For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింహం, తుల, కర్కాటకం: ఈ రాశిచక్రాలకు చెందిన వ్యక్తులు లైఫ్ ను సీరియస్ గా తీసుకోరు

|

మనల్ని మనం ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం సంపాదించడంతోపాటుగా, జీవితాన్ని సంతోషంగా, వీలైనంత తక్కువ సమస్యలు ఉండేలా మార్చడానికి నిరంతర శ్రామికుని వలె ఆలోచిస్తూనే ఉంటాం. ఏది ఏమైనా, ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నప్పటికీ జీవితంలో తప్పించుకోలేని అంశాలంటూ కొన్ని ఉంటాయి.

హార్ట్‌బ్రేక్స్, కార్యాలయ రాజకీయాలు, అవాంఛిత కుటుంబ సమస్యలు వంటివి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగంగా ఉంటూ, ఏదో ఒక సమయంలో వెంటాడుతూనే ఉంటాయి. కొంతమంది కేవలం తమ గురించే కాకుండా, ఇతరుల జీవితాల మీద కూడా ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు. మరియు కొందరు మాత్రం తమ పాత ప్రపంచాన్ని తలచుకుంటూ జీవించడానికి ఇష్టపడుతారు. ఇటువంటి వ్యక్తులు ఇతరుల పట్ల శ్రద్ధ వహించడమే కాకుండా, అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. కాని వారు రోజువారీ నాటకాన్ని ఇష్టపడరు.

Leo, Libra, Pisces: THESE zodiac signs dont take life too seriously,

మనలో చాలామంది జీవితాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తారు మరియు ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించిన ఆలోచనలు చేస్తూనే ఉంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, కొన్ని రాశి చక్రాలకు చెందిన వారు ప్రస్తుతకాలాన్నిమాత్రమే ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు, మరియు జీవితాన్ని ఎప్పుడూ తీవ్రంగా పరిగణించరు. ఈ రాశిచక్రాల గుర్తుల నుండి మనం నేర్చుకోదగిన అంశాలు అనేకం ఉన్నాయి. కానీ, వారు ఏ పని తలబెట్టినా, నిర్విఘ్నంగా పూర్తిచేయాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు. మరియు ప్రయత్న లోపాన్ని ఎన్నటికి ఒప్పుకోరు. మీ రాశిచక్రం కూడా, వీటిలో ఒకటిగా ఉంటే, మరిన్ని వివరాలకై వ్యాసంలో ముందుకు సాగండి.

సింహ రాశి:

సింహ రాశి:

సింహ రాశి వారు ఆశావాదులుగా, మరియు ఉత్తమ సమయాన్ని కలిగి ఉన్నట్లుగా నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ, వారు విచారంగా లేదా బాధాకరమైన రోజును కలిగి ఉంటే, గడిచిన చెడు అంశాలను మరచిపోవడానికి తన స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు ఇష్టపడుతారు. మరోపక్క, ప్రతి ఒక్కరూ సింహ రాశికి చెందిన వ్యక్తులతో సమావేశాన్ని లేదా పార్టీ చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు కూడా. అంతేకాకుండా సింహ రాశి వారిని అనుసరించేందుకు కూడా ప్రజలు మొగ్గుచూపుతూ ఉంటారు. జీవితం వారిని పరీక్షిస్తుంది మరియు ఒక పరిమితిలోనికి నెట్టివేస్తుంది. కాని వారు పట్టుదలతో, సంతోషంగా ముందుకు సాగేందుకే సిద్దమై ఉంటారు. అన్ని చెడు మరియు జీవితానికి పనికిరాని అంశాలను విడిచిపెట్టి సంతోషంగా ఉండేందుకు, ప్రణాళికలు చేస్తుంటారు.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారు,ఆలోచనా ధోరణి అధికంగా కలిగి ఉన్న నిపుణులుగా కనిపిస్తుంటారు. అంతేకాకుండా, తమ జీవితాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ఏదిఏమైనా వారి ఆలోచనా స్థాయిలు, చుట్టుపక్కల పరిస్థితులను అనుసరించే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వారు సమస్యలను ద్వేషిస్తారు మరియు జీవితంలో తెలివిగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. వారు తమ ప్రియమైనవారి గురించి అధిక శ్రద్ధను కలిగి ఉంటారు. కానీ విషయాలు తీవ్రంగా ఉన్న ఎడల, వారు దాని నుండి బయటపడటానికి ఇష్టపడతారు.

తుల:

తుల:

తులా రాశి వారు శాంతి కాముకులుగా ఉంటారు, మరియు తెలివిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు, క్రమంగా జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు ఎక్కువగా కృషి చేస్తుంటారు. అంతేకాకుండా జీవితంలో సామరస్యాన్ని కొనసాగించడానికి వీరికంటూ కొన్ని ప్రత్యేక ప్రణాళికలు ఉంటాయి. వారు తమ కుటుంబానికే కాకుండా, వారి స్నేహితుల కష్టాలను కూడా తమవిగా భావించి సహాయం చేసేందుకు ముందుకు వస్తుంటారు. కాని వారు అవాంఛిత నాటకాలను ఇష్టపడరు. వివాదాస్పద వ్యక్తులతో సమావేశమవ్వడం కన్నా, వారు నడకకు లేదా బీచ్‌లో కొంత సమయం గడపడానికి ఇష్టపడతారు. తులారాశి వారు ఎన్నటికీ హానికరం కాదు మరియు ప్రజలు తరచుగా తప్పులు చేస్తుంటారని, మరియు వారు రెండవ అవకాశానికి అర్హులుగా ఉంటారని కూడా వీరు భావిస్తుంటారు. కావున, వీరు ఎవరితోనూ అంతగా శత్రుత్వాన్ని కొనసాగించరు.

ధనుస్సు:

ధనుస్సు:

ధనుస్సు రాశి విషయానికి వస్తే, వారు జీవితాన్ని తీవ్రంగా పరిగణించటానికి ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా వారు ఎప్పటికప్పుడు, కొత్త విషయాలను ప్రయత్నించడానికి వెనుకాడరు. ఎల్లప్పుడూ ధైర్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, ఉత్తేజకరమైన స్థాయిలను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటారు. ధనుస్సు రాశి వారు, ప్రధానంగా ఆశావాదులుగా ఉంటారు. మరియు వారు జీవితాన్ని పూర్తిస్థాయిలో జీవించడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని క్లిష్ట సమయాల్లో, నాటకాలకు, నిరాశావాద వ్యక్తులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.

మీనం:

మీనం:

మీనరాశి వారు, వారి వారి చట్రంలో నివసించడానికే ఇష్టపడుతుంటారు. కళాత్మకంగా, మరియు సృజనాత్మకత ఉట్టిపడేలా వీరి వ్యవహార శైలి ఉంటుంది. వారి వద్ద నాటకాలకి సమయం ఉండదు. ఎందుకంటే వీరి కళ వీరిని నిరంతరం తీరికలేకుండా ఉంచుతుంది. వీరిలో నాటకీయత అతి తక్కువగా ఉంటుంది. వాస్తవ ప్రపంచంలో ఎన్ని నాటకాలు జరుగుతున్నా, మీనరాశి వారు ఫాంటసీ ప్రపంచంలోనే ఉంటూ తప్పించుకోవడానికి ఇష్టపడతారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Leo, Libra, Pisces: THESE zodiac signs don't take life too seriously

Most of us take life seriously and always think about the future. There are some people, according to astrology, that are experts at living in the moment and never taking life too seriously. We can learn a lot from these spontaneous zodiac signs, especially those of us who tend to live life day to day focusing our efforts on the smaller picture. Read below to find out if your zodiac sign is one of them.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more