Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Holi vastu tips: సంపద, శ్రేయస్సు కోసం హోలీ రోజు ఈ వాస్తు నివారణలు పాటించండి
అయితే ఈ హోలీ మీ జివితంలో మరింత ఆనందం తీసుకురావడానికి, మరింత సంపదను సృష్టించడానికి ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ ఆనందోత్సాహ మధ్య జరుపుకునే పండగ. చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే సంబరం. రంగులతో ఆడుకునే ఆట. కలర్స్ ఆఫ్ ఫెస్టివల్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. హోలీని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, ఆప్యాయత, సోదరభావాన్ని సూచిస్తుంది హోలీ.

అయితే ఈ హోలీ మీ జివితంలో మరింత ఆనందం తీసుకురావడానికి, మరింత సంపదను సృష్టించడానికి ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కలు:
ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. కానీ సమస్యల వలయంలో చిక్కుకుపోతే జీవితంపై అసంతృప్తి మొదలవుతుంది. నిరాశ, నిస్పృహలతో జీవితం దుర్లభంగా మారుతుంది. మీరు అలాగే సమస్యలో సతమతం అవుతుంటే, ఏ పని తలపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంటే ఈ వాస్తు నివారణ గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. వాస్తు ప్రకారం హోలీ రోజు ఇంట్లో మనీ ప్లాంట్ లేదా తులసి మొక్కను నాటడం అదృష్టాన్ని తీసుకువస్తుంది. గ్రహ దోషాలను తొలగించడానికి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలి. ఇంటి పరిసరాల్లో తూర్పు లేదా ఉత్తరం దిక్కున తులసి మొక్క నాటుకోవాలి.

రాధాకృష్ణుల ఫోటో:
వాస్తు ప్రకారం ఇంట్లో హోలీ రోజున రాధా కృష్ణుల ఫోటోను పెట్టుకోవాలి. దీని వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. రాధా కృష్ణుల ఫోటోను హాల్, పూజాగది, పడక గదిలో ఉంచుకోవచ్చు. హోలీ రోజు ఇంట్లో రాధా కృష్ణుల ఫోటో పెట్టిన తర్వాత గులాల్, పువ్వులు సమర్పించి పూజించాలి. ఇలా చేయడం ద్వారా వైవాహిక జీవితంలో ప్రేమ, సాన్నిహిత్యం పెరుగుతాయి. సంబంధం బలోపేతం అవుతుంది.

ఉదయించే సూర్యుని ఫోటో:
ఉదయించే సూర్యుని ఫోటో పురోగతికి చిహ్నం. హోలీ రోజున ఇంట్లో లేదా ఆఫీసులో ఉదయిస్తున్న సూర్యుని ఫోటోను పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంట్లోని కుటుంబసభ్యులందరికీ కాలం కలిసి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. హోలీ రోజున ఇంటి ప్రధాన తలుపు వెలుపల కొద్దిగా పైన సూర్యుని ఫోటోను ఉంచడం ద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఏ దేవునికి ఏ రంగు..
హోలీ రోజు రంగులతో ఆడుకునే ముందు దేవుళ్లకు గులాల్ సమర్పించాలి. లక్ష్మీ దేవికి ఎరుపు రంగు, శ్రీకృష్ణుడికి నీలం రంగు, విష్ణువు, శ్రీరాముడికి పసుపు రంగు, శంకరుడికి సరస్వతి దేవికి గులాబీ రంగు గులాల్ సమర్పించాలని, ఇలా చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

దీపం:
హోలీ రోజు నాలుగు ముఖాలు ఉన్న దీపాన్ని వెలిగించాలి. ఇంటికి లేదా దుకాణానికి ఉత్తర దిశలో దీపాన్ని వెలిగించాలి. ఆవనూనె మాత్రమే వాడాలి. ఉత్తర దిక్కుకు, సంపదకు లక్ష్మీ దేవిని అధిపతిగా భావిస్తారు. ఇక్కడ దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications