అంత త్వరగా మీ కోపం కూడా శాంతమవుతుంది. కాబట్టి మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. పనిలో ఈరోజు పవిత్రంగా ఉంటుంది. మీ సామర్థ్యాన్ని చూపించడానికి మీకు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. మీరు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం మంచిది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతుందది. బహుశా దగ్గరగా ఉన్న ఎవరైనా ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తారు. ఇది విచారంగా మరియు నిరాశ చెందాల్సిన సమయం కాదు. మీ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగుపడేందుకు అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు తల్లిదండ్రులు, సోదరులు మరియు సోదరీమణుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఒక చిన్న సమస్య ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు అజాగ్రత్తగా ఉంటే మీరు ఇతరులకన్నా చాలా వెనుకబడి ఉంటారు. వ్యాపారులకు ఈరోజు పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ఎటువంటి నష్టం లేదా లాభం ఉండదు. మీకు పెద్ద లాభం కావాలంటే, మీరు వేరేదాన్ని ఆలోచించాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు

ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద సమస్యను పరిష్కరించగలుగుతారు. మీ ప్రియమైన వారితో సన్నిహిత సంబంధం ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు పూర్తి నిజాయితీతో పని చేస్తారు. వ్యాపారులకు పరిస్థితులు అస్థిరంగా ఉంటాయి. ఈ రోజు మీరు వ్యాపార విషయాల గురించి చాలా గందరగోళం చెందుతారు. ఈ రోజు మీరు మీ తల్లి గురించి ఆందోళన చెందుతారు. ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 9:35 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు మీ ప్రియమైన స్నేహితులతో గడిపిన సరదా క్షణాలను కోల్పోతారు. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా పొరపాటు చేస్తే, మీ యజమాని మీపై కోపంగా ఉంటాడు. వ్యాపారులకు కొంత నష్టం రావచ్చు. మీరు నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. లేకపోతే పెద్ద నష్టమే వస్తుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 5:30 నుండి ఉదయం 11 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల పరిస్థితులలో కూడా సులభంగా పని చేయగలుగుతారు. అయినా కూడా ఉన్నతాధికారులు మీకు కష్టమైన పనిని అప్పగించే అవకాశముంది. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు ఒక పెద్ద ఆర్థిక ఒప్పందం కుదరొచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. కుటుంబంతో సమయం గడిపిన తర్వాత మీరు మంచి అనుభూతి చెందుతారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి 12:25 గంటల వరకు

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు లేదా వ్యాపారులు ఈరోజు మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు తక్కువగా ఖర్చు చేస్తారు. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే, త్వరలో మీరు మీ అప్పుల నుండి బయటపడవచ్చు. ఆరోగ్య పరంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పనిని పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. మీ సామర్థ్యాన్ని చూసి సీనియర్లు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తేలికపాటి వ్యాయామం చేయండి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు సహాయాన్ని పొందుతారు. పిల్లలు ఈ రోజు మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీరు కూడా దీని నుండి ఉపశమనం పొందుతారు. ఈరోజు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగానే ఉంటుంది. ఈరోజు మీరు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తుంటే, ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారి జీవిత భాగస్వామి ఈరోజు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. అది మీకు సంతోషాన్నిస్తుంది. అయితే ఈరోజు పని భారం మీకు కోపం తెప్పిస్తుంది. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ సీనియర్లు ఈ రోజు మీతో సంతోషంగా ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు మానసిక శాంతిని పొందేందుకు పేదవారికి సహాయం చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. జీవిత భాగస్వామితో అపార్థాల వల్ల, మీరు ఈ రోజు చాలా కలత చెందుతారు. మీ జీవితంలో ఒకదాని తరువాత ఒకటిగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మీ మనస్సును దగ్గరి వారితో పంచుకోండి. మీరు మంచి అనుభూతి చెందుతారు. వ్యాపారులు భాగస్వాముల కార్యకలాపాలపై నిఘా పెంచండి. ఈ రోజు మీరు మీ నిర్ణయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీ తప్పు నిర్ణయం ఫలితం మీతో ఉన్న మొత్తం కుటుంబాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తవుతాయి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉండాలి. లేదంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రొమాన్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. కార్యాలయంలో మీ శత్రువులు మీపై ఏవైనా కుట్రలు చేసే అవకాశం ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తే, రాబోయే సమయంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 27, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Wednesday, May 27, 2020, 1:38 [IST]
Desktop Bottom Promotion